హైదరాబాద్, జనవరి 17 :నారా లోకేశ్ తనకు కొవిడ్ సోకినట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని ట్విటర్ ద్వారా తెలియజేశారు. లక్షణాలు ఏమీ లేవనీ, అయినా కొవిడ్ పాజిటివ్‌గా పరీక్షలలో తేలిందని తెలిపారు. తగ్గేవరకూ హోం ఐసొలేషన్‌లో ఉంటానని చెప్పారు.
ఇటీవలి కాలంలో తనను కలిసిన వారందరూ పరీక్ష చేయించుకోవాలని సూచించారు. తగిన జాగ్రత్తలు తీసుకుంటూ అందరూ జాగ్రత్తగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.