పారిస్ లో ఆసీస్ హాకీ జట్టు చిత్తు
పారిస్, ఆగష్టు 02 : భారత హాకీ జట్టు ఆస్ట్రేలియాపై సునాయాస విజయాన్ని సాధించింది. యాభై రెండు సంవత్సరాల తరవాత ఆస్ట్రేలియాపై భారత్ గెలిచింది. ఆట పూర్తయ్యేసరికి 3-2 ఆధిక్యతను కనబరిచింది. ఆద్యంతం భారత జట్టు ఆస్ట్రేలియాను ముప్పుతిప్పలు పెట్టింది.
ఆస్ట్రేలియాతో శుక్రవారం జరిగిన ఒలింపిక్ హాకీ గ్రూప్ చివరి మ్యాచ్ లో భారత్ సగం ఆట పూర్తయ్యేసరికి 2 – 1 ఆధిక్యంలో ఉంది. మ్యాచ్ తొలి 15 నిముషాల్లోనే రెండు గోల్స్ చేసింది. అభిషేక్ ఒక గోల్ చేయగా, కెప్టెన్ హర్మన్ ప్రీత్ సింగ్ పెనాల్టీ కార్నరును గోలుగా మలిచి భారత జట్టును ఆధిక్యంలో నిలిపారు. రెండో భాగంలో ఆస్ట్రేలియా పెనాల్టీ కార్నరును గోలుగా మలిచి, ఆధిక్యాన్ని తగ్గించగలిగింది.
ఆట మూడో భాగంలో ఆట పోటాపోటీగా సాగింది. పదమూడో నిముషాల్లో లభించిన కార్నరును హర్మన్ గోలుగా మలిచి ఆధిక్యాన్ని 3 – 1 పెంచారు. ఆస్ట్రేలియా ఆటగాళ్లు పడే పడే భారత గోల్ పోస్టుపై దాడులు చేయడానికి ప్రయత్నించారు. మూడో భాగం చివరిలో బంతిని లైన్ బయటకు నెట్టబోయిన భారత ఆటగాణ్ణి ఢీకొట్టడంతో ఆస్ట్రేలియన్ ఆటగాడికి ముక్కుపై గాయమైంది. ఈ క్రమంలో వచ్చిన పెనాల్టీ కార్నరును ఆస్ట్రేలియా సొమ్ము చేసుకోలేకపోయింది.
ఈ గెలుపుతో భారత్ ఈ గ్రూపులో మూడు మ్యాచులు నెగ్గి, ఒక మ్యాచ్ డ్రా చేసుకుంది. గ్రూపులో అగ్ర స్థానంలో నిలిచింది. ఆస్ట్రేలియా తనకు లభించిన కార్నర్ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఆధిక్యాన్ని 3 – 2 కు తగ్గించింది.