హయత్ నగర్ నుంచి పటాన్ చెరుకు మెట్రో

Date:

తెలంగాణ సీఎం వాగ్దానం
పటాన్ చెరులో సూపర్ స్పెషాలిటి హాస్పటల్
నిర్మాణానికి సీఎం కేసీఆర్ శంకుస్థాపన
హాస్పిటల్ నిర్ణయం వెనుక మాజీ సీఎస్ రాజీవ్ శర్మ చొరవ

ఎమ్మెల్యే మహిపాల్ పై కె.సి.ఆర్. ప్రశంసలు
పటాన్ చెరు, జూన్ 22 :
రాష్ట్రం ఏర్పడక ముందుకు ఈ జిల్లాలో మంత్రిగా పనిచేస్తూ, ఇక్కడే సంగారెడ్డి గెస్ట్ హౌస్ లో పడుకుంటూ 3 రోజులు గల్లీ గల్లీ ఈ పటాన్ చెరువులో పాదయాత్ర చేశానని ముఖ్యం మంత్రి కె. చంద్రశేఖరరావు గుర్తుచేసుకున్నారు. ఇక్కడి సమస్యల్నీ తనకు తెలుసనీ, ఆ సమయంలో సదాశివ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారన్నారు. ప్రస్తుత మ్మెల్యే మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గం అభివృద్ధి పథంలో ముందుకుపోతోందని సీఎం ప్రశంసించారు. మెట్రో రైలు సౌకర్యాన్ని పటాన్చెరు వరకూ విస్తరించాలని మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ, ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి కోరారని చెప్పారు. పటాన్చెరులో నిర్మించ తలపెట్టిన సూపర్ స్పెషలిటీ దవాఖానాకు గురువారం శంకుస్థాపన చేసిన అనంతరం ఏర్పాటైన సభలో కె.సి.ఆర్ ప్రసంగించారు… ప్రసంగం ఆయన మాటల్లోనే…


• రాష్ట్రం ఏర్పడే క్రమంలో అనేకమైనటువంటి అపవాదులు, అపోహలు, అనుమానాలు కలిగించారు.
• మీ తెలంగాణ చిమ్మని చీకటైతది. కరెంటే రాదన్నారు. ఇప్పుడు తెలంగాణ ఎలా వెలుగుతున్నదో నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఇవ్వాళ పటాన్ చెరువులో మూడు షిఫ్టుల్లో పరిశ్రమలు నడుస్తున్నాయ్. నిదర్శనం మీ ముందే ఉన్నది.
• దేశం మొత్తం మీద ఎన్ని కష్టాలకోర్చయినా సరే పరిశ్రమలకు, గృహాలకు, కమర్షియల్ అవసరాలకు, వ్యవసాయానికి 24 గంటలు కరెంటు ఇచ్చే ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ.
• ప్రతి ఇంటికి నల్లాబెట్టి నీళ్ళిచ్చే ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ
• తలసరి విద్యుత్ వినియోగంలో నెంబర్ వన్ తెలంగాణ


• తలసరి ఆదాయం 3,17,000 రూపాయలతో తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్ గా నిలిచింది.
• ఈ ప్రగతి ప్రజల ప్రేమ, దీవెనలు, మద్దతుతో పాటు ప్రజాప్రతినిధులు, అధికారుల కృష్టి, కష్టంతో సాధ్యమైంది.
• పటాన్ చెరువు దాకా మెట్రో విస్తరించాలని అడుగుతున్నారు . ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా పటాన్ చెరువు నుండి హయత్ నగర్ దాకా మెట్రో రావాల్సిన అవసరముంది. అది గ్యారంటీగా వచ్చి తీరుతుంది. మీరు మళ్ళీ గెలిపిస్తే వస్తుంది. తర్వాతి ప్రభుత్వం ఏర్పడ్డాక మొదటి కేబినేట్ మీటింగ్ లోనే పటాన్ చెరువు నుండి హయత్ నగర్ దాకా మెట్రో పొడిగింపునకు మంజూరు చేస్తానని మాటిస్తున్నాను. ఇది నా వ్యక్తిగత వాగ్దానం. దీంట్లో ఎలాంటి అనుమానం లేదు.
• ఇది పారిశ్రామిక ప్రాంతం కాబట్టీ ఇక్కడ పాలిటెక్నిక్ కాలేజీ కావాలని మహిపాల్ రెడ్డి అడిగారు. దీన్ని మంజూరు చేస్తున్నాం. ఈ రోజే జీవో కూడా విడుదల చేస్తాం.


