ఒలింపిక్ షటిల్ సెమిస్ లో లక్ష్య సేన్

Date:

2 – 1 తేడాతో తైపే ఆటగాడు చిత్తు
పారిస్, ఆగస్టు 02 :
భారత షటిల్ ప్లేయర్ లక్ష్య సేన్ ఒలింపిక్ మెన్స్ సింగిల్స్ పోటీలో సెమి ఫైనల్లో ప్రవేశించాడు. రజత పతకం ఖాయమైంది. తొలి సెట్ 19 – 21 కోల్పోయిన లక్ష్య, రెండో సెట్లో కొదమసింహంలా విజృంభించాడు. 21 – 15 తేడాతో గెలుచుకున్నాడు. మూడో సెట్లో 21-12 తేడాతో విజయం సాధించాడు. భారతీయుల మోములో చిరునవ్వులు చిందించాడు.
చైనా తైపీకు చెందిన చౌ తో జరిగిన ఈ పోటీలో లక్ష్య అసాధారణ ఆట తీరును కనబరిచాడు. మెరుపు రాలీలతో దూసుకుపోయాడు. ముఖ్యంగా మూడో సెట్ అతని నైపుణ్యానికి అద్దం పట్టింది. మొదటి సెట్ కోల్పోయినప్పటికీ సేన్ ఆత్మస్థైర్యం కోల్పోకుండా పోరాడి గెలిచాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

గణేశుని పూజిస్తే మౌస్ క్లిక్ చేసినట్టే…

నిరాడంబరుడు… విఘ్నలను తొలగించే రాజు(డా. పురాణపండ వైజయంతి)మౌస్‌ని ఒక్కసారి క్లిక్‌ చేస్తే...

గణేశ మండపాలకు ఉచిత విద్యుత్తు: రేవంత్

ఖైరతాబాద్ వినాయకునికి సీఎం పూజలుహైదరాబాద్, సెప్టెంబర్ 07 : ఖైరతాబాద్ గణేశ...

పదేళ్లలో కానిది ఎనిమిది నెలల్లో సాకారం

సుసాధ్యం చేసిన జర్నలిస్టు బంధు రేవంత్‌రెడ్డిజె.ఎన్.జె. హోసింగ్ సొసైటీకి రేపు భూమి...

విఘ్నాధిపతి రూపం – విశ్వమానవాళి గుణగణాలకు ఓ సంకేతం

(వాడవల్లి శ్రీధర్)శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజంప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే"శుక్లాంబరధరం అంటే...