ఆ ఒక్క షాట్ కోసం ఇద్దరి షూస్ నాకుతా

Date:

“యానిమల్ ” సినిమాపై సమీక్ష
(రామ్ గోపాల్ వర్మ)

“యానిమల్ “ సినిమా మీద రాసిన చాలా రివ్యూలు చూసి, చదివిన తర్వాతే నేను సినిమా కి వెళ్ళాను .. ఎందుకంటే ఇన్ని దశాబ్దాలుగా సినిమాలు తీసిన తర్వాత నేను కేవలం ఒక ప్రేక్షకుడిగా మాత్రమే ఏ సినిమానీ చూడలేదు … అందుకే ఈ సినిమాని వేరు వేరు కోణాల్లో చూడాలి అని డిసైడ్ అయ్యి వెళ్ళాను.

నైన్ అండ్ హాఫ్ వీక్స్ , ఫ్యాటల్ అట్రాక్షన్, లోలిట , లాంటి క్లాసిక్ సినిమాలు తీసిన ఫిల్మ్ మేకర్ యాడ్రియన్ లిన్ ఒక ఇంటర్వ్యూ లో ఏమన్నాడంటే, సినిమా అన్నది ప్రేక్షకుడికి నచ్చిందా , నచ్చలేదా , అన్నంత సింపుల్ గా ఉండకూడదు

రియల్లీ ఇంపాక్ట్ఫుల్ సినిమా అనేది ప్రేక్షకులు తీవ్రంగా డిస్కస్ చేసుకుని ఆర్గ్వ్ చేసుకునేలా ఉండాలి …ఒక కొత్త తర్కానికి తెర తీయాలి అన్నాడు.

అదే సందేశం ఇవ్వాళ సందీప్ వంగ , యానిమాల్ చిత్రంతో వీపు పగిలిపోయేలా కొట్టి నిరూపించాడు.

బాక్సాఫీస్ రన్ ముగిసిన తర్వాత చాలా సంవత్సరాల వరకూ కూడా యానిమల్ సినిమాకి సంబంధించిన వాదనలు, తర్కాలు కొనసాగుతాయి.

అంతే కాకుండా, ఈ సినిమా హిపోక్రసీ బట్టలిప్పదీసి పూర్తి నగ్నమైన నిజాయితీ నీ విశ్వరూపం తో చూపించడంతో ఎంతో కొంత మన సంస్కృతిని కూడా మార్చిపారేస్తుంది… అని నా ప్రగాఢ నమ్మకం.

ఎందుకంటే యానిమల్ అనేది ఒక సినిమా కాదు .. అది ఒక సోషల్ స్టేట్మెంటు.

నాకు ఆ సినిమా కథ కానీ , తండ్రి కొడుకుల బంధం కానీ ఏమంత ఎక్కలేదు
కానీ బాగా ఎక్కిందేంటంటే అలాంటి పాత కథా వస్తువుల్ని బేస్ గా చేసుకుంటూ సందీప్ మునుపెన్నడూ చూడని సీన్లని అద్భుతంగా చూపించడం.

సినిమా అంటే ఇలాగే వుండాలని అనుకునే డైరెక్టర్లందరికీ ఫ్యూజులు ఎగిరిపోయేలా ఒక ఎలక్ట్రిక్ షాక్ ఇచ్చాడు సందీప్.
వాళ్ళు నమ్మే చాదస్తపు నైతిక విలువులన్నింటినీ తన చీపురు కట్టతో ఊడ్చి ఎత్తి చెత్త కుండీలో పడేశాడు.

యానిమల్ సినిమా స్లోగా ఉన్నప్పటికీ చాలా సార్లు మనం షాక్ అవుతాము .. దానికి కారణం సినిమా స్లో గా ఉండటమే అని తర్వాత తెలుసుకుంటాము .. నా ఉద్దేశ్యం లో ఈ సినిమా మూడున్నర గంటలు కాకుండా నాలుగున్నర గంటలున్నా తక్కువే

హీరో వెళ్లి బేస్ బాల్ బ్యాటో అలాంటిదేదో పట్టుకుని వస్తాడేమో అని నాతో పాటు అందరూ ప్రేక్షకులు ఎక్స్పెక్ట్ చేస్తున్న టైంలో మెషీన్ గన్ తో రావటం అన్నది థియేటర్ అందరినీ కుర్చీలోనుంచి కింద పడేంత ఎఫెక్ట్ ఇచ్చింది

“హ్యాపీనెస్ ఈజ్ ఎ డెసిషన్” అని రణబీర్ సింపుల్ గా చెప్పిన డైలాగ్ తత్వవేత్తలందరినీ ముక్కున వేలేసుకునేలా చేస్తుంది.

