నాడు తెల్ల కాగితంపై రాసిస్తే అనుమతులు: కిషన్ రెడ్డి

0
89

సమూలంగా బొగ్గు రంగ ప్రక్షాళన
ప్రతిష్టాత్మకంగా గనుల మూసివేత కార్యక్రమం
గనుల శాఖ పన్నేదేళ్ళ ప్రగతిపై మీడియాతో కేంద్ర మంత్రి
హైదరాబాద్, జూన్ 08:
ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో 2014లో ప్రారంభమైన సుపరిపాలన, అభివృద్ధి, ఆత్మనిర్బర భారత నిర్మాణ యజ్ఞానికి 12 సంవత్సరాలు పూర్తయ్యాయని, అన్ని రంగాల్లోనూ సంస్కరణలు చేపట్టారని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. పన్నెండేళ్ల బీజేపీ పాలనలో చోటుచేసుకున్న అభివృద్ధి, సంస్కరణల గురించి ఆయన సోమవారం నాడు మీడియాతో మాట్లాడారు.

గ్రామాల్లోని పొదుపు సంఘాల పురోగతి నుంచి స్పేస్ సెక్టార్ వరకు ప్రతి రంగంలోనూ ఎన్నో మైలురాళ్లు చేరుకున్నట్లు కిషన్ రెడ్డి తెలిపారు.

అత్యంత విప్లవాత్మకమైన సంస్కరణలకు బొగ్గు, గనుల రంగం ప్రతీకగా నిలుస్తోందన్నారు. బొగ్గు రంగంలో 5 లక్షల మందికి ప్రత్యక్షంగానూ, 25 లక్షల మందికి పరోక్షంగా ఉపాధి కల్పిస్తున్నట్లు చెప్పారు. దేశ ఆదాయం, ఉపాధి కల్పన, సర్క్యులర్ ఎకానమీ విషయంలో బొగ్గు, గనుల రంగం పాత్ర అత్యంత కీలకమైనదని పేర్కొన్నారు. రైల్వేలకు ఎక్కువ లాభం ఫ్రైట్ ట్రాన్స్‌పోర్టేషన్ ద్వారా చేకూరుతుంటే అందులో 51% బొగ్గు రవాణా ద్వారానే లభిస్తున్నట్లు వివరించారు. ఏడాదికి దాదాపు 90వేల కోట్లరూపాయలు బొగ్గు రవాణా ద్వారా లభిస్తోందని చెప్పారు.
విద్యుత్ ఉత్పత్తిలో బొగ్గు పాత్ర కీలకం…
యూపీయే హయాంలో ఉన్న బొగ్గు కొరత నేడు లేదనీ, ఇవాళ దేశవ్యాప్తంగా నిరంతరాయంగా విద్యుత్ అందిస్తున్నామని కిషన్ రెడ్డి చెప్పారు. కాంగ్రెస్ హయాంలో.. కోల్ అంటే అవినీతి, అసమర్థత కి కేరాఫ్ అడ్రస్ గా ఉండేవని గుర్తుచేశారు. కాంగ్రెస్ హయాంలో.. అవినీతి కారణంగా.. బొగ్గుమంత్రే జైలుకెళ్లారని గుర్తుచేశారు.
సీతారాం కేసరి గారు తెల్ల కాగితం పైన రాసిస్తే.. మన్మోహన్ సింగ్ గారు బొగ్గు గనులను కేటాయించేవారని అంటూ, అలాంటి పరిస్థితులనుంచి ఇవాళ బొగ్గు రంగాన్ని పూర్తిగా సంస్కరించినట్లు తెలిపారు కిషన్ రెడ్డి.
పొరపాట్లు, అక్రమాలు, అవినీతి జరగకుండా.. సుప్రీంకోర్టు ఆదేశాలను తూ.చా తప్పకుండా పాటిస్తూ.. బొగ్గు రంగాన్ని సమూలంగా ప్రక్షాళన చేసినట్లు పేర్కొన్నారు. గడిచిన పన్నేదేళ్లలో అక్రమం, అవినీతి లేకుండా మార్పులు తీసుకొచ్చామని చెప్పారు. ప్రపంచంలో బొగ్గు ఉత్పత్తిలో రెండో ఉన్న భారత్, వినియోగంలోనూ అగ్రస్థానంలో ఉన్నామని కిషన్ రెడ్డి చెప్పారు. ప్రపంచంలోనే బొగ్గు నిల్వలు అంశంలో భారత్ ఐదో స్థానంలో ఉందని తెలిపారు. గెవరా ప్రపంచంలోనే.. రెండో అతిపెద్ద బొగ్గు గని. ఆ పక్కనే ఉన్న కుస్ముందా ప్రపంచంలోనే 4వ అతిపెద్ద బొగ్గు గని అని వివరించారు.
72% విద్యుదుత్పత్తి బొగ్గుతోనే…
426 గనుల్లో బొగ్గు ఉత్పత్తి అవుతోందని, పీఎస్యూలు, క్యాప్టివ్, కమర్షియల్ మైన్స్ ద్వారా ఇది జరుగుతోందని తెలిపారు. గతేడాది, ఈ ఏడాది బిలియన్ టన్ ఉత్పత్తిని సాధించినట్టు చెప్పారు. ఇప్పుడు నిల్వ ఉన్న 189 మిలియన్ టన్నుల బొగ్గు 85 రోజులకు సరిపోతుందన్నారు.
భారతదేశంలో ప్రధాన రంగాలు.. బొగ్గును దిగుమతి చేసుకునేవని చెప్పారు. మన దగ్గర ఇంత బొగ్గు ఉన్నప్పుడు దిగుమతి చేసుకోవాల్సిన అవసరం ఏమిటని ప్రధాని మోదీ ప్రశ్నించేవారని కిషన్ రెడ్డి తెలియజేసారు. ఈ ఆలోచనతో తీసుకొచ్చిన సంస్కరణల కారణంగా.. ఇప్పుడు బొగ్గు దిగుమతి తగ్గుతోందన్నారు. గతేడాది 4% బొగ్గు దిగుమతులు తగ్గాయనీ, దీనివల్ల రూ.60వేల కోట్ల రూపాయలు దేశానికి ఆదా చేయగలిగామని వివరించారు.
మరింతగా దిగుమతులను తగ్గించుకునే ప్రయత్నిస్తున్నట్టు కిషన్ రెడ్డి వెల్లడించారు.

