0
97

ఆరాధనకు అర్ధం చెప్పిన ప్రేమ కథాసుధ
(కె.వి.ఎస్. సుబ్రహ్మణ్యం)
సాధారణంగా లవ్ స్టోరీలు సుఖాంతమే అవుతాయి. కొన్ని సందర్భాలలో ట్రాజెడీగానూ మారతాయి. దేనికైనా విధి అనేది ఒకటి ఉంటుంది. ఇక్కడ విధి అంటే దేవుడు కాదు. ఎలా జరగాలో అలాగే జరగడాన్ని విధి అంటారు. ప్రేమించిన అబ్బాయి అమ్మాయిని ఊరొదిలి పెళ్లి చేసుకుందామంటాడు. ఆలోచించి సరే అంటుంది అమ్మాయి. విధివశాత్తు అనుకున్నది జరగదు. చాలా కాలం తరవాత కలుస్తారు. ఇది కూడా విధివశాత్తు జరిగిందే. అక్కడినుంచి మలుపులు. ఏదీ మనం అనుకున్న మలుపు తిరగదు. కానీ ఆసక్తిగా చూసేలా చేస్తాయి. నలభై మూడు నిముషాల ఈ ఎపిసోడ్ టి 20 క్రికెట్ మ్యాచ్ ని తలపిస్తుంది. ప్రేమకి – ఆరాధనకు మధ్య తేడాను ఈ ఎపిసోడ్ వివరిస్తుంది. ఈ కాలపు ప్రేమికులకు ఇదొక మేలుకొలుపు. సెంటిమెంటును మేలిమలుపు. దర్శకుడు శ్రీకాంత్ దేవరకొండ ప్రతిభకు ప్రతీక.

(Sreekanth Devarakonda)

రిజిస్ట్రార్ కార్యాలయంలో మొదలైన కధ … ప్రేమికుడి ఇంట్లో ముగుస్తుంది. ఇంటిల్లిపాది కూర్చుని చూడదగ్గ ఎపిసోడ్. ప్రఖ్యాత గాయని ఉష పాడిన పాట శ్రావణపేయంగా సాగింది. ఈటీవీ విన్ కథాసుధలో స్ట్రీమింగ్ అవుతున్న “ఆరాధన” తప్పకుండా చూడండి. చక్కని ప్రేమ కథకు అర్ధం తెలుసుకునేలా చేసే ఎపిసోడ్ ఇది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here