స్వయంగా పాడె మోసిన ప్రధాని మోడీ
తల్లి మాటలు గుర్తుచేసుకున్న ప్రధాని
ప్రధాని మోడీకి మాతృవియోగం
ఈరోజు తెల్లవారుఝామున తుది శ్వాస
గాంధీనగర్, డిసెంబర్ 30: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తల్లి హీరాబెన్ మోడీ అస్తమించారు. ఆమె వయసు వంద సంవత్సరాలు. రెండు రోజుల పాటు స్వల్పఅనారోగ్యంతో బాధపడ్డారు. 1923 జూన్ 18న పాలన్‌పూర్‌లో జన్మించారు. తల్లి మరణ మార్త వినగానే మోడీ అహ్మదాబాద్‌కు బయలుదేరి వెళ్ళారు. హీరాబెన్ భౌతిక కాయాన్ని మోడీ సోదరుని ఇంట్లో ఉంచారు. వందేళ్ళ పరిపూర్ణ జీవితం భగవంతుని పాదాల వద్దకు చేరింది. ఆమె జీవితం విలువలతో కూడినదనీ, నిస్వార్థమైనదనీ పేర్కొంటూ మోడీ శుక్రవారం ఉదయం ట్వీట్ చేశారు. ఆమె జీవితం అందరికీ ఆదర్శమని తెలిపారు.
వందో పుట్టిన రోజున అమ్మను కలిసినప్పుడు చెప్పిన మాటలను ఎప్పటికీ మరువలేనని మోడీ తెలిపారు. తెలివిగా పనిచేయాలీ, స్వచ్ఛంగా జీవనం సాగించాలని అమ్మ నాకు చెప్పిందని ప్రధాని చెప్పారు.
మోడీ తన తల్లి పాడె మోసి కృతజ్ఞత తెలుపుకున్నారు. ఆయన సోదరులతో కలిసి మోడీ పాడెను మోశారు. అంతిమయాత్ర వాహనంలో కూర్చుని మోడీ ప్రయాణించారు. మోడీ అహ్మదాబాద్ చేరిన వెంటనే.. అంత్యక్రియల కార్యక్రమం ప్రారంభమైంది. తొలుత ఆయన తల్లి పార్ఘివ దేహం వద్ద నివాళులు అర్పించారు. గాంధీనగరలోని సెక్టార్ 30లో ఆమె అంత్యక్రియలను నిర్వహించారు.
సంతాపాల వెల్లువ
మోడీ తల్లి మృతికి సంతాపాలు వెల్లువెత్తుతున్నాయి. జాతీయ, అంతర్జాతీయ నాయకులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు మోడీ తమ సానుభూతిని తెలియజేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ మాతృమూర్తి హీరా బెన్ మరణం పట్ల ముఖ్యమంత్రి కె. చంద్ర శేఖర్ రావు సంతాపం ప్రకటించారు. ప్రధానికి, వారి కుటుంబ సభ్యులకు సీఎం కేసిఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోడీకి సానుభూతిని తెలిపారు. మోడీ తల్లి మృతికి సంతాపం ప్రకటించారు.