బొగ్గు రంగంలో వస్తున్న మార్పులను దృష్టిలో ఉంచుకుని ఫస్ట్ మైల్ కనెక్టివిటీ (FMC) ని అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. మైన్స్ ఎక్కువగా ఉన్న చోట.. రైల్వే లైన్లను వెయ్యడమే కాకుండా, ప్రయివేటు రంగాన్ని కూడా బొగ్గు ఉత్పత్తిలో భాగస్వామిని చేస్తున్నట్లు చెప్పారు. మనకున్న బొగ్గు నిల్వలను సద్వినియోగం చేసుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర మంత్రి వివరించారు.
దేశ ప్రజలకు, దేశాభివృద్ధికి మన బొగ్గు నిల్వలు ఉపయోగపడాలనేది ప్రధాని మోదీ ఆలోచనని చెప్పారు.
గతంలో తెల్లకాగితాలపై రాసిస్తే.. కోల్ బ్లాక్స్ కేటాయించేవారనీ, సుప్రీం కోర్టు జోక్యం చేసుకుని ఆ బ్లాక్స్ ను రద్దుచేసిందనీ తెలిపారు. తమ ప్రభుత్వం వేలం పద్దతిని తీసుకొచ్చి, పారదర్శకమైన పద్ధతిలో కోల్ బ్లాక్స్ వేలం వేస్తున్నామన్నారు. ఈ విధానం ప్రయివేట్ రంగంలోనూ.. పోటీని పెంచిందన్నారు.
కోల్ బ్లాక్స్ కేటాయింపులు జరిగిన తర్వాతి అనుమతులు, తదితరాలను దాటుకుని.. వీలైనంత త్వరగా బొగ్గు ఉత్పత్తి మొదలయ్యేలా కంపెనీలకు సంపూర్ణ సహకారాన్ని అందిస్తున్నామని కిషన్ రెడ్డి చెప్పారు.
కోల్ ద్వారా సిన్ గ్యాస్ ఉత్పత్తి చేసేందుకు.. కోల్ గ్యాసిఫికేషన్ కు సంపూర్ణ ప్రోత్సాహాన్ని అందిస్తున్నామని, ఇందుకోసం కేంద్రప్రభుత్వం రూ.46వేల కోట్ల ప్రోత్సాహకాలను అందిస్తోందని వివరించారు.
ఆపరేషన్ సిందూర్ తర్వాత, నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో మన దేశం ఫర్టిలైజర్స్, గ్యాస్ ఉత్పత్తికోసం ఆత్మనిర్భరత సాధించాలనేది ప్రధానమంత్రి మోదీ ఆలోచిస్తున్నారని చెప్పారు. ఇందులో కోల్ గ్యాసిఫికేషన్ చాలా కీలకం కానుందన్నారు.
మీడియా సమావేశంలో కిషన్ రెడ్డి ఇంకా ఏమన్నారో ఆయన మాటల్లోనే…
అండర్ గ్రౌండ్ గ్యాసిఫికేషన్, సర్ఫేస్ కోల్ గ్యాసిఫికేషన్..
మన దగ్గర డీప్ సీటెడ్ కోల్ ఎక్కువ.. అందుకే.. దీన్ని వెలికితీయలేని పరిస్థితుల్లో.. అండర్ గ్రౌండ్ కోల్ గ్యాసిఫికేషన్ చేసేందుకు వీలవుతుంది.
అమ్మోనియా, మిథనాలు, హైడ్రోజన్, ఫర్టిలైజర్స్, ఫీడ్ స్టాక్స్, కెమికల్స్, పెట్రోకెమికల్స్ వంటి ఉప ఉత్పత్తులు వస్తాయి.
వీటికోసం ప్రస్తుతం మనం దిగుమతులపై ఆధారపడుతున్నాం.
ఇందుకోసం పెద్దమొత్తంలో ఖర్చుచేస్తున్నాం.
ఈ విషయాల్లో దిగుమతులను తగ్గించుకునేందుకు.. ప్రస్తుతానికి సర్ఫేస్ గ్యాసిఫికేషన్ ను ప్రతిష్టాత్మకంగా తీసుకుని పనులు ప్రారంభించాం.
ఈ నెల 11న హైదరాబాద్ లో కోల్ గ్యాసిఫికేషన్ పై.. రోడ్ షో ఏర్పాటుచేస్తున్నాం.
గతవారం ఢిల్లీలో రోడ్ షో జరిగింది. వచ్చే వారం ముంబైలోనూ రోడ్ షో నిర్వహించబోతున్నాం.
ప్రభుత్వం ఒక్కటే ఈ పనిచేయలేదు కాబట్టి.. ప్రయివేట్ రంగం కూడా.. భాగస్వాములయితేనే విజయం సాధించగలం.
4 లక్షల కోట్ల పెట్టుబడులు, లక్షమందికి ఉపాధి, సుమారు 3లక్షల కోట్ల విదేశీ మారక ద్రవ్యం ఆదా దిశగా ముందుకెళ్తున్నాం. ఒక కొత్త సప్లయ్ చైన్ ను ప్రారంభించబోతున్నాం.


స్వాతంత్య్రం వచ్చినప్పటినుంచి కూడా.. బొగ్గు తీయడమే తప్ప ఆ గనులను పూడ్చే పని జరగలేదు.
పర్యావరణ హితం కోసం మా ప్రభుత్వం.. మైన్ క్లోజర్ యాక్టివిటీని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.
చాలా ప్రాంతాల్లో రైతుల భూములు తీసుకుంటాం, గ్రామాలకు గ్రామాలను తీసుకుంటాం. బొగ్గు వెలికి తీసిన తర్వాత.. వదిలేస్తాం.
స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఇలాంటి 147 గనులను బొగ్గు తీసి వదిలేశాం.
ఈ విషయాన్ని ప్రధాని దృష్టికి తీసుకెళ్తే.. వారి ఆదేశాలమేరకు.. సమాంతరంగా.. ఈ కోల్ మైన్స్ ను సైంటిఫిక్ మెథడ్ లో మైన్ క్లోజింగ్ యాక్టివిటీ చేస్తున్నాం.
2028 నాటికి.. ఈ గనులను మొత్తం మూసివేయాలని నిర్ణయించుకున్నాం.
గ్రామ పంచాయతీలు, స్థానిక ప్రజాప్రతినిధులు, ఆ జిల్లా కలెక్టర్ ను, స్వచ్ఛంద సంస్థలన భాగస్వామ్యం చేస్తూ.. సైంటిఫిక్ పద్ధతిలో మైన్ క్లోజింగ్ కోసం కమిటీలు ఏర్పాటుచేశాం.
600 జిల్లాల్లో ఈ కమిటీలు వేశాం.
పర్యావరణ పరిరక్షణలో ప్రపంచానికి ఆదర్శవంతంగా ఉండే విధంగా పనులు చేస్తున్నాం.
భారతదేశాన్ని విమర్శిస్తున్న వారందరి నోళ్లు మూయించే విధంగా.. ఈ మైన్ క్లోజింగ్ యాక్టివిటీ ఉండబోతోంది.
నేను కూడా WCLలో ఒక కోల్ బ్లాక్ ను దత్తత తీసుకున్నాను. మా సెక్రటరీ కూడా ఒక మైన్ దత్తత తీసుకున్నారు.
ఆ బ్లాక్ సైంటిఫిక్ పద్ధతిలో క్లోజ్ అయ్యేలా బాధ్యత తీసుకుంటాం.
మైన్ క్లోజింగ్ లో గిన్నిస్ రికార్డు సాధించాలనేది నా ఆకాంక్ష. దీన్ని సాధించి తీరతాం.
మైనింగ్ సెక్టార్ ఎక్కువగా రాష్ట్ర ప్రభుత్వాల ఆధీనంలో ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వమే ఈ బ్లాక్స్ ను అలాట్ చేస్తారు. కొన్ని మేజర్ మినరల్స్ ను మేం ఆక్షన్ ద్వారా కేటాయిస్తాం.
గత పదేళ్లలో తీసుకున్న నిర్ణయం కారణంగా.. అల్యూమినియంలో ప్రపంచంలో రెండో అతిపెద్ద ప్రొడ్యూసర్ గా ఉన్నాం.
స్టీల్ ఉత్పత్తిలోనూ మనం రెండో స్థానంలో ఉన్నాం.
బైరైటీస్, మైకాలో కీలకంగా ఉన్నాం.
జింక్ ఉత్పత్తిలో 3వ స్థానంలో ఉన్నాం.


