ఆర్టీసీ బస్సులో సజ్జనార్
కుటుంబంతో ప్రయాణం
ప్రయాణికులలో స్ఫూర్తినింపే యత్నం
హైదరాబాద్ సిటీలో బస్ డ్రైవర్లపై నిఘా ఉంచాలి
ఆకస్మిక తనిఖీలతో ప్రయోజనం
(సుబ్రహ్మణ్యం విఎస్ కూచిమంచి)
వీసీ సజ్జనార్ అంటే గుర్తుకొచ్చేది మొదటిగా పోలీస్ డ్రెస్. ఆ డ్రెస్‌లో చేసే సాహసాలు. కిరాతక ముఠాల కట్టడి. ఇప్పుడు సజ్జనార్ వేరు. ఆయన ఎప్పటిలానే ప్రజల మనిషి. ఇప్పుడు మరింత బాధ్యతాయుతమైన పదవిలో. ప్రజల ప్రయాణ సాధనం బస్సు. ఆ బస్సుపై గౌరవాన్ని పెంచడమే ధ్యేయంగా పెట్టుకున్నారు. అందుకోసం నడుం బిగించారు. ఆయన దృష్టి మొదట ఆర్టీసీ బస్సులలో కనిపించే అడ్డమైన ప్రకటనలపై పడింది. వెంటనే వాటిని కట్ చేసే దిశగా అడుగులేశారు. అల్లు అర్జున్ నటించిన ఒక ప్రకటనకు సంబంధించి స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చేశారు. ఆర్టీసీని గాడిలో పెట్టి, లాభాల బాటలో పయనింపచేయడానికి ప్రయత్నిస్తున్నారు. అందుకు చేయాల్సిన కృషి అంతా చేస్తున్నారు. V.C. Sajjanar కరోనా కారణంగా చాలామంది బస్సు ఎక్కడం మరిచిపోయారు.
వారిని తిరిగి బస్సెక్కించేందుకు ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే తాను కుటుంబంతో ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. ఆర్టీసీ బస్సు ప్రయాణం సురక్షితం అని చెప్పడం, ఆ మేరకు ప్రచారం చేయడమే దీని వెనుక లక్ష్యం. చాలా మంది అధికారులు ప్రజలకు దగ్గరగా మెలిగి, వారిలో స్ఫూర్తినీ, సంతోషాన్ని నింపడానికి ప్రయత్నిస్తుంటారు. సజ్జనార్ చేసిన ప్రయత్నం ఆర్టీసీకి కాసుల వర్షం కురిపిస్తుందా? ప్రయాణికుల సంఖ్యను పెంచుతుందా? Telugu breaking news
ప్రతి బస్సులో మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ఇతర ప్రజా ప్రతినిధులకు రిజర్వు చేసిన సీట్లు కనిపిస్తాయి. ఆ సీట్లలో అలాంటి వారు ప్రయాణించిన దాఖలాలే ఎప్పుడూ కనిపించవు. అత్యవసరంగా ప్రయాణం చేసిన వారికి సిఫార్సులతో ఆ సీట్లను కేటాయిస్తుంటారు. నిజానికి ప్రజా ప్రతినిధులకు బస్సుల్లో ప్రయాణించాల్సిన అవసరమే లేదు. రాదు కూడా. మీడియాకు ఏదైనా ప్రాజెక్టు చూపించాలంటేనో…పర్యటనలకో వారితో అప్పుడప్పుడు వెడుతుంటారు. అంతే. సజ్జనార్ గారిలాగే మంత్రులు, ఎమ్మెల్యేలు ఇతర ప్రజా ప్రతినిధులూ కూడా ఆకస్మికంగా ఇలాంటి ప్రయాణాలు చేస్తే బాగుంటుంది. ఆర్టీసీ సిబ్బందికీ కాస్త భయం ఉంటుంది. ఇటీవలి కాలంలో హైదరాబాద్ సిటీలో ఆర్టీసీ డ్రైవర్లలో దుందుడుకుతన ఎక్కువైంది. ఎడమ వైపు నుంచి వేగంగా ఓవర్ టేక్ చేస్తున్నారు. ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్నారు. ఇలాంటి అంశాలపై కూడా సజ్జనార్ దృష్టి పెట్టాలి. Latest news