“ఇక మీ మీద ఈగ వాలినా సరే వాళ్ళని తగలబెట్టేస్తాను” అనే మాట రణబీర్ తన తండ్రికి చెప్తున్నప్పుడు సినిమాటోగ్రఫీ పరంగా, ఎడిటింగ్ శైలి పరంగా ఆ పాత్ర ను ఎలివేట్ చెయ్యటానికి తీసుకున్న ఎక్కువ టైం కేక్ మొత్తం తయారీ చూపించి ఐసింగ్ పెట్టినట్టనిపించింది.

ఇక ప్రీ ఇంటర్వెల్ సీక్వెన్స్ ఫైట్ లో వాడిన అర్జున్ వెల్లి పాట , మైకేల్ జాక్సన్ “బీట్ ఇట్” మ్యూజిక్ వీడియోని గుర్తు చేసింది.

ట్రెడిషనల్ సినిమా రూల్స్ ని కడుపులో గుద్దుతూ, తన కాళ్లతో తన్నినందుకు సందీప్ ని జీర్ణించుకోలేక , కడుపు నొప్పి తో నేల మీద పడి దొర్లడం తప్ప విమర్శకులు ఇంకేం చెయ్యలేరు.

ఇక్కడ “ఆర్ట్ ఈజ్ నాట్ వాట్ ఇట్ ఈజ్ , ఆర్ట్ ఈజ్ అల్సో వాట్ ఇట్ కుడ్ బీ” అని ఐయాన్ రాండ్ చెప్పిన మాట మనం గుర్తు చేసుకోవాలి. నిజాన్ని దుమ్ము దులిపేసి దాని అసలు రూపాన్ని ఏ మాత్రం కలరింగ్ లేకుండా నిజంగా చూపించిన ఒక నిజమైన కళాకారుడు సందీప్.

దీనికి ఉదాహరణగా అక్కడక్కడా వచ్చే కామిక్ సన్నివేశాల్లో ఉదాహరణకి, బ్రా స్ట్రాప్ స్పాంకింగ్, సెక్స్ గురించి డాక్టర్ లతో మాట్లాడుతున్నప్పుడు లాంటివి చెప్పుకోవచ్చు.
ఇలాంటివి సినిమాకు అవసరం లేదేమో అనిపించినా కేవలం హీరో పాత్ర స్వభావాన్ని ప్రేక్షకుల మెదళ్ళల్లో కి మేకులు కొట్టి దించడమే ఇక్కడ డైరెక్టర్ లక్ష్యం.

తన భర్త ని తమ్ముడు విజయే చంపాడు అని తెలిసిన తర్వాత విజయ్ ని తన అక్క కొట్టడం. తరువాత విజయ్ తనకి ఎక్స్ప్లెయిన్ చేసే సీను ఫ్రాన్సిస్ కాప్పొల గాడ్ ఫాదర్ సీన్ కి బాబులా ఉంది.

ఒక్క మాటలో చెప్పాలంటే ఫ్రాన్సిస్ కాప్పొల సందీప్ దగ్గర అసిస్టెంట్ గా చేరాలి

ఇందులో విలన్ బాబీ ఇంట్రడక్షన్ సినిమా చరిత్రలోనే అంతముందెప్పుడూ లేనంత అత్యంత ఒరిజినల్ గా ఉంది .. ఎందుకంటే ఒక స్ప్లిట్ స్క్రీన్ ఎఫెక్ట్ లో అతన్ని ఒక పెళ్లి కూతురి మేని ముసుగు తీసినట్టు ఆవిష్కరించడం జస్ట్ జీనియస్.

తను పూర్తి ఆరోగ్యవంతుణ్ణయిపోయాను అని చెప్పటానికి హీరో తన ఫామిలీ ముందు , స్టాఫ్ ముందు నగ్నంగా నడిచే సీన్ నెవెర్ బిఫోర్ ఈవెన్ ఇన్ వరల్డ్ సినిమా .

