ఐసీయూలో చికిత్స
ముంబై, డిసెంబర్ 11: భారత రత్న లతా మంగేష్కర్ కరోనా బారిన పడ్డారు. ఆమెకు కరోనా పాజిటివ్ నిర్థారణ కావడంతో ఆస్పత్రిలో చేర్చారు. ముంబైలోని బ్రీచ్ కాండీ ఆస్పత్రిలో లత చికిత్స పొందుతున్నారు. ఐసీయూలో ఉంచి చికిత్సి అందిస్తున్నట్లు తెలుస్తోంది. భారత దేశం గర్వించదగ్గ గాయకులలో ఆమెది అగ్ర స్థానం. ఒమిక్రాన్ కేసులు దేశంలో పెరుగుతున్నాయి. ప్రస్తుతం కొవిడ్ బారిన పడిన వారిలో ప్రముఖులున్నారు. జెపి నడ్డా, రాజ్ నాథ్ సింగ్, కొందరు ముఖ్యమంత్రులు కరోనా బారిన పడ్డారు. దేశంలో కేసులు ఇబ్బడిముబ్బడిగా పెరుగుతున్నాయి. కేసులు పెరుగుతున్నప్పటికీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. అప్రమత్తంగా ఉంటూ, తగిన జాగ్రత్తలు తీసుకుంటే కరోనా సోకదనీ, ఒకవేళ సోకినా ప్రమాదం లేదనీ అంటున్నారు.
లతా మంగేష్కర్కు కరోనా
Date: