మంచికి మంచి… చెడుకు చేదు
ఏ పాత్ర వేసిన ఒదిగిపోయే నట దిగ్గజం
(రోచిష్మాన్, 9444012279)
తెలుగు సినిమాలో వచ్చిన ప్రతిభావంతమైన నటుల్లో ఒకరు కోట శ్రీనివాసరావు.
ఎస్.వీ. రంగారావు తరువాత ఆ తరహా మోల్డ్ ఉన్న నటుడు కోట శ్రీనివాసరావు.
ఏం చేస్తున్నా, ఎంత చేస్తున్నా ‘అతి’ లోకి పడిపోకుండా ఉండడం తెలిసిన గొప్ప నటుడు కోట శ్రీనివాసరావు. (మన బ్రహ్మానందం, తమిళ్ష్‌లో వడివేలు ఈ ఇద్దరూ కూడా ఈ కోవలోని నటులు)
రజనీకాంత్ బహిరంగంగానే కోట ప్రతిభను కొనియాడారు.
గణేశ్ సినిమాలో కోట నటన అత్యంత గొప్పగా ఉంటుంది. ప్రతిఘటన సినిమాలో ఆయన నటన అందరినీ ఆకర్షించింది. ప్రతిఘటన తమిళ్ష్‌లో డబ్బై విజయవంతమైనప్పుడు తమిళ్షులు కూడా కోటను మెచ్చుకున్నారు.
Performance అన్నదానికి ఒక epitome కోట శ్రీనివాసరావు.

నటించడం కన్నా ముందు ఆ నటనపై సరైన దృక్పథం ఉండాలి; ఎలా నటించాలి అన్నదానిపై స్వకీయమైన ప్రణాళిక ఉండాలి. దిలీప్ కుమార్, ఎన్.టీ. రామారావు, ఎస్.వీ. రంగారావు, కమల్ హాసన్, మమ్ముట్టి, మోహన్ లాల్ వంటి నటులకు ఆ ప్రణాళిక ఉంటుంది. మన కోటకు కూడా ఆ ప్రణాళిక ఉంది. Designed performance కోట శ్రీనినాస్‌ది. అభినయం, ఆంగికం, వాచికం ఈ మూడింటా కోట ఒక ఆరింద.
ఎన్నో పాత్రల్లో గొప్పగా నటించారు కోట. తన తెలుగు నటనతో ఇతరుల చేత కూడా ప్రస్తుతించబడ్డారు కోట.

కోట శ్రీనివాసరావు ఒక cult actor. తెలుగు సినిమా ద్వారా వచ్చిన అరుదైన cult actor కోట శ్రీనివాసరావు. దుష్ట, హాస్య పాత్రల పరంగా కోట శ్రీనివాసరావు cult భారతదేశంలో మరో భాష సినిమాలో లేదు.
కోట శ్రీనివాస్ పేరుపై ఒక ప్రభుత్వ పురస్కారం అమలు చెయ్యడం సమంజసంగా ఉంటుంది. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఈ మేరకు కార్యాచరణ చెయ్యాలి.

కోట శ్రీనివాసరావుకు స్మృత్యంజలి.

(వ్యాస రచయిత ప్రముఖ విమర్శకుడు)

