అఖిలేశ్ యూ టర్న్?
అసెంబ్లీ ఎన్నికల బరిలోకి
ప్రస్తుతం అజామ్‌బాద్ ఎంపీ
(సుబ్రహ్మణ్యం విఎస్ కూచిమంచి)
ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, అజామాబాద్ ఎంపీ అఖిలేశ్ యాదవ్ అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగబోతున్నారా? ఎందుకు? అంటే ఓటర్లకు రాంగ్ మెసేజ్ వెళ్ళకుండా ఉండేందుకు. కొద్ది కాలం క్రితం అఖిలేశ్ తాను అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనని ప్రకటించిన సంగతి తెలిసిందే. మళ్ళీ ఇప్పుడు ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నారు. బీజేపీ ప్రాభవం యూపీలో తగ్గుతోందని భావిస్తున్న ఆయన తాను నేరుగా రంగంలోకి దూకాలనుకుంటున్నారు. మరో ముఖ్య కారణం ములాయం కోడలు అపర్ణ బీజేపీలో చేరుతుండడం. కొందరు మంత్రులు ఇప్పటికే సమాజ్‌వాదీ పార్టీలో చేరారు. సమాజ్‌వాదీలో ఉన్నప్పటికీ ములాయం కోడలు ఆది నుంచి బీజేపీ కార్యక్రమాలకు వత్తాసు పలుకుతూ వస్తున్నారు. స్వచ్ఛభారత్, ట్రిపుల్ తలాఖ్, తదితర నిర్ణయాలను ఆమె సమర్థించారు. ఆమె బీజేపీలో చేరారు. ఎన్నికల తరుణంలో ఈ పరిణామం తిరిగి అధికారంలోకి రావాలని ఆకాంక్షిస్తున్న అఖిలేశ్‌ని పునరాలోచనలో పడేసి ఉంటుంది. ఎంపీగా పార్టీ ప్రచారంలో పాల్గొనడం వేరు…బరిలో దిగి ప్రచారం చేయడం వేరు. ఈ సిద్దాంతం అవగతం అయి ఉంటుంది. అందుకే యూ టర్న్ తీసుకోబోతున్నట్లున్నారు.
బీజేపీలో చేరిన ములాయం కోడలు అపర్ణ
Date: