నాలుగు కిలోమీటర్లలో 68 శవాలు

Date:

చంద్రబాబు సమర్థకు తొలి పరీక్ష ఈ సైక్లోన్
ఉరుము లేని పిడుగు తరువాత….
ఎక్కడ చూసినా మృతదేహాలు … నేల వాలిన కొబ్బరి చెట్లు
ఈనాడు – నేను: 26
(సుబ్రహ్మణ్యం వి.ఎస్. కూచిమంచి)
తుపాను తీరం దాటిన మూడో రోజు అనుకుంటా… ఒ.ఎన్.జి.సి. అధికారులు సముద్రంలో ఉన్న తమ ఆయిల్ రిగ్గులు ఎలా ఉన్నాయో చూసుకోవడానికి హెలీకాఫ్టర్లో బయలుదేరారు. ఆ విషయాన్ని అప్పటి చీఫ్ రిపోర్టర్ నవీన్ పెద్దాడ గారికి చెప్పారు. వస్తానంటే తీసుకువెడతామనడంతో, ఆయన మేనేజర్ అనుమతి తీసుకుని బయలుదేరారు. ఆయన వచ్చిన తరవాత చెప్పిన విషయాలు తలుచుకుంటే ఇప్పటికీ భయం వేస్తుంది. గుండెలు గబగబా కొట్టుకుంటాయి. ఒ.ఎన్.జి.సి. కృష్ణ గోదావరి బేసిన్లో చమురు, సహజ వాయు నిక్షేపాలను వెలికితీస్తోంది. తూర్పు గోదావరి జిల్లాలో అది ముమ్మరంగా సాగుతోంది. ఆఫ్ షోర్ అంటే సముద్రంలో ఆ సంస్థకు రిగ్గులు ఉన్నాయి. వాటిని చూసేందుకు హెలీకాఫ్టర్లో వెడుతున్నప్పుడు… వందల సంఖ్యలో మృతదేహాలు సముద్రపు అలలపై తేలుతూ కనిపించాయట. ఆ దృశ్యమే భీతావహంగా ఉందని నవీన్ గారు చెబుతుంటే భయమేసింది. కళ్లారా చూసిన ఆయనకు ఎలా ఉండివుంటుందో ఊహించుకోవచ్చు.

పదుల సంఖ్య వందలైన వేళ
ఆ సంఘటన వరకూ ప్రభుత్వం మృతుల సంఖ్యను పదుల సంఖ్యలో చెబుతూ వచ్చింది. ఒ.ఎన్.జి.సి. బృందం పరిశీలన అనంతరం ఇది వందల సంఖ్యకు చేరింది. సంస్థ రిగ్గులు బాగా దెబ్బతిన్నాయి. సాధారణంగా రిగ్గుల నుంచి పైకి వచ్చే సహజ వాయువు నిత్యాగ్ని హోత్రంలా మండుతూ ఉంటుంది. ఒక్క రిగ్గు నుంచి కూడా మంటలు లేవు. వాటిని పనిచేయించాలి అంటే కొన్ని రోజులు పడుతుందన్న నిర్ధారణకు వచ్చారు. సముద్రం మీదకి వెళ్లిన బృందం చూసి రావడం తప్ప ఏమీ చేయలేని స్థితి. అప్పుడు నావికా దళం రంగంలోకి దిగింది. మృతదేహాలను ఒడ్డుకు చేర్చింది.

నష్టం అపారం… వర్ణనాతీతం
మరొక వంక పంట నష్టం అపారం. ఆస్తి నష్టం చెప్పనలవి కాదు. కొబ్బరి తోటలకు వాటిల్లిన నష్టం వర్ణనాతీతం. తోట యజమానులకు కలిగిన గుండె కోత ఎప్పటికీ తీరనిది. కొబ్బరి చెట్టు అంటే యజమానికి సంతానంతో సమానం. కొబ్బరి చెట్టు పోతే, సొంత కొడుకు పోయినట్లు బాధపడతారు వారు. ఒకేసారి లక్షల సంఖ్యలో చెట్లు నేలకూలితే… మరి కొన్ని వేల చెట్లు మొవ్వును కోల్పోతే… వాటిని చూసిన యజమాని మనస్సు ఎలా ఉంటుందో మాటలలో చెప్పగలమా? కోనసీమ అంతటా ఇవే దృశ్యాలు… తోటల యజమానులు గుండెలు బాదుకుని విలపిస్తున్న ఘటనలు. అన్ని పత్రికలూ ఇలాంటి దయనీయ వార్తలకు ప్రాధాన్యతను ఇచ్చాయి.

కార్యరంగంలోకి దూకిన చంద్ర బాబు
1995 సెప్టెంబర్ ఒకటో తేదీన నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా మొదటిసారి బాధ్యతలు స్వీకరించారు. ఇంకా పరిపాలనలో కుదురుకుంటున్న దశలో ఉన్నారు. ఏడాది తిరిగిందో లేదో… ఈ ఉత్పాతం. అది ఆయన సమర్థతకు పరీక్షగా నిలిచింది. అప్పటికీ ఎంతమేరకు చెయ్యాలో అంతా చేశారు. పరిస్థితి తీవ్రత దృష్ట్యా రాజమండ్రిలో మినీ సెక్రటేరియట్ ఏర్పాటు చేశారు. కోనసీమ కుదురుకునే వరకూ రాజమండ్రిలో ఉన్నారు. అధికారులకు దిశానిర్దేశం చేశారు. సహాయ కార్యక్రమాలను స్వయంగా పర్యవేక్షించారు. సీఎం స్వయంగా రంగంలో ఉన్నప్పుడు అధికారులు కూడా అప్రమత్తంగా మెలిగారు. సీమను చూడడానికి వచ్చే కేంద్ర, రాష్ట్ర మంత్రులు, అధికారులతోనూ, నష్టం అంచనా వేసే పనితోనూ గడిచిపోయింది. నాలుగు రోజుల పాటు కొనసాగిన తుపాను ప్రభావం తగ్గిన తరవాత జిల్లాలో అధికార గణం విశ్రమించింది.

చంద్ర బాబు కంట నీరు
తీర గ్రామాలకు వెళ్లిన మాకు శవాల గుట్టలు కనిపించాయి. దుర్గంధం భరించలేక సతమతమయ్యేవాళ్లం. బతికున్నవాళ్లు హెలికాప్టర్ల ద్వారా జారవిడిచిన ఆహారం ప్యాకెట్ల కోసం పాకులాడిన తీరు చూసి బాధేసేది” అని రాజమండ్రి ఈనాడులో అప్పటి చీఫ్ రిపోర్టర్ పెద్దాడ నవీన్ చెప్పారు. ఆనాటి తుపాను బీభత్సాన్ని తన కలంతో కళ్ళకు కట్టేలా రాశారు.
”నేను రాజమండ్రి కేంద్రంగా వార్తలు కవర్ చేస్తున్నాను. నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజమండ్రి లోనే క్యాంప్ ఆఫీసు పెట్టారు. ఆర్డీవో ఆఫీసును కేంద్రంగా చేసుకుని సీఎం 15 రోజులున్నారు. పునరావాస, సహాయ కార్యక్రమాల పర్యవేక్షణకు స్వయంగా ఆయనే ప్రత్యక్షంగా బాధ్యత తీసుకున్నారు. ముఖ్యమంత్రితో కలిసి ప్రత్యేక హెలికాప్టర్ లో ఐదు రోజుల పాటు ఆయా ప్రాంతాలకు వెళ్లాను. కాట్రేనికోన మండలంలో ఓ చోట దుస్థితిని చూసి నాకు దుఃఖం ఆగలేదు. చంద్రబాబు కూడా కళ్ళనీళ్ళు పెట్టుకున్నారు” అని ఆయన తెలిపారు.


నాలుగు కిలోమీటర్లు .. 68 శవాలు
”బ్రహ్మ సముద్రం దగ్గర తీరం వెంబడి నాలుగు కిలోమీటర్ల పొడవునా 68 శవాలు నాతో పాటు ఉన్న మరో విలేకరి కంటబడ్డాయి. వాటిని ఫొటోలు కూడా తీశాము. రోజుకి 13 కి.మీలు నడుచుకుంటూ, దారిలో పడిపోయిన చెట్లు దాటుకుంటూ తిరిగాము” అంటూ ఆయన తెలిపారు.

