ఇంట్లో తూలిపడ్డ బెంగాల్ సీఎం
కలకత్తా, మార్చి 14 : పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ ప్రమాదానికి గురయ్యారు. ఒక కార్యక్రమానికి వెళ్లి వచ్చిన ఆమె గురువారం రాత్రి తన ఇంటిలో కాలు జారి పడ్డారు. ఆ సమయంలో ఆమె నుదురుకు తీవ్ర గాయం అయ్యింది. వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు.
పూర్తివివరాలు తెలియాల్సి ఉంది. మమతా గాయానికి సంబంధించిన ఫోటోలను ఆమె ఆఫీసియల్ ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఆమె సత్వరం కోలుకోవాలని ఆ రాష్ట్ర బిజెపి నేతలు ఆకాంక్షించారు. కిందటి ఎన్నికల సమయంలో కూడా ఆమెకు కాలు ఫ్రాక్చర్ అయ్యింది. వీల్ చైర్లోనే ఆమె ప్రచారం చేసి ఘన విజయం సాధించారు.