విజయ్ పాత్ర కి సంబంధించి నాకు నచ్చని ఒకే ఒక సన్నివేశం, అమ్మాయిని విజయ్ తన బూట్లు నాకమని ఆర్డర్ ఇవ్వడం .. అది కూడా ఎందుకంటే ఆ నటిని ఎంచుకున్న తీరు, తనని చూస్తూనే నాకు కలిగిన సానుభూతి, తనని చూపించిన ప్రతి క్లోజ్ షాట్ లో అది పెరుగుతూ రావడమే.

కండోమ్ వాడావా? అని హీరో ని రష్మిక అడిగే సీనూ అది రాసిన, తీసిన తీరు అద్భుతం. రష్మీక నటనకి నేను క్లీన్ బౌల్డ్ అనే చెప్పాలి.

ట్రైలర్స్ చూసినప్పటి నుంచి రన్బీర్ ఏమైనా కొంచెం ఓవర్ గా వెళుతున్నాడా అన్న ఫీలింగ్ నాకు లోలోపల ఉండింది. కానీ ఒక ఫిల్మ్ మేకర్ గా, ప్రేక్షకుడి గా, మొదటిసారి రన్బీర్ నటన సందీప్ రాసిన క్యారెక్టర్ ని మోస్తందా? లేదా సందీప్ క్రియేట్ చేసిన క్యారెక్టర్ రన్బీర్ నటనని మోస్తాందా? అన్న కన్ఫ్యూషన్ లో నన్ను పడేసింది.

రన్బీర్ నటన లో వున్నా ఎక్సట్రాడినరీ కన్సిస్టెన్సీ 1913 లో వచ్చిన రాజా హరిశ్చంద్ర నుంచి ఇప్పుడు 2023 వరకూ , నూట పది సంవత్సరాలలో ఏ ఆక్టరూ చూపించలేకపోయాడు
ఆ అమ్మాయిని తన బూటు నాకమనే ఒక్క సన్నివేశం లో తప్ప రన్బీర్ లియోనార్డో డి కాప్రియో ని కూడా మించిపోయాడు.

హేయ్ @imvangasandeep దయచేసి నీ కాళ్ళ ఫోటో నాకు వాట్సాప్ లో పంపిస్తే మొక్కుకుంటాను.

దానికి కారణాలు

  1. కెమెరా కనుక్కున్న మొదలు ఇప్పటివరకూ అందరూ నమ్ముతున్న సినీ సంప్రదాయాలన్నింటిని నీ ఎడమ కాలి బూటు తో తన్ని తన్ని రక్తాలు కక్కుకునేలా చేసావు.
  2. ఇకనుంచి బాలీవుడ్ లో కానీ , టాలీవుడ్ లో కానీ , ప్రతి సినిమా ఆఫీస్లోనూ నీ యానిమల్ సినిమా టాపిక్ ఒక దెయ్యంలా ఆవహించి వాళ్ళు ముందు ముందు తియ్యబోయే ప్రతి సినిమాని పీడిస్తుంది

నేను ముందే చెప్పినట్టు , ఆ అమ్మాయిని షూ నాకమని నువ్వు రణబీర్ తో చెప్పించిన ఆ ఒక్క షాట్ నాకు నచ్చకపోయినా , అనిల్ లాస్ట్ డైలాగ్ నుంచి జంప్ కట్ తీసుకుని ఎండ్ టైటిల్స్ కి వెళ్ళినప్పుడు కెమెరా జూమ్ అవుట్ షాట్ లో శక్తి కపూర్ ఒళ్ళో చిన్న పిల్లాడిలా ఏడుస్తున్న రణబీర్ షాట్ ఒక్కదాని కోసం, నేను మీ ఇద్దరి షూస్ నాకుతాను .🙏

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

BJP ‘s mistakes messing up 2024 elections?

(Dr Pentapati Pullarao) There is hardly one month left for...

భలే పింగళి – పాతాళభైరవి

కథ, మాటలు, పాటలు: పింగళి నాగేంద్రరావు(డాక్టర్ వైజయంతి పురాణపండ) పాతాళభైరవి… ఈ పేరే...

Time stopped in Bihar: Who will shut their show?

(Dr Pentapati Pullarao) No one can stop the Sun’s journey...

నన్ను పరిశోధన జర్నలిస్టుగా నిలిపిన సారథి దాసరి

(ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్)  దాసరి నారాయణ రావ్ (డిఎన్ ఆర్) లైఫ్ అఛీవ్...