అభిషేక్ విశ్వరూపం: దాయాదిపై తిరుగులేని విజయం

0
180

పాక్ బౌలర్ల భరతం పట్టిన ఓపెనర్లు
వికెట్ నష్టపోకుండా 105 పరుగులు
(కె.వి.ఎస్. సుబ్రహ్మణ్యం)

దుబాయిలో ఆదివారం జరిగిన మ్యాచ్లో పాకిస్తాన్ జట్టుపై భారత జట్టు ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. పాక్ జట్టు ఇరవై ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. తరవాత బ్యాటింగ్ ప్రారంభించిన ఓపెనర్లు అభిషేక్, శుభమాన్ గిల్ పాక్ బౌలర్లను ఊచకోత కోశారు. వారు మొదటి వికెట్ కు 105 పరుగులు చేశారు.
తొలి బంతిని సిక్సర్ గా మలిచాడు అభిషేక్ శర్మ. తొలి ఓవర్లో తొమ్మిది పరుగులను చేశారు.

రెండో ఓవర్లో పది పరుగులు చేశారు. అందులో శుభమాన్ గిల్ కొట్టిన రెండు ఫోర్లు ఉన్నాయి.

మూడో ఓవర్లో పన్నెండు పరుగులు చేశారు. ఇందులో గిల్ రెండు ఫోర్లు కొట్టాడు.

నాలుగో ఓవర్లో అభిషేక్ ఒక ఫోర్, ఒక సిక్స్ బాడీ మొత్తం పన్నెండు పరుగులు రాబట్టాడు. నాలుగో ఓవర్ ముగిసేసరికి భారత్ స్కోరు 43 . గిల్ 22 , అభిషేక్ 21 పరుగులు చేశారు.

ఐదో ఓవరు ముగిసేసరికి స్కోరు 55 . ఈ ఓవర్లో గిల్, అభిషేక్ చెరో ఫోర్ కొట్టారు. ఆరో ఓవర్ ముగిసేసరికి స్కోరు 69 . ఇందులో గిల్ మూడు ఫోర్లు కొట్టాడు. ఇది సమయానికి పాక్ స్కోరు వికెట్ నష్టానికి 55 .

ఏడో ఓవర్లో రెండో బంతిని, ఐదో బంతిని అభిషేక్ సిక్సర్లు కొట్టాడు. ఓవర్ ముగిసే సరికి స్కోరు 85 . అభిషేక్ 48 గిల్ 36 చేశారు . ఎనిమిదో ఓవర్లో రెండో బంతిని గిల్ రివర్స్ స్వీప్ కొట్టి నాలుగు పరుగులు రాబట్టారు. తరవాత అభిషేక్ ఫోర్ కొట్టి 24 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తిచేశారు. ఈ ఓవర్ ముగిసేసరికి స్కోరు 96 .

8 . 4 ఓవర్లకు భారత్ వంద పరుగులు పూర్తిచేసింది. తొమ్మిది ఓవర్లు పూర్తయ్యేసరికి భారత్ స్కోరు 101 . పదో ఓవర్లో గిల్ 47 పరుగులకు అవుటయ్యాడు. ఫహీమ్ బౌలింగులో క్లిన్ బౌల్డ్ అయ్యాడు. ఈ దశలో సూర్యకుమార్ యాదవ్ అభిషేక్ శర్మకు జత కలిసాడు. పది ఓవర్లలో ఇండియా స్కోరు 106 . పరుగులేమీ చేయకుండానే సూర్యకుమార్ రవూఫ్ బౌలింగులో అవుటయ్యాడు.

పన్నెండు ఓవర్లు పూర్తయ్యే సమయానికి భారత్ స్కోరు రెండు వికెట్ల నష్టానికి 117 . 38 బంతుల్లో 78 పరుగులు చేసి అభిషేక్ 123 పరుగుల వద్ద అవుటయ్యాడు. ఈ స్కోరులో ఆరు ఫోర్లు, ఐదు సిక్సులు ఉన్నాయి.

