బీజేపీలో చేరిన ములాయం కోడలు అపర్ణ‌

Date:

అఖిలేశ్ యూ ట‌ర్న్‌?
అసెంబ్లీ ఎన్నిక‌ల బ‌రిలోకి
ప్ర‌స్తుతం అజామ్‌బాద్ ఎంపీ
(సుబ్ర‌హ్మ‌ణ్యం విఎస్ కూచిమంచి)

ఉత్త‌ర ప్ర‌దేశ్ మాజీ ముఖ్య‌మంత్రి, అజామాబాద్ ఎంపీ అఖిలేశ్ యాద‌వ్ అసెంబ్లీ ఎన్నిక‌ల బ‌రిలోకి దిగ‌బోతున్నారా? ఎందుకు? అంటే ఓట‌ర్లకు రాంగ్ మెసేజ్ వెళ్ళ‌కుండా ఉండేందుకు. కొద్ది కాలం క్రితం అఖిలేశ్ తాను అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌న‌ని ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. మ‌ళ్ళీ ఇప్పుడు ఆ నిర్ణ‌యాన్ని వెన‌క్కి తీసుకుంటున్నారు. బీజేపీ ప్రాభ‌వం యూపీలో త‌గ్గుతోంద‌ని భావిస్తున్న ఆయ‌న తాను నేరుగా రంగంలోకి దూకాల‌నుకుంటున్నారు. మ‌రో ముఖ్య కార‌ణం ములాయం కోడ‌లు అప‌ర్ణ బీజేపీలో చేరుతుండ‌డం. కొంద‌రు మంత్రులు ఇప్ప‌టికే స‌మాజ్‌వాదీ పార్టీలో చేరారు. స‌మాజ్‌వాదీలో ఉన్న‌ప్ప‌టికీ ములాయం కోడ‌లు ఆది నుంచి బీజేపీ కార్య‌క్ర‌మాల‌కు వ‌త్తాసు ప‌లుకుతూ వ‌స్తున్నారు. స్వ‌చ్ఛ‌భార‌త్‌, ట్రిపుల్ త‌లాఖ్‌, త‌దిత‌ర నిర్ణ‌యాల‌ను ఆమె స‌మ‌ర్థించారు. ఆమె బీజేపీలో చేరారు. ఎన్నిక‌ల త‌రుణంలో ఈ ప‌రిణామం తిరిగి అధికారంలోకి రావాల‌ని ఆకాంక్షిస్తున్న అఖిలేశ్‌ని పున‌రాలోచ‌న‌లో ప‌డేసి ఉంటుంది. ఎంపీగా పార్టీ ప్ర‌చారంలో పాల్గొన‌డం వేరు…బ‌రిలో దిగి ప్ర‌చారం చేయ‌డం వేరు. ఈ సిద్దాంతం అవ‌గ‌తం అయి ఉంటుంది. అందుకే యూ ట‌ర్న్ తీసుకోబోతున్న‌ట్లున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

మీది ఉద్యోగం కాదు… భావోద్వేగం

ఎస్.ఐ.ల పాసింగ్ అవుట్ పెరేడ్లో సీఎం రేవంత్కాస్మటిక్ పోలీసింగ్ కాదు... కాంక్రీట్...

గాంధీ గారి కుర్చీ

(డా నాగసూరి వేణుగోపాల్, 9440732392)2024 సెప్టెంబర్ 9వ తేదీన నేను మద్రాసులో...

తెలంగాణను ట్రిలియన్ డాలర్ల స్థాయికి చేరుస్తాం

మా డిమాండ్ నెరవేరిస్తే కేంద్రానికి సహకరిస్తాంఫైనాన్స్ కమిషన్ సమావేశంలో రేవంత్ ప్రకటనహైదరాబాద్,...

పర్యావరణ హితంగా గ్రీన్ ఫార్మా సిటీ అభివృద్ధి

ముందుకు వస్తున్న ప్రముఖ కంపెనీలుమౌలిక సౌకర్యాల కల్పన వేగిరపరచాలిఫార్మా సిటీ ప్రణాళికలపై...