పొన్నంకు ‘సాటా’ ఆహ్వానం

0
51

ఎమ్మెల్యే మేడిపెల్లి సత్యానికి కూడా
18 న రియాద్ లో తెలుగు భాషా దినోత్సవం
రియాద్, సెప్టెంబర్ 05
: ఈనెల 18న రియాద్ లో నిర్వహించనున్న ‘తెలుగు భాషా దినోత్సవం’ వేడుకలకు హాజరు కావాల్సిందిగా తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే మేడిపెల్లి సత్యంలను సాటా ఆహ్వానించింది. శుక్రవారంనాడు హైదరాబాద్ లో ‘సాటా’ (సౌదీ అరేబియా తెలుగు అసోసియేషన్) ప్రతినిధి బృందం వారిని కలిసింది. సౌదీ అరేబియాలో సాటా నిర్వహిస్తున్న వివిధ సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు, తెలుగు భాష, సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించడం, ప్రోత్సహించడం, తెలుగు సమాజంలో ఐక్యతను పెంపొందించడానికి చేస్తున్న కృషిని మంత్రికి వివరించింది. విదేశాల్లో నివసిస్తున్న తెలుగు ప్రజలు తమ మాతృభాష, సంస్కృతి, సంప్రదాయాలను కాపాడేందుకు కృషి చేయడం అభినందనీయమని ఈ సందర్భంగా మంత్రి, ఎమ్మెల్యే అన్నారు.

ఈ సమావేశంలో ‘సాటా’ తరఫున మహేష్ కె.పీ., భాస్కర్ రెడ్డి వొంటెల, పవన్ కుమార్ పి., గణపతి రెడ్డి, జవ్వాజి మల్లేశం, నాజియా మిరజ, శికందర్ పాల్గొన్నారు. ‘సాటా’ వ్యవస్థాపకులు మల్లేశన్, వివిధ ప్రాంతల అధ్యక్షులు శ్రీనివాస్ మచ్చ, శార్వాణి విద్యాధరాణి, తేజ పల్లెం, పామిరెడ్డి రామిరెడ్డి, కోర్ టీమ్ సభ్యులు వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here