ఈ స్థాయి తుపాను ఎప్పుడూ లేదు…
కోనసీమలో అనేక తుపాన్లు తీరం దాటాయి. కానీ 1996 నాటి స్థాయి నష్టాన్ని ఎన్నడూ ఎదుర్కోలేదని స్థానికులు ఇప్పటికీ చెబుతుంటారు. ఈ తుపాన్ తాకిడితో 2.25 లక్షల కుటుంబాలు నష్టపోయాయి. వాటిలో 70 శాతం కోనసీమ వాసులే.

అధికారిక లెక్కల ప్రకారం ఈ తుపాను 6,47,554 నివాసాలపై ప్రభావం చూపింది. అందులో పది వేల ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. అత్యధికం నేలకూలగా, ఆ తర్వాత వరద తాకిడితో కొట్టుకుపోయిన ఇళ్లు కూడా ఉన్నాయి.

5.97 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. అందులో అత్యధికంగా కొబ్బరి, వరి పంటలున్నాయి. 1077 మంది మరణించినట్టు అధికారికంగా ధ్రువీకరించారు. అనేక మంది గల్లంతయినట్టు అప్పట్లో పేర్కొన్నారు. మొత్తంగా ఈ తుఫాన్ మూలంగా ఆంధ్రప్రదేశ్ కి రూ.215 కోట్ల నష్టం సంభవించింది.

మొత్తం తుపాను బీభత్సాన్ని ఈనాడు కళ్ళకు కట్టింది. హైదరాబాద్ నుంచి అధికారంతో కూడిన ఆదేశాలు ఒక పక్క, గాయపడిన కోనసీమ గ్రామాలను ప్రతిబింబించేలా రిపోర్టింగ్ విభాగం ఒక పక్క. ఈ రెండింటినీ సమన్వయం చేసుకుంటూ రాజమండ్రిలో డెస్క్ పనిచేసేది. మొత్తం ఒక తీరుకు వచ్చేవరకూ అంటే సుమారు ఇరవై రోజుల పాటు ఉద్యోగులు నిద్రాహారాలు మాని పనిచేశాము. ఆ సమయంలో వచ్చింది ప్రతీదీ వార్తే… ఇది వార్త కాదు అని కొట్టిపడేయడానికి లేదు. మృతదేహాల నుంచి కూలిన కొబ్బరి చెట్ల వరకూ ఎక్కడ కదిపినా గుండెలు పిండేసే కథనాలు. అప్పట్లో ఇన్ని టీవీ చానెల్స్, మీడియా లేవు కాబట్టి పాఠకులకు పత్రికలే ఆధారం. వార్తలు ఇవ్వడానికి ఒకరు చెప్పాలి అని లేదు. కోనసీమ రిపోర్టింగ్ యంత్రాంగం చూపిన మార్గంలో హైదరాబాద్ టీం నడిచేవారు. తొలినాళ్లలో వాళ్ళు కొంత ఇబ్బంది పడినా ఎం.డి. రమేష్ బాబు గారి ఆదేశాల వల్ల మారు మాట్లాడడానికి లేకుండా పోయింది. ఎక్కడికైనా నడిచి వెళ్లడమే… తిరిగి కాలినడకన అమలాపురం చేరి, అక్కడ నుంచి టెలిప్రింటర్ సాయంతో వార్తలను టింగ్లీష్ లో పంపేవారు. రిపోర్టర్లు రాసిన వార్తలు రాసినట్లుండేవారు. టి.పి. ఆపరేటర్ వాటిని టింగ్లీష్లో పంపేవారు. అప్పటికి తెలుగు కంపోజింగ్ పూర్తి స్థాయిలో రాలేదు. ఈ కారణంగా డెస్కులో ఉప సంపాదకులకు పని ఒత్తిడి బాగా ఉండేది.
మొత్తం మీద అందరం కలిసి, మా ఇంఛార్జుల సారధ్యంలో తుపాను బీభత్సాన్ని, మంత్రుల హడావుడిని, అధికారుల ప్రకటనలనూ చక్కగా సమర్పించి… ఊపిరి పీల్చుకున్నాం.