లైమ్ స్టోన్ లోనూ 3వ స్థానంలో ఉన్నాం.
బాక్సయిట్ లో 5వ స్థానంలో ఉన్నాం.
మైనింగ్ సెక్టార్ లో.. క్రిటికల్ మినరల్స్ లో మనం చాలా వెనకబడి ఉన్నాం.
ప్రధాన మంత్రి ఆలోచనల మేరకు.. రూ.32వేల కోట్ల నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ ప్రారంభించాం.
క్రిటికల్ మినరల్స్ లో ఆత్మనిర్భరత సాధించడం చాలా అవసరం.
20వ శతాబ్దం ఆయిల్ ఎకానమీ అయితే.. 21వ శతాబ్దం క్రిటికల్ మినరల్స్ ఎకానమీ.
క్రిటికల్ మినరల్స్ విషయంలో మనం 93% దిగుమతులు చేసుకుంటున్నాం.
సెమీకండక్టర్స్ లోనూ, రెన్యూవబుల్ ఎనర్జీ విషయంలో.. డిఫెన్స్ సెక్టార్ లో.. ప్రతిచోటా క్రిటికల్ మినరల్స్ చాలా కీలకం.
ఈ విషయంలో మనం క్రిటికల్ మినరల్స్ ఎక్స్ ప్లొరేషన్ పెంచాలి. విదేశాల్లోని క్రిటికల్ మినరల్ బ్లాక్స్ ను అక్వయిర్ చేసుకోవాలనే లక్ష్యంతో ‘కాబిల్’ అనే పీఎస్‌యూను ఏర్పాటుచేసుకున్నాం.
అర్జెంటీనాలో 5 క్రిటికల్ మినరల్ బ్లాక్స్ ను అక్వయిర్ చేశాం. అక్కడ పనులు ప్రారంభం అయ్యాయి.
ఎక్స్ ప్లొరేషన్, మైనింగ్, రీసైక్లింగ్, రీసర్చ్ & డెవలప్మెంట్ వంటి సెవన్ పాయింట్ ఫార్ములాతో పనిచేస్తున్నాం.
రీసైక్లింగ్ కోసం.. రూ. 1500 కోట్ల ప్రోత్సాహకాలు ఇచ్చాం.
ఈ-వేస్ట్ ను సేకరించి.. వాటినుంచి క్రిటికల్ మినరల్స్ తీసే పనిలో ఉన్నాం.
క్రిటికల్ మినరల్ మిషన్ ప్రారంభించిన 9 నెలల్లో .. ఈ బ్లాక్స్ ఆక్షన్ ను వేగవంతం చేశాం.
పాలసీ రిఫామ్స్ తీసుకొచ్చాం. హోల్ ఆఫ్ గవర్నమెంట్ అప్రోచ్ తో.. పనిచేస్తున్నాం.
ఒడిశా, ఏపీ, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో.. రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ కోసం స్పెషల్ మిషన్ ఏర్పాటుచేశాం.
ఒడిశా, మహారాష్ట్ర రాష్ట్రాలు.. క్రిటికల్ మినరల్ ప్రాసెసింగ్ విషయంలో చాలా ప్రొయాక్టివ్ గా పనిచేస్తున్నాయి.
24 క్రిటికల్ మినరల్స్ మీద ఇంపోర్ట్ డ్యూటీ మినహాయింపు ఇచ్చాం.
ఇలాంటి ఎన్నో సంస్కరణలు తీసుకొస్తున్నాం.


విదేశాంగ శాఖ కూడా ఇందులో భాగస్వాములు చేసి.. విదేశాల్లోని క్రిటికల్ మినరల్ బ్లాక్స్ అక్వయిర్ చేసేలా ముందుకెళ్తున్నాం.
ప్రధానమంత్రి గారు గతేడాది కాలంగా ఏ దేశానికి వెళ్లినా.. ఆ దేశంతో క్రిటికల్ మినరల్స్ విషయంలో ఒప్పందాలు చేస్తున్నారు.
మైనింగ్ ద్వారా అందే లాభంలో 90% రాష్ట్రాలకే అందుతుంది.
మైనింగ్ ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజల సంక్షేమం కోసం జిల్లా ఖనిజ ఫౌండేషన్ (DMF) ఏర్పాటుచేశాం.
ఆక్షన్ ప్రీమియం, రాయల్టీ, డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ ద్వారా వచ్చే నిధులన్నీ రాష్ట్రాలకు రెవెన్యూ పెంచుతాయి.
జీఎస్టీలో ఫైనల్ ప్రొడక్ట్ మీద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరో సగం తీసుకుంటాయి.
మైనింగ్ నుంచి 2% DMFలో పెట్టి.. ఆ గని పరిధిలో పర్యావరణం, మౌలికవసతుల కల్పన కోసం ఖర్చుచేసేలా నిబంధనలు రూపొందించాం.
DMF నిధులను రాష్ట్రాలకు ఉద్దేశించిన లక్ష్యాలకోసం వాడాలనేది మా సూచన.
కోకింగ్ కోల్ అనేది హై క్వాలిటీ కోల్. ఆ స్థాయికి మన బొగ్గు రావాలంటే.. కోల్ వాషరీస్ ను ఏర్పాటుచేశాం. దీని ద్వారా మన బొగ్గులోని యాష్ కంటెంట్ ను తగ్గించే ప్రయత్నం చేస్తున్నామని కిషన్ రెడ్డి చెప్పారు.

