వార్షిక మహోత్సవాల ఆహ్వాన పత్రిక అందజేత
మర్యాదపూర్వకంగా కలిసిన ఉత్తరాధికారి
అమరావతి, జనవరి 11: విశాఖ శారదా పీఠం వార్షిక మహోత్సవాలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి మంగళవారం ఆంధ్ర ప్రదేశ్ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. ఉత్సవాలకు రావలసిందిగా ఆహ్వానించారు. ఆయనకు ఆహ్వానపత్రికను అందచేశారు. వేద ఆశీర్వచనం ఇచ్చారు. ఫిబ్రవరి 7 నుంచి 11వ తేదీ వరకూ వార్షిక మహోత్సవాలు జరుగుతాయి. స్వాత్మానందేంద్రతో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కూడా సీఎం జగన్మోహన్ రెడ్డిని కలిశారు.
జగన్కు విశాఖ పీఠం ఆహ్వానం
Date: