Monday, March 27, 2023
HomeArchieveవైద్య వ్య‌వ‌స్థ‌లో ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ వినియోగం

వైద్య వ్య‌వ‌స్థ‌లో ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ వినియోగం

ఏపీ సీఎం వైయ‌స్ జ‌గ‌న్ సూచన‌
కొవిడ్‌పై సమీక్ష‌లో అధికారుల‌కు సీఎం ఆదేశాలు
ప్రికాష‌న్ డోస్‌పై కేంద్రానికి లేఖ రాయాల‌ని నిర్ణ‌యం
వ్యాక్సినేష‌న్‌పై దృష్టి పెట్టాలన్న జ‌గ‌న్‌
అమరావతి, జ‌న‌వ‌రి 17:
కొవిడ్ వేరియంట్ ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేప‌థ్యంలోఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని అధికారులు తెలిపారు. కొవిడ్ ప‌రిస్థితుల‌పై ఏపీ సీఎం జ‌గ‌న్ సోమ‌వారం నిర్వ‌హించిన స‌మీక్ష‌లో వారు ఏ విధంగా స‌న్న‌ద్ధ‌మ‌వుతున్న‌దీ వివ‌రించారు. రెండో వేవ్‌తో పోల్చిచూస్తే… ఆస్పత్రుల్లో కోవిడ్‌ చికిత్సకోసం పడకల సంఖ్యను కూడా పెంచామ‌ని అధికారులు చెప్పారు. అన్నిజిల్లాల్లో 53,184 పడకలు సిద్ధంగా ఉన్నాయన్నారు. దాదాపు 27వేల యాక్టివ్‌ కేసుల్లో కేవలం 1100 మంది మాత్రమే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని అధికారులు తెలిపారు. వీరిలో ఆక్సిజన్‌ అవసరమైన వారి సంఖ్య 600 మంది మాత్రమేనన్నారు. ఈ సంద‌ర్బంగా సీఎం జ‌గ‌న్ మాట్లాడుతూ వైద్య‌ప‌ర‌మైన అవ‌స‌రాల‌ను గుర్తించాల‌ని అధికారుల‌కు సూచించారు. ఆక్సిజ‌న్‌, మందులు సిద్ధం చేయాల‌న్నారు. గ‌తంలో మాదిరిగా కాకుండా వారం రోజులకే పేషంట్స్ ఆస్ప‌త్రుల నుంచి డిశ్చార్జి అవుతున్నార‌ని అధికారులు తెలిపారు. నియోజకవర్గానికి ఒక కోవిడ్‌కేర్‌ సెంటర్‌ను గుర్తించామ‌నీ, 28వేల బెడ్లను సిద్ధంచేశామనీ వివ‌రించారు. 104 కాల్‌సెంటర్‌పై సమీక్షిస్తూ కాల్‌సెంటర్‌ల‌ను స‌మ‌ర్థంగా పనిచేయించాలని సీఎం ఆదేశించారు. టెలిమెడిసిన్‌ ద్వారా కాల్‌చేసిన వారికి వైద్యం అందేలా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.


ప్రికాషన్‌ డోస్‌ వేసుకునేందుకు ఇప్పుడున్న 9 నెలల వ్యవధిని 6 నెలలకి తగ్గించాలని కోరుతూ కేంద్రానికి లేఖరాయాలని సీఎం నిర్ణయించారు. ఈ వ్యవధిని 3 నుంచి 4 నెలలు తగ్గించే దిశగా ఆలోచించాలని ఆ లేఖ‌లో ప్ర‌తిపాదించాల‌నీ కూడా నిర్ణ‌యించారు. దీనివల్ల ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు, అత్యవసర సర్వీసులు అందిస్తున్న వారికి ఉపయోగమని అభిప్రాయం సమావేశంలో వెల్ల‌డైంది. ఆస్పత్రిపాలు కాకుండా చాలామందిని కోవిడ్‌నుంచి రక్షించే అవకాశం ఉంటుందన్నారు.


