సూపర్ ఓవర్లో గెలిచిన భారత్

0
175

ఒత్తిడికి తలొగ్గిన శ్రీలంక
(కె.వి.ఎస్. సుబ్రహ్మణ్యం)

సూపర్ ఫోర్ చివరి మ్యాచ్ సూపర్ ఓవర్ తో తేలింది. శ్రీలంక ఒత్తిడికి తలొగ్గింది. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక కుషాల్ పెరీరా, సనకా లతో ప్రారంభించింది. మొదటి బంతికే పెరీరా అర్షదీప్ బౌలింగులో అవుటయ్యాడు. రింకు సింగ్ ఈ క్యాచ్ పట్టాడు. బ్యాటింగుకు వచ్చిన మెండిస్ ఒక పరుగు తీసాడు. మూడో బంతికి పరుగులేమీ రాలేదు. నాలుగో బంతి వైడ్ కావడంతో స్కోరు వికెట్ నష్టానికి రెండు పరుగులయింది. నాలుగో బంతికి పరుగులేమీ రాలేదు. ఐదో బంతికి సనకా అవుటయ్యాడు. అంటే భారత్ గెలవడానికి మూడు పరుగులు చేయాలి. సూపర్ ఓవర్ నిబంధన ప్రకారం రెండు వికెట్లు పడితే ఓవర్ ముగిసినట్లే.
భారత్ తరపున గిల్, సూర్య కుమార్ యాదవ్ బ్యాటింగ్ కు వచ్చారు. హాసరంగా వేసిన మొదటి బంతిని సూర్య కుమార్ మూడు పరుగులు చేసి గెలిపించాడు.
అంతకు ముందు 203 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన శ్రీలంక భారత్ బౌలర్లకు చుక్కలు చూపించింది. నిస్సంక, పెరీరా ధాటిగా ఆడారు. రెండో వికెట్ కు 127 పరుగులు జోడించారు. ఏడు పరుగులకే తొలివికెట్ కోల్పోయిన లంక 12 . 2 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 134 పరుగులు చేసింది. కుషాల్ పెరీరా 58 పరుగులకు వరుణ్ చక్రవర్తి బౌలింగులో అవుటయ్యాడు. నిస్సంక 86 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నాడు. 14 ఓవర్లు ముగిసేసరికి శ్రీలంక స్కోరు 147 కు చేరింది. పదిహేను ఓవర్లు ముగిసేసరికి స్కోరు 157 కు చేరింది. నిస్సంక 93 పరుగులు చేశాడు.

16 ఓవర్ మొదటి బంతికి అస్సలంక గిల్ కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. ఓవర్ ముగిసే సరికి స్కోరు మూడు వికెట్ల నష్టానికి 161 . పదిహేడో ఓవర్లో నాలుగో వికెట్టును అర్షదీప్ తీసుకున్నాడు. కె. మెండిస్ ఇచ్చిన కాచ్ని అక్షర్ పట్టుకున్నాడు. తరవాత సనకా బ్యాటింగుకు వచ్చాడు. 17 వ ఓవర్లో నిస్సంక సిక్సర్ తో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 52 బంతుల్లో వంద పరుగులు చేసాడు. స్కోరు నాలుగు వికెట్ల నష్టానికి 170 . పద్దెనిమిదవ ఓవర్లో స్కోరు 180 కి చేరింది. పంతొమిదవ ఓవర్లో 191 పరుగులకు చేరింది. చివరి ఓవర్లో 12 పరుగులు చేయాల్సిన శ్రీలంక మొదటి బంతికే నిస్సంక వికెట్ కోల్పోయింది. 107 పరుగులకు హర్షిత్ రానా కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. దీనితో ఐదు వికెట్లు కోల్పోయిన శ్రీలంక శిబిరంలో టెన్షన్ నెలకొంది. రెండో బంతికి రెండు పరుగులు తీశారు.మూడు బంతుల్లో తొమ్మిది పరుగులు చేయాల్సి వచ్చిన తరుణంలో రెండు పరుగులు వచ్చాయి. ఐదో బంతి ఫోర్ వెళ్ళింది. చివరి బంతికి మూడు పరుగులు చేయాల్సి వచ్చింది. సనకా ఆ బంతికి రెండు పరుగులు తీయడంతో స్కోరు సమానమైంది. సూపర్ ఓవర్ స్టేజికి వచ్చింది. భారత బ్యాటింగ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ అభిషేక్ శర్మ 61 , తిలక్ వర్మ 49 , సంజు 39 , అక్షర్ 21 పరుగులు చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here