జగనన్న సురక్ష సూపర్‌ హిట్‌

Date:

పౌరులు ముంగిటకే వేగంగా సేవలు
తొలిరోజు 3,69,373 సర్టిఫికెట్లు జారీ
అడ్మిషన్ల సమయంలో జగనన్న సురక్ష ఉపయోగపడిందని విద్యార్థుల్లో ఆనందం
14,28,481 కుటుంబాలకు తొలిరోజు సురక్ష క్యాంపులు

అమరావతి: జగనన్న సురక్ష కార్యక్రమానికి అద్భుతమైన స్పందన లభించింది. తొలిరోజు రాష్ట్రవ్యాప్తంగా 1305 గ్రామ, వార్డు సచివాలయాల్లో జగనన్న సురక్ష క్యాంపులు నిర్వహించారు. సర్వీసుల్లో సేవలు పొందడంలో సమస్యలు ఎదుర్కొంటున్న ప్రజలు ఈ శిబిరాల ద్వారా తమ సమస్యలను పరిష్కరించుకున్నారు. ముఖ్యంగా వివిధ విద్యాసంస్థల్లో అడ్మిషన్లు సమయం కావడంతో పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఆదాయం, కుల సహా పెద్ద సంఖ్యలో వివిధ సర్టిఫికెట్లను అందుకున్నారు.

అర్హులై ఉండి ఏ ఒక్కరూ లబ్ది అందకుండా మిగిలి పోకూడదన్న ముఖ్య ఉద్దేశంతో జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్తూ జగనన్న ప్రభుత్వం చేపట్టిన మరో ప్రతిష్టాత్మక కార్యక్రమం – జగనన్న సురక్ష కింద తొలిరోజు 1305 గ్రామాల్లో ఆయా మండలాలకు చెందిన అధికారులు శిబిరాలు నిర్వహించారు.
ప్రభుత్వ సేవలు, ప్రభుత్వ పథకాలు అందించడమే లక్ష్యంగా… ప్రభుత్వ ఉద్యోగులు, వాలంటీర్లు, ప్రజా ప్రతినిధులు, గృహసారధులు ఈ కార్యక్రమంలో విస్తృతంగా పాల్గొన్నారు.
సరైన ధృవపత్రాలు లేని కారణంగా, లేక ఇతరత్రా కారణాల వల్ల అక్కడక్కడా పథకాలు పొందకుండా మిగిలిపోయిన వారిని జల్లెడపట్టి వారి వివరాలు సేకరించి వారికి అవసరమైన పథకాలు , సేవలు అందించే కార్యక్రమం తొలిరోజు చురుగ్గా సాగింది.
ఈనెల 23న జనగనన్న సురక్ష కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ ప్రారంభించిన తర్వాత సచివాలయ సిబ్బంది, వాలంటీర్ల వ్యవస్థ ప్రతి ఇంటినీ జల్లెడపట్టారు. అర్హత ఉండీ, వివిధ కారణాల వల్ల పథకాలు అందకపోయినా, సర్టిఫికెట్లు పొందలేకపోయినా.. వారి వివరాలు సేకరించారు. ఈ సర్వీసులన్నింటినీ రిజిస్టర్‌ చేసిన వారికి టోకెన్లు ఇచ్చారు. ఆయా మండలాలకు చెందిన అధికారులు… వీటిని పరిశీలించి.. జగనన్న సురక్షా క్యాంపులకు వెళ్లేముందే పూర్తిస్తాయిలో సన్నధ్దం అయ్యారు.
జులై 1న అంటే ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా దాదాపుగా ప్రతి మండలానికీ 2 క్యాంపులు చొప్పున అంటే ప్రతి మండలంలో రెండు సచివాలయాల్లో జగనన్న సురక్ష క్యాంపులు నిర్వహించారు.
అక్కడిక్కడే సర్టిఫికెట్లు జారీచేసేందుకు పూర్తిస్థాయిలో మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసుకున్నారు. మంచి నెట్‌ ఉండేలా, బ్యాండ్‌ విడ్త్‌ ఉండేలా ముందస్తు ఏర్పాటు చేసుకోవడం ద్వారా దాదాపుగా ఎలాంటి సమస్యలు లేకుండా తొలిరోజు పైరులకు సేవలు అందించగలిగారు.
క్యాంపులు రిసెప్షన్‌ డెస్క్‌ సర్వీసు రిజిస్ట్రేషన్‌ డెస్క్‌ లేదా జగనన్నకు చెబుదాం డెస్క్
వెరిఫికేషన్‌ డెస్క్‌, ఆధార్‌ డెస్క్‌లు ఏర్పాటు చేసుకున్నారు.
తొలిరోజు 1305 సచివాలయాల్లో జగనన్న సురక్ష క్యాంపులు నిర్వహించగా, ఇందులో 22,728 మంది వాలంటీర్లు పాల్గొన్నారు. 14,28,481 మంది కుటుంబాలను కవర్‌ చేశారు.
తొలిరోజు క్యాంపుల్లో 4,42,840 సర్వీసులు రిజిస్టర్‌ కాగా, అక్కడికక్కడే 3,69,373 సర్టిఫికెట్లు జారీచేశారు. ఎలాంటి రుసులు లేకుండా పూర్తి ఉచితంగా ఈసేవలు అందుకున్నారు.
తొలిరోజు పౌరులు అందుకున్న వాటిని పరిశీలిస్తే ఆదాయం, కులం ధృవీరణ పత్రాలు అధిక సంఖ్యలో ఉన్నాయి. వివిధ విద్యాసంస్థల్లో అడ్మిషన్లు సమయం కావడంతో జగనన్న సురక్ష క్యాంపులను వినియోగించుకున్నామని విద్యార్థులు సంతోషం వ్యక్తంచేశారు. అలాగే మరణ, జనన ధృవీకరణ పత్రాలు కూడా చాలామంది పొందారు. చాలారోజులుగా సరైన ధృవపత్రాలు లేకపోవడం వల్ల ఈ సర్టిఫికెట్లు కోసం ఇబ్బందులు పడ్డామని, జగనన్న సురక్ష క్యాంపులు ద్వారా ఆసమస్యలన్నీ పరిష్కారం అయ్యాయని సంతృప్తి వ్యక్తంచేశారు.
ఈ సర్టఫికెట్లు పొందిన వారు…, గతంలో అక్కడక్కడా పథకాలు అందకుండా మిగిలిపోయిన వారు అర్హత సాధిస్తారు.