కోనసీమ తుపాను కంటే ముందు మరొక విపత్తును కోనసీమ ఎదుర్కొంది. కోనసీమ గుండెలపై కుంపటిలా 65 రోజుల పాటు, భగభగా మండింది. అప్పుడు పడిన ఇక్కట్లు… ఈ కోణాల్లో ఎలా వార్తలను ఇచింది అనే విషయాలను వచ్చే భాగంలో వివరిస్తాను.

జనజీవనం కకావికలం – కొబ్బరి సీమకు శాపం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Kejriwal ‘s battle for survival

(Dr Pentapati Pullarao) Delhi will have its state elections in...

ఆర్జీవీపై అసాధారణ రచన ఈ కావ్యం

ఒక అభిమాని సమర్పించిన అక్షర శరం(సుబ్రహ్మణ్యం వి.ఎస్. కూచిమంచి)ఒక్కొక్క సాయంత్రానికి ఒక్కొక్క...

జనజీవనం కకావికలం – కొబ్బరి సీమకు శాపం

కోనసీమ తుపాను మిగిల్చిన విషాదంవార్తాసేకరణలో ఎన్నెన్నో ఇక్కట్లుఈనాడు - నేను: 25(సుబ్రహ్మణ్యం...

అప్పటిదాకా ప్రశాంతం… అంతలోనే ఉత్పాతం

తుపాను ముందు ప్రశాంతతను చూశాం ఈనాడు-నేను: 24 (సుబ్రహ్మణ్యం వి.ఎస్. కూచిమంచి) అది 1996 నవంబర్...
slothttps://www.rajschool.com/slot onlinehttps://sai-ban.com/https://britoli.com/https://www.anabias.com/https://bcrbltd.com/https://s2aconsultingfze.com/https://rock-poker.com/https://koinhoki88.org/https://koinhoki88.net/https://rawsolla.com/https://koinhoki888.com/https://koinhoki88.com/https://infomedan.net/qqplazaslot gacorslot gacor koinhoki88slot gacor terbaru koinhoki88koinhoki88koinhoki88slot777https://usfinancehelp.com/https://collectingdiecasttoystoday.com/https://nyonyaguru.com/https://topindo-pulsa.com/https://gojekonline.com/https://dafrastar.com/https://www.reliantholdings.net/https://www.opalcitysview.com/https://lumarca.info/https://alt-qqaxioo.com/https://www.capuletlondon.com/https://www.tithaimart.com/https://www.trungvuongus.com/https://tropicalbioenergy.com/https://www.capitol-peak.com/https://pisswife.com/https://gamvipvn.com/https://www.elfutbolesnuestro.com/https://ampdsmart.com/https://schiffsilver.com/https://theicemall.com/https://shebenik.com/https://popvoxawards.com/https://www.adwebconsultancy.com/https://www.technotchsolutions.com/https://threekookaburras.com/https://marcjacobsonsale.com/https://www.forexrehberim.net/https://dreamlifefactory.com/https://www.videosocialcreative.com/https://www.oregonwetlands.net/https://www.americaneve.com/https://www.iamthelongtail.com/https://www.privatelivesbroadway.com/https://travelamateurs.com/https://sustaintheline.com/https://geekforcefive.com/https://galaksinews.com/https://sejutateknologi.com/https://harimausumateranews.com/https://diarysaham.com/https://lacakonline.com/https://undangansah.com/https://kottakkalayurvedapharmacy.com/https://kabforums.org/https://bhootmedia.com/https://erectie-goedkoop.com/https://heylink.me/Bandargaming-/https://qqcrownbos.com/https://eastofanfield.com/https://nyonyabesar.com/https://direktoriwisata.com/https://bbqburgersmore.com/https://bjwentkers.com/https://mareksmarcoisland.com/https://richmondhardware.com/https://technostrix.com/