అధికారం పోయిందనే అక్కసులో కె.సి.ఆర్.: రేవంత్

Date:

చిల్లరగాళ్లను ఉసిగొల్పుతున్న మాజీ సీఎం
కాలకేయ ముఠాలా తెలంగాణాపైకి చిల్లరగాళ్ళు
రాజీవ్ విగ్రహావిష్కరణలో రేవంత్ తీవ్ర విమర్శలు
హైదరాబాద్, సెప్టెంబర్ 16 :
కె.సి.ఆర్.లో అధికారం పోయిందనే అక్కసు పెరిగిపోయిందని, అందుకనే కొంతమంది చిల్లరగాళ్లను తమపైకి ఉసిగొల్పుతోందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఈ కాలకేయ ముఠా మిడతల దండులా తెలంగాణను మింగేసేందుకు మళ్ళీ ఊళ్ళ మీదకు రాబోతోందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలనీ ఆయన పిలుపునిచ్చారు.
సెక్రటేరియట్ ఎదుట మాజీ ప్రధానమంత్రి, భారతరత్న స్వర్గీయ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి ప్రసంగం ఆయన మాటల్లోనే.


 ఇది రాజకీయ వేదిక కాదు..ఇక్కడ రాజకీయాలు ప్రస్తావించడం నాకు ఇష్టం లేదు.
 కానీ కొంతమంది చిల్లరమల్లరగా మాట్లాడేవారికి ఈ వేదికగా నేను కొన్ని విషయాలు గుర్తు చేయదలచుకున్నా..
 అడ్డగోలుగా వేలకోట్లు కూడబెట్టుకున్న వాళ్లకు త్యాగం అంటే ఏమిటో గుర్తు చేయదలచుకున్నా
 దేశ స్వాతంత్య్రం కోసం జైల్లో మగ్గిన చరిత్ర పండిట్ జవహర్ లాల్ నెహ్రూది
 దేశ స్వాతంత్య్రం కోసం సర్వం కోల్పోయిన కుటుంబం నెహ్రూ కుటుంబం.
 563 సంస్థానాలను దేశంలో విలీనం చేయించి దేశ సమగ్రతను కాపాడిన ఘనత నెహ్రూది.
 మతకల్లోలాలతో దేశంలో రక్తం ఏరులై పారుతుంటే దార్శకనికతను ప్రదర్శించి శాంతిని నెలకొల్పింది సెహ్రూ కాదా?.
 ఎడ్యుకేషన్, ఇరిగేషన్ ను మొదటి ప్రాధాన్యతగా తీసుకుని దేశ భవిష్యత్ కు పునాదులు వేసిన ఘనత నెహ్రూది
 నాగార్జున సాగర్ లాంటి ప్రాజెక్టులు నెహ్రు మనకు అందించిన సంపద.


 కొంతమంది సన్నాసులు వారసత్వ రాజకీయల గురించి మాట్లాడుతున్నారు.
 నెహ్రూ బ్రతికి ఉండగా ఇందిరా గాంధీ ఏ పదవి తీసుకోలేదు.
 ఇప్పటికీ ఇందిరమ్మను పేదలు దేవతలా పూజిస్తున్నారు.
 బ్యాంకుల జాతీయకరణ చేసి పేదల అభివృద్ధికి కృషి చేశారు.
 రాజభరణాలు రద్దు చేసి ఘనత ఇందిరాగాంధీ గారిది.
 దళిత, గిరిజన, బలహీన వర్గాల ఆత్మగౌరవం పెరిగేలా భూములు పంచి పెట్టిన ఘనత ఇందిరమ్మది
 పేదోళ్లకు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చి పేదలకు సొంతింటి కలను నిజాం చేసింది ఇందిరమ్మ కాదా?


 లంబాడాలను ఎస్టీలలో చేర్చింది ఇందిరమ్మ కాదా?
 దేశంలో బడుగు బలహీన వర్గాలకు రిజర్వేషన్లు కల్పించింది కాంగ్రెస్ కాదా?
 దేశం కోసం చివరి రక్తపు బొట్టు వరకు కృషి చేసిన త్యాగశీలి ఇందిరమ్మ..
 దేశానికి నాయకత్వ సమస్య వచ్చినపుడు దేశ ప్రజల కోసం ప్రధానిగా రాజీవ్ గాంధీ బాధ్యతలు చేపట్టారు.
 దేశ భవిత యువత చేతుల్లో ఉండాలని 18 ఏళ్లకే ఓటు హక్కు కల్పించింది రాజీవ్ గాంధీ కాదా?
 రాజ్యాంగాన్ని సవరించి గ్రామ పంచాయతీలకు నిధులు చేరేలా సంస్కరణలు తెచ్చిన ఘనత రాజీవ్ గాంధీది కాదా?
 స్థానిక సంస్థల్లో మహిళా రిజర్వేషన్ తీసుకొచ్చింది రాజీవ్ గాంధీ కాదా?
 ఆడబిడ్డలకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పించింది రాజీవ్ కాదా..?
 ఐదేళ్లపాటు మహిళలకు మంత్రివర్గంలో స్థానం ఇవ్వని సన్నాసులకు మహిళల ఆత్మ గౌరవం గురించి ఎలా తెలుస్తుంది.?
 దేశంలో సాంకేతిక విప్లవం తీసుకొచ్చింది రాజీవ్ గాంధీ
 రాజీవ్ గాంధీ దేశానికి కంప్యూటర్ పరిచయం చేసి ఉండకపోతే కేటీఆర్ గుంటూరులో ఇడ్లీ, వడ అమ్ముకునే వాడు.
 లేకపోతే సిద్దిపేటలో చాయ్ అమ్ముకునే వాడు..
 రాజీవ్ గాంధీ కంప్యూటర్ ను పరిచయం చేయడం వల్లే కేటీఆర్ ఈ స్థాయికి చేరారు.
 వాళ్లకు అధికారం పోయినా మదం దిగలేదు..
 రాజీవ్ గాంధీ మరణించినా సోనియమ్మ ఏ పదవీ తీసుకోలేదు.
 2004 నుంచి 2014 వరకు సోనియా, రాహుల్ ఏ పదవీ తీసుకోలేదు.
 ప్రాణ త్యాగం అంటే ఇందిరా, రాజీవ్ లది.
 పదవీ త్యాగం అంటే సోనియా, రాహుల్ గాంధీలది.
 తెలంగాణ బిడ్డ పీవీని దేశ ప్రధానిని చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది.


