రెండు ఫైల్స్ పై పవన్ తొలి సంతకాలు

0
139

ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతల స్వీకరణ
విజయవాడ, జూన్ 19 :
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బుధవారం విజయవాడలో పదవీ బాధ్యతలు స్వీకరించారు.

వెంటనే రెండు ఫైళ్ళపై సంతకాలు చేశారు. ఉపాధి హామీ పథకాన్ని ఉద్యాన వన సంబంధిత పనులకు అనుసంధానించి నిధుల మంజూరు ఫైలు పైనా, గిరిజన గ్రామాల్లో పంచాయతీ భవనాల నిర్మాణానికి సంబంధించిన ఫైలు పైనా ఆయన సంతకాలు చేశారు.

సాంప్రదాయ పద్దతిలో ఆయన బాధ్యతలను స్వీకరించారు. దేవుని పటాలకు పూజలు చేసి హారతి ఇచ్చిన అనంతరం తన కుర్చీలో కూర్చున్నారు. ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన పవన్ కళ్యాణ్ కి రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ శుభాకాంక్షలు తెలిపారు.

పుష్పగుచ్ఛం ఇచ్చి ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. అనంతరం రాష్ట్ర పర్యాటక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ కూడా ఉప ముఖ్యమంత్రికి శుభాకాంక్షలు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here