సుహృద్భావపూర్వకంగా సాగిందనన్న జనసేనాని
విశాఖపట్నం, నవంబర్ 12: ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశం ప్రభావశీలంగా సాగిందని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ వెల్లడించారు. శుక్రవారం రాత్రి విశాఖపట్నంలో ప్రధానితో సమావేశానంతరం ఆయన పార్టీ నాయకులతో భేటీ అయ్యారు.
ప్రధానితో భేటీ సుమారు 40 నిమిషాల పాటు సాగింది. ఈ భేటీపై పవన్ కళ్యాణ్ సంతృప్తి వ్యక్తంచేశారు. 2014 ఎన్నికలకు ముందు గుజరాత్ రాజధాని గాంధీనగర్లో జరిగినంత ప్రభావశీలంగా ఈ సమావేశం సాగిందని పవన్ కల్యాణ్ పార్టీ నాయకులతో చెప్పారు.
ఆంధ్ర ప్రదేశ్ అభివృద్ధినీ, తెలుగు ప్రజల ఐక్యత గురించి చర్చించారు. రాష్ట్రానికి సంబంధించిన ముఖ్య విషయాలను పవన్ కళ్యాణ్ మోడీకి సవివరంగా తెలియచేశారు. యువత అభ్యున్నతికి అవసరమైన ఆర్థికాభివృద్ధి రాష్ట్రానికి ఎంత అవసరమో ప్రధాన మంత్రి దృష్టికి తీసుకు వెళ్లారు.