అనంతరం ఆయన విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. సింగరేణికి సంబంధించి.. రెండేళ్లలో.. ఖర్చులు తగ్గించే ప్రయత్నం చేశానన్నారు. సింగరేణికి కార్మికులకు న్యాయం చేసే ప్రయత్నం కూడా చేసినట్టు చెప్పారు.
కోలిండియాతోపాటుగా సింగరేణి ఉద్యోగస్తులకు ఇన్సూరెన్స్ పెంచామని,
30 లక్షలు, 40 లక్షలుండే ప్రమాదబీమాను.. కోటి రూపాయలకు పెంచినట్టు చెప్పారు. ఇవాళ్టి లెక్కల ప్రకారం.. కోటి 25 లక్షల వరకు వారికి ప్రమాదబీమా వస్తుందన్నారు.
దీన్ని ఇప్పుడు ప్రధాన మంత్రి అన్ని ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల్లో అమలు చేస్తున్నట్లు వెల్లడించారు.

తెలంగాణ ఉద్యమ సమయంలో సింగరేణిలో యాత్ర చేసిన విషయాన్ని కిషన్ రెడ్డి గుర్తుచేశారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే.. సింగరేణి ఉద్యోగుల ఇన్ కమ్ టాక్స్ మినహాయింపు చేస్తానని భరోసా ఇచ్చానన్నారు.
బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలను ఇదే విషయం అడిగా.. కానీ వారు చేయలేదు.
మేం 2028లో అధికారంలోకి రాగానే.. కచ్చితంగా వారికి ఆదాయపుపన్ను మినహాయింపు ఇస్తామని భరోసా ఇచ్చారు.

ఢిల్లీ నుంచి కోల్ మినిస్ట్రీ అధికారులను సింగరేణికి పెంచి.. ఖర్చు తగ్గించేందుకు ఏం చేయాలనే దానిపై సూచనలు చేశాను. సింగరేణి భవన్ లో.. ఉన్నతాధికారులందరినీ పిలిపించి మాట్లాడాను. కొన్ని సూచనలను అమలు చేస్తున్నాను. ఇంకా చాలా చేయాల్సిన అవసరం ఉందన్నారు.

ఓపెన్ క్యాస్ట్ మైనింగ్ ను తగ్గించేందుకు.. అండర్ గ్రౌండ్ మైనింగ్ ను ప్రోత్సహిస్తున్నాం. ఇవాళ కోల్ డిమాండ్ ఉంది కాబట్టి.. ఇన్సెంటివ్స్ ఇస్తున్నాం. ప్రయివేట్ మైనింగ్, కమర్షియల్ మైనింగ్ కారణంగా.. ఉద్యోగాలు పెరుగుతున్నాయన్నారు.
కమర్షియల్ మైనింగ్ ద్వారా.. 800 మిలియన్ టన్స్ బొగ్గు ఉత్పత్తి జరగనుంది కాబట్టి దానికి అనుగుణంగా ఉద్యోగాల కల్పన పెరుగుతుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here