 దుర్మార్గుల్లా పదేళ్లు రాష్ట్రాన్ని దోచుకుని, పదవులు పంచుకున్న వాళ్లా కుటుంబ పాలన గురించి మాట్లాడేది..
 గడీలలో గడ్డి మొలవాల్సిందేనని ఆనాడు చాకలి ఐలమ్మ చెప్పింది.
 ఐలమ్మ స్పూర్తితో రాజీవ్ విగ్రహం సాక్షిగా చెబుతున్నా మీ ఫామ్ హౌస్ లలో జిల్లెళ్ళు మొలవాల్సిందే..
 అప్పటి వరకు కాంగ్రెస్ కార్యకర్తలు విశ్రమించరు..
 వెయ్యి ఎకరాల్లో ఫామ్ హౌస్, ప్రగతి భవన్ కట్టుకున్న మీకు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టడానికి పదేళ్లు సరిపోలేదా?
 మేం రాజీవ్ విగ్రహం పెడతామనగానే వీళ్లకు తెలంగాణ తల్లి విగ్రహం గుర్తొచ్చిందట..
 దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన రాజీవ్ గాంధీ విగ్రహం ఇక్కడ పెట్టడం సముచితం కాదా అని తెలంగాణ ప్రజలను అడుగుతున్నా.
 రాజీవ్ గాంధీ విగ్రహం తొలగిస్తామని కొందరు సన్నాసులు మాట్లాడుతున్నారు… ఎవడ్రా తొలగించేది… రండి, ఎవడొస్తాడో చూస్తా.
 పదేళ్లు మీకు సోయి లేదు కాబట్టే… మేం సచివాలయంలో తెలంగాణ విగ్రహం ఏర్పాటు చేస్తున్నాం
 తెలంగాణ పరిపాలనకు గుండెకాయ సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేసి చూపిస్తాం..
 డిసెంబర్ 9లోగా తెలంగాణ తల్లి విగ్రహం అక్కడ ఉంటుందని రాష్ట్ర ప్రజలకు మాట ఇస్తున్నాం.
 ఆశ్రయం ఇచ్చిన కొండా లక్ష్మణ్ బాపూజీ చనిపోతే చివరి చూపునకు కూడా వెళ్లని దుర్మార్గుడు కేసీఆర్.
 కానీ మేం IIHT కి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టుకున్నాం
 మహిళా యూనివర్సిటీకి ఐలమ్మ పేరు పెట్టాం
 తెలుగు యూనివర్సిటీకి సురవరం ప్రతాపరెడ్డి పేరు పెట్టాలని నిర్ణయించాం..
 అధికారం పోయిందన్న అక్కసుతోనే కె.సి.ఆర్.లో ఉందనీ, అందుకే కొంతమంది చిల్లరగాళ్లను మా పైకి ఉసిగొల్పుతున్నారనీ చెప్పారు.
 కాలకేయ ముఠా మిడతల దండుగా మారి తెలంగాణను మింగేసేందుకు మళ్లీ ఊళ్లమీదకు రాబోతోంది.
 తెలంగాణ ప్రజలారా అప్రమత్తం కండి…
ఈ మిడతల దండును తెలంగాణ పొలిమేరలకు తరమాలి అంటూ ప్రసంగాన్ని ముగించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

కుల గణనకు ఏక సభ్య కమిషన్: రేవంత్

60 రోజుల్లో నివేదిక : ఆ తరవాతే ఉద్యోగ నోటిఫికేషన్లుకులగణన కమిటీలతో...

Wiki for All: Empowering Voices, Expanding Horizons

Hyderabad, October 08: The Wikimedia Technology Summit 2024 successfully...

Maharashtra: A battle between individuals

(Dr Pentapati Pullarao) Maharashtra is the second largest and richest...

Hurricane claims 50 lives in Florida

Washington: At least 50 people were killed, many injured,...