పదిహేను ఓవర్లు ముగిసే సమయానికి భారత స్కోరు మూడు వికెట్ల నష్టానికి 140 . సంజు శాంసన్, తిలక్ వర్మ నాలుగో వికెట్ కి 25 పరుగులు చేశారు. సంజు శాంసన్ 13 పరుగులకు రవూఫ్ బౌలింగులో పదిహేడో ఓవర్లో అవుటయ్యాడు. తిలక్ వర్మకి హార్దిక్ పాండ్య జత కలిశాడు. వస్తూనే ఒక ఫోర్ బాదాడు పాండ్య. ఓవర్ పూర్తయ్యేసరికి స్కోరు నాలుగు వికెట్ల నష్టానికి 153 . పద్దెనిమిదో ఓవర్ రెండో బంతిని సిక్సర్ కొట్టాడు తిలక్ వర్మ. ఓవర్ ముగిసేసరికి స్కోరు 163 కు చేరింది.

తిలక్ వర్మ (30 ) – పాండ్య (9 ) కలిసి భారత్ కు విజయం చేకూర్చారు.

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న సూర్య కుమార్
తొలుత సూర్యకుమార్ యాదవ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. పాకిస్తాన్ తొలి వికెట్టును (ఫాఖర్ జమాన్) ఇరవై ఒక్క పరుగులకు కోల్పోయింది. రెండో వికెట్టును (సైమ్) 93 పరుగులకు కోల్పోయింది. మొదటి పది ఓవర్లలో మూడు క్యాచీలను విడిచిపెట్టారు. ఫర్హాన్ నలభై నాలుగు బంతులలో 58 (ఐదు ఫోర్లు, మూడు సిక్సులు) పరుగులు చేసి అవుటయ్యాడు.

దూబే బౌలింగులో భారీ షాట్ కొట్టబోయి సూర్యకుమార్ యాదవ్ చేతికి చిక్కాడు. మొదటి పది ఓవర్లలో పాకిస్తాన్ ఒక వికెట్ నష్టానికి 91 పరుగులు చేసింది. కులదీప్ యాదవ్ బౌలింగులో హుస్సేన్ పది పరుగులకు అవుటయ్యాడు. పద్నాలుగు ఓవర్లలో స్కోరు మూడు వికెట్ల నష్టానికి 115 పరుగులకు చేరింది. పదిహేనో ఓవర్ మొదటి బంతికే నాలుగో వికెట్ పడింది. వరుణ్ చక్రవర్తి వేసిన పదహారో ఓవరులో కేవలం రెండు పరుగులు తీయగలిగింది. పదిహేడో ఓవర్ మొదటి బంతిని సల్మాన్ సిక్స్ కొట్టడంతో స్కోరు నాలుగు వికెట్ల నష్టానికి 127 పరుగులయింది. మరుసటి బంతిని డిఫెన్సె ఆడిన సల్మాన్ కులదీప్ యాదవ్ బౌలింగులో నాలుగో బంతిలో రెండు పరుగులు చేసాడు. పద్దెనిమిదో ఓవర్ మొదటి బంతిని నవాజ్ సిక్సర్ కొట్టాడు. మూడో బంతిని ఫోర్ కొట్టాడు. ఓవర్ పూర్తయ్యే సరికి స్కోరు నాలుగు వికెట్ల నష్టానికి 146 పరుగులకు చేరింది. 149 పరుగుల వద్ద నవాజ్ 21 పరుగులకు రన్ అవుట్ గా వెనుతిరిగారు. అప్పటికి స్కోరు ఐదు వికెట్ల నష్టానికి 149 . తరవాత వచ్చిన ఫహీమ్ మొదటి బంతిని సిక్సర్ కొట్టాడు. తరవాతి బంతిని గిల్ క్యాచ్ డ్రాప్ చేశాడు. 19 వ ఓవర్లో పాకిస్తాన్ పదకొండు పరుగులు చేసింది స్కోరును 157 కు చేర్చింది. హార్దిక్, కులదీప్ ఒక్కొక్కటి, దూబే రెండు వికెట్లు పడగొట్టారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here