(డా వి.డి. రాజగోపాల్, 9505690690)
చూశారా ప్రకృతి అంటే ఏమిటో
మేఘం గర్జించింది
ఫలితం విలయతాండవం
రాయలసీమలో కొన్ని నదులు ఉనికిని
కోల్పోయి ఆక్రమణలకు లోనై

ఏమైంది పెన్నానది
ఎక్కడుంది పాపాఘ్ని నది
ఎటుబోయింది చిత్రావతి
యాడబాయరా చెయ్యేరు
అని వెతుకుతున్న తరుణంలో
ఇదిగో నేనున్నాను
చూడండి నాప్రతాపం
అని ఏకంగా జాతీయ రహదారులపై వంతెనలనే కూల గొట్టేంత ఉద్దృతంగా
ప్రవహిస్తూ కబ్జాదారులకు ఓ పాఠం చెప్పింది
విచిత్రం ఏమిటంటే
ఎప్పుడూ వరదలొచ్చినా
పేదలబ్రతుకులకే ముప్పు
ముంపు ప్రదేశాలలో జన జీవనం
ప్రభుత్వం నివారించాలి
అధిక వర్షపాతానికి సిద్ధపడాలి
కాలువలు నదులు మింగేస్తే
జరిగే పరిణామాలు ఇవే
తిరుమలలో కట్టడాలు కట్టడమే గానీ
డ్రైనేజీ గురించి మనం పట్టించుకున్నామా
చివరకు క్యూకాంప్లెక్స్ దారి నీటిమయమంటే
మన ఇంజనీరింగ్ నిపుణత ఏమైంది

మోక్షగుండం విశ్వేశ్వరయ్య
వారసులం మనం
ఇంజనీరింగ్ నిపుణులారా
ఆలోచించండి
ఈ వర్షాలు మనకు కనువిప్పు కావాలి
“మరువ”లేనిది చెరువులుండవు
మరి కపిలతీర్థంలో ఎందుకు లేదు
అలాంటి “మరువ”
ఇవన్నీ మన తప్పిదాలే
తిరుమల వెళ్ళే ఘాట్ రోడ్డు
నిర్మాణమే లోపభూయిష్టం
ఇక పట్టణాలలో డ్రైనేజీ ఎక్కడుంది
చెరువులన్నీ కబ్జాకు గురి
రహదారులే డ్రైనేజీ పాత్ర పోషిస్తుంటే
తప్పవు ఈ అనర్ధాలు
(కవిత రచన రిటైర్డ్ డైరెక్టర్ ఆఫ్ మైన్స్ అండ్ జియాలజీ)