ఏ నిబంధననూ ఉల్లఘించలేదు

Date:

చందాదారులకు కృతజ్ఞతలు
నిర్ణీత పరిధిలోనే నిబద్ధతతో వ్యాపారం
ప్రకటన విడుదల చేసిన మార్గదర్శి సంస్థ
హైదరాబాద్, జులై 11 :
ఆదాయపు పన్ను చట్టంలోని ఏ నిబంధనలను, భారతీయ రిజర్వ్ బ్యాంక్ మార్గదర్శకాలను మార్గదర్శి చిట్ ఫండ్ కంపెనీ ఎక్కడా ఉల్లంఘించలేదని సంస్థ ఒక ప్రకటనలో స్పష్టం చేసిందని. మా చందాదారులందరికీ ఈ మేరకు హామీ కూడా ఇస్తున్నామని పేర్కొంది. చిట్ ఫండ్ వ్యాపారం కోసం నిర్దేశించిన రెగ్యులేటరీ ఫ్రేమ్ వర్క్‌కు అనుగుణంగా కంపెనీ తన వ్యాపారాన్ని చాలా నిబద్దతతో నిర్వహిస్తోందని ఆ ప్రకటనలో తెలిపారు. మా ఆర్థిక క్రమశిక్షణే మా బలమనీ, మేము ఎప్పుడైనా ఏ విషయంలోనూ చందాదారుల నమ్మకాన్ని వమ్ము చేసేలా చిట్ ఫండ్ నిబంధనలను ఉల్లంఘించలేదనీ తెలియజేసింది.
కస్టమర్ నెట్ వర్క్ ను దెబ్బతీసే కుట్ర
చిట్‌ ఫండ్ కంపెనీలో సభ్యునిగా నిర్ధారణ అయ్యాక కూడా మా చందాదారులందరినీ భయాందోళనలకు గురిచేయడానికి, వారి వ్యక్తిగత వివరాల కోసం పట్టుబట్టి వేధించడానికి, మార్గదర్శి వ్యాపారాన్ని దాని కస్టమర్ నెట్‌వర్క్‌ను దెబ్బతీసే దురుద్దేశాలతో AP-CID విచారణలను కొనసాగిస్తోందని సంస్థ ఆరోపించింది. కంపెనీలో చందాదారునిగా ధృవీకరించిన తర్వాత కూడా గౌరవనీయ తెలంగాణ హైకోర్టు రిట్ పిటీషన్ WP 45189/2022లో జారీ చేసిన ఉత్తర్వులో చందాదారుల గోప్యతలో జోక్యం చేసుకోకూడదని AP-CID కి సూచించిన విషయాన్ని గుర్తు చేసింది. చందాదారుల గోప్యత విషయంలో కోర్టు ఉత్తర్వును విస్మరించి AP-CID కోర్టు ధిక్కారానికి పాల్పడిందని పేర్కొంది. ఈ విషయంలో గౌరవనీయ కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ, AP-CID మార్గదర్శి సంస్థను అప్రతిష్టపాలు చేయడమే లక్ష్యంగా పదే పదే ప్రెస్ నోట్స్ విడుదల చేస్తూ, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న తన కస్టమర్లందరినీ వేధింపులకు గురిచేస్తుందని తెలిపింది. AP-CID చర్యలు ద్వారా మార్గదర్శి వ్యాపారాన్ని అస్థిరపరిచేందుకు పెద్ద ఎత్తున కుట్ర పన్నుతోందని పేర్కొంది. Ap-CID విడుదల చేసిన పత్రికా ప్రకటనలో మార్గదర్శిపై చేసిన ఉల్లంఘనలు ఆరోపణలు అభూత కల్పనల్ని తెలియజేసింది. తమకు మద్దతుగా నిలుస్తున్న చందాదారులకు మార్గదర్శి కృతజ్ఞతలు తెలియజేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

BJP ‘s mistakes messing up 2024 elections?

(Dr Pentapati Pullarao) There is hardly one month left for...

భలే పింగళి – పాతాళభైరవి

కథ, మాటలు, పాటలు: పింగళి నాగేంద్రరావు(డాక్టర్ వైజయంతి పురాణపండ) పాతాళభైరవి… ఈ పేరే...

Time stopped in Bihar: Who will shut their show?

(Dr Pentapati Pullarao) No one can stop the Sun’s journey...

నన్ను పరిశోధన జర్నలిస్టుగా నిలిపిన సారథి దాసరి

(ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్)  దాసరి నారాయణ రావ్ (డిఎన్ ఆర్) లైఫ్ అఛీవ్...