అలాగే ఖరీఫ్‌ సీజన్‌ కావడంతో కాలామంది కౌలు రైతులు సీసీఆర్సీ కార్డులు పొందడానికి ఈ క్యాంపులు బాగా ఉపయోగపడ్డాయి. సచివాలయాల్లో అందుబాటులో ఉన్న దరఖాస్తులను పూర్తిచేసి చాలామంది రైతులు సీసీఆర్సీ కార్డులు పొందారు. రైతుల్లో ఉన్న ఆందోళనను దూరంచేసి, కౌలు రైతులకు మేలు చేకూర్చడంలో క్యాంపులు బాగా ఉపయోగపడ్డాయని సంతోషం వ్యక్తంచేశారు.
ఆధార్‌ డెస్క్‌లో ఆధార్‌ కార్డుతో ఫోన్‌ నంబర్‌ లింకింగ్‌ సేవలు అందుకున్నారు.
మ్యుటేషన్‌ కోసం చాలామంది తమ సర్వీసులను రిజిస్టర్‌ చేసుకున్నారు. వాటిని ఎప్పటికప్పుడు అధికారులు పరిష్కరిస్తున్నారు.

ఈ ప్రభుత్వం రాకముందు గతంతో రెండు మూడు గ్రామాలకు ఒకరిద్దరు మాత్రమే ప్రభుత్వ ఉద్యోగులు ఉండేవారు. ఇప్పుడు సచివాలయ పరిధిలో కనీసం 10 నుంచి 11 మంది ఉద్యోగులు ఉన్నారు.దీంతో ఇలాంటి క్యాంపులు ద్వారా సేవలు మరింత విస్తృతం అయ్యాయి. అంతేకాకుండా నాణ్యమైన సేవలు ప్రజలకు అందుతున్నాయి. అవసరాలను బట్టి.. అక్కడక్కడ వైద్యసేవలుకూడా జగనన్న సురక్ష క్యాంపుల్లో నిర్వహించారు.

జులై 1 నుంచి నెలరోజులపాటు 15004 గ్రామ, వార్డు సచివాలయాల్లో సురక్ష క్యాంపులను నిర్వహిస్తారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

సులభతర రీతిలో రాజ్యాంగం

శ్రీదేవి మురళీధర్ రచన(డాక్టర్ వైజయంతి పురాణపండ)భారత రాజ్యాంగం…ఈ మాట ప్రతి అసెంబ్లీ...

ఎం ఎస్ ఆచార్యవర్యునికి అక్షర నీరాజనం

శ్రీ వేంకటేశ్వరస్వామిని రోజూ మాడభూషి శ్రీనివాసాచార్య సుప్రభాతంలో స్తుతి చేసేవారు.  రేఖామయధ్వజ సుధాకలశాతపత్ర వజ్రాఙ్కుశామ్బురుహ కల్పకశఙ్ఖచక్రైః । భవ్యైరలఙ్కృతతలౌ...

Rahul Ready to Roar in Parliament

(Anita Saluja, New Delhi) It was the Congress-Mukt Bharat, which...

“The Lost Childhood (Human Rights of Socially Deprived)”

(Prof Shankar Chatterjee) The book under the title of “THE...