ఏమితెల్వ నోన్ని !…ఎవుసదారున్ని నేను !!

Date:

పొలం దున్నుకొని
పొతంజేసుడే గాని
పొక్కిలి జేసుడు
తెల్వనోన్ని నేను
కాళ్ళుచేతులు నమ్ముకొని
బతుకెల్లదీసుడే గాని ,
కడప ఎత్తుజేసి
కత్తి పాతేటోన్ని గాదునేను
ఎవుసదారున్ని నేను !
ఏమిదెల్వనోన్ని నేను !!
నడుమొంచి నడిజామైనా
పనిజేసేటోన్నే గాని
నమ్మించి మోసం
చేసేటోన్ని గాదునేను
నాదినేను జూసుకొని
నాదానుగుండేటోన్నే గాని
నోరుతో మాట్లాడి నొసలుతో
ఎక్కిరిచ్చేటోన్ని గాదునేను
ఎవుసదారున్ని నేను !
ఏమిదెల్వనోన్ని నేను !!
అన్నం, ఆరోగ్యం ఆయుస్సును
అందించేటోన్నే గాని
కపటం , కావురం,
కన్నేరుతనం తెల్వనోన్ని నేను
ఎద్దు, ఎవుసం, పంటా,
పెంట ఎరిగినోన్ని నేను
పచ్చనిపైరుని జూసి
పరవశించేటోన్ని నేను
ఎవుసదారున్ని నేను !
ఏమిదెల్వనోన్ని నేను !!
మట్టిని నమ్మి మానవత్వాన్ని
పండించేటోన్నే నేను
నారువోసిన పంటతో బ్రతుకు
దిద్దుకునేటోన్ని నేను
పండించిన పంటగొనమంటే
బైరూపుల మాటలెందుకు ?
లేనోన్నే గావచ్చుగాని నేను
లేకోన్నిమాత్రం గాదునేను
ఎవుసదారున్ని నేను !
ఏమిదెల్వనోన్ని నేను !!
ఏరాజ్యం భయపెట్టినా
భయపడేటోన్ని కాను నేను
కాయకష్టం చేసి కాళ్ళమీద
నిలబడేటోన్ని నేను
నీళ్ళందియ్యమంటే మమ్ముల
కన్నీళ్ళ పాల్జేస్తారెందుకు ?
యదార్థం మాట్లాడేటోన్ని నేను
యాడికైనా వచ్చేటోన్ని నేను
ఎవుసదారున్ని నేను !
ఏమిదెల్వనోన్ని నేను !!
(రాజేశ్, 9440460490)Andhra Prades News Live, Telugu news paper, today Telugu news, Telugu news today, online Telugu news, Andhra Pradesh News

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

గణేశ మండపాలకు ఉచిత విద్యుత్తు: రేవంత్

ఖైరతాబాద్ వినాయకునికి సీఎం పూజలుహైదరాబాద్, సెప్టెంబర్ 07 : ఖైరతాబాద్ గణేశ...

పదేళ్లలో కానిది ఎనిమిది నెలల్లో సాకారం

సుసాధ్యం చేసిన జర్నలిస్టు బంధు రేవంత్‌రెడ్డిజె.ఎన్.జె. హోసింగ్ సొసైటీకి రేపు భూమి...

విఘ్నాధిపతి రూపం – విశ్వమానవాళి గుణగణాలకు ఓ సంకేతం

(వాడవల్లి శ్రీధర్)శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజంప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే"శుక్లాంబరధరం అంటే...

నష్టం అపారం … కావాలి కేంద్ర ఆపన్న హస్తం : రేవంత్

ఏపీతో సమానంగా నిధులు కేటాయించాలికేంద్రం తక్షణ సాయం అందించాలిప్రాథమిక అంచనాల ప్రకారం...