వ్యాక్సినేషన్‌పై దృష్టి పెట్టాలి
రెండో డోస్‌ వ్యాక్సినేషన్‌లో మిగతా జిల్లాలతో పోలిస్తే త‌క్కువ స్థాయిలో ఉన్న ఐదు జిల్లాలపై ప్రత్యేక దృష్టిపెట్టాలని సీఎం ఆదేశించారు. 15 నుంచి 18 ఏళ్లవారికీ నెల్లూరు, ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలు 100శాతం వ్యాక్సినేషన్‌ను పూర్తిచేశాయ‌నీ, మరో 5 జిల్లాల్లో 90 శాతానికిపైగా వ్యాక్సినేషన్‌ పూర్తయ్యింద‌నీ, నాలుగు జిల్లాల్లో 80శాతానికిపైగా వ్యాక్సినేషన్ అయ్యింద‌న్నారు. మిగిలిన జిల్లాల్లోనూ వ్యాక్సినేషన్ ప్ర‌క్రియ‌ను చేయాలని సీఎం ఆదేశించారు.
కొత్త మెడికల్‌కాలేజీల నిర్మాణ ప్రగతిపైనా సీఎం సమీక్షించారు. ఆరోగ్య శ్రీపై పూర్తి వివరాలు తెలిపేలా విలేజ్, వార్డ్‌ క్లినిక్స్‌లో, ప్రభుత్వ ఆస్పత్రుల్లో పెద్ద హోర్డింగ్స్‌పెట్టాలని సీఎం ఆదేశించారు. ఆరోగ్య శ్రీ రిఫరల్‌ పాయింట్‌గా క్లినిక్స్‌ వ్యవహరించాలని, వైద్యంకోసం ఎక్కడకు వెళ్లాలన్నదానిపై పూర్తి వివరాలతో సమాచారం లభించేలా చూడాల‌ని జ‌గ‌న్ కోరారు.


ఆరోగ్య శ్రీ కింద రోగులకు సమర్థంగా సేవలందించాలని సీఎం జ‌గ‌న్ సూచించారు. విలేజ్‌క్లినిక్‌కు వెళ్లినా, పీహెచ్‌సీ, నెట్‌వర్క్‌ ఆస్పత్రి … ఇలా పేషెంట్‌ ఎక్కడకు వెళ్లినా.. వారి ఆరోగ్య పరిస్థితిని వెంటనే తెలుసుకుని, వైద్యంకోసం ఎక్కడకు పంపాలన్న విధానం చాలా పటిష్టంగా ఉండాలని సూచించారు. 104, 108, పీహెచ్‌సీలు, ఇతర ఆరోగ్య కేంద్రాల్లో ఉండే డాక్టర్లు కూడా ఈ ప్రక్రియలో భాగమయ్యేలా, వారికి మంచి సేవలు అందించేలా ఈ రిఫరెల్‌ విధానం ఉండాలని సూచించారు. ఆరోగ్య మిత్రలు కీలకంగా వ్యవహరించాలని ఆదేశించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని ఈ సేవల సమన్వయం కోసం యాప్‌ పనిచేయాలని సీఎం జ‌గ‌న్ సూచించారు.

ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌(ఏఐ) వినియోగంపై కూడా దృష్టి పెట్టాలనీ, దీనివ‌ల్ల వ్యవస్ధ మరింత బలపడుతుందనీ సీఎం అభిప్రాయ‌ప‌డ్డారు. రిఫరల్‌ వ్యవస్ధలో ఏఐ వాడగలిగితే మరింత పారదర్శకంగా ఉంటుందన్నారు. ఈ సమీక్షా సమావేశంలో ఉప ముఖ్యమంత్రి (వైద్య ఆరోగ్యశాఖ) ఆళ్ల కాళీ కృష్ణశ్రీనివాస్, సీఎస్‌ సమీర్‌ శర్మ, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌ కుమార్‌ సింఘాల్, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి (కోవిడ్‌ మేనేజిమెంట్‌ అండ్‌ వ్యాక్సినేషన్‌) ముద్దాడ రవిచంద్ర, ఆర్ధికశాఖ కార్యదర్శి ఎన్‌ గుల్జార్, 104 కాల్‌ సెంటర్‌ ఇంఛార్జి ఎ బాబు, వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక కార్యదర్శి జీ ఎస్‌ నవీన్‌ కుమార్, ఆరోగ్యశ్రీ సీఈఓ వి వినయ్‌ చంద్, ఏపీఎంఎస్‌ఐడీసీ వీసీ అండ్‌ ఎండీ డి మురళీధర్‌రెడ్డి, వైద్య ఆరోగ్యశాఖ డైరెక్టర్ (డ్రగ్స్‌) రవిశంకర్‌ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

Shankar Chatterjee on CM commissions Ramco Cement unit
Kishore kumar on Jagan consoles Pulapatturu
శ్రీపాద శ్రీనివాస్ on నిప్పచ్చరం – ఉషశ్రీ