• కొల్లూరులో ప్రారంభించిన డబుల్ బెడ్ రూమ్ ల గృహ సముదాయంలో పటాన్ చెరువు నియోజకవర్గానికి 2 వేల ఇండ్లు వస్తాయి.
• పటాన్ చెరువుకు పెద్ద సంఖ్యలో పరిశ్రమలు వస్తున్నాయి. ఇక్కడ కళ్ళద్దాలు తయారు చేసే మెడికల్ డివైజెస్ ఫ్యాక్టరీలో 15 వేల మంది పనిచేస్తున్నారని మహిపాల్ రెడ్డి చెప్పారు. పటాన్ చెరువు ఇంకా అభివృద్ధి చెందాలి. త్వరలో ఇక్కడ ఐటి కంపెనీలు వచ్చేలా కెటిఆర్ కృషి చేస్తారు.
• బిహెచ్ఈఎల్, పటాన్ చెరువుకు మధ్యలో ఉండే రామసముద్రం చెరువును సుందరీకరించి గొప్పగా చేయాలని కోరుతున్నారు. నీటిపారుదల శాఖ నుండి నిధులు మంజూరు చేయించి సుందరీకరణ పనులు చేపట్టాలని, సిద్దిపేట కోమటి చెరువును తయారుచేసినట్లుగా ఈ చెరువును గొప్పగా చేయాలని నేను హరీశ్ రావు గారిని నేను కోరుతున్నాను.
• కొత్తగా కాలనీలు ఏర్పడిన వెంటనే అన్ని రకాల మౌలిక సదుపాయాలు వెంటనే రావు. స్థానిక సంస్థల దగ్గర అంత డబ్బు ఉండదు. అదనపు సాయం కావాలని ఎమ్మెల్యే గారు అడుగుతున్నారు.


• మూడు మున్సిపాలిటీలు, మూడు డివిజన్లున్నాయని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి చెప్పారు. మూడు మున్సిపాలిటీలకు ఒక్కో మున్సిపాలిటికి 30 కోట్ల రూపాయలు, మూడు డివిజన్లకు ఒక్కో డివిజన్ కు 10 కోట్ల రూపాయల చొప్పున ఇస్తాం. ముగ్గురు కార్పోరేటర్లు మూడు డివిజన్లను అభివృద్ధికి పాటుపడాలి.
• 55 గ్రామ పంచాయతీలకు ఒక్కో పంచాయతీకి 15 లక్షల రూపాయలను సీఎం ఫండ్ నుండి మంజూరు చేస్తున్నాను.
• మహిపాల్ రెడ్డి కోరిక మేరకు ఇక్కడ రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తాం.
• మాజీ చీఫ్ సెక్రటరీ రాజీవ్ శర్మగారు నిజాయితీ కలిగిన అధికారి. ప్రభుత్వానికి ముఖ్య సలహాదారుగా ఉంటూ పొల్యూషన్ బోర్డు ఛైర్మన్ గా ఉన్నారు. మీకు తెలియకుండానే ఆయన ఇక్కడ పలుమార్లు పర్యటనలు చేపట్టారు. భవిష్యత్ లో ఇక్కడ పొల్యూషన్ ఏర్పడకుండా చర్యలు తీసుకోవాలనీ, ఒకవేళ పొల్యూషన్ సమస్యలు ఏర్పడినా ఇక్కడికిక్కడే ట్రీట్మెంట్ సౌకర్యాలు కల్పించేలా సూపర్ స్పెషాలిటి హాస్పటల్ కావాలని, వారే చొరవ తీసుకొని 200 కోట్ల రూపాయలతో హాస్పటల్ నిర్మించేలా చర్యలు తీసుకోవడంలో రాజీవ్ శర్మదే ప్రధాన పాత్ర. వారందరికీ మనందరి తరఫున ధన్యావాదాలు తెలుపుతున్నాను.
• మనం కడుతున్న డబుల్ బెడ్ రూం ఇండ్లు, మిషన్ భగీరథతో పైపులా ద్వారా ఇంటింటికి మంచినీటి సరఫరా వంటి కార్యక్రమాలు ఇండియాలోనే లేవు.
• అద్భుతమైన కాళేశ్వరం ప్రాజెక్టుతో నీళ్ళ కరువు లేకుండా చేసుకున్నాం. ఇంకా మరెన్నో కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఉంది.


• మోసపోతే గోస పడతామని నేను మీకు చెప్పదలుచుకున్నాను.
• హరీశ్ రావు వచ్చిన తర్వాత వైద్యరంగం పరగులు పెడుతున్నది.
• కెసిఆర్ కిట్ మాత్రమే కాకుండా స్త్రీలు గర్భవతులుగా ఉన్నప్పుడే పుట్టే బిడ్డ, తల్లి ఆరోగ్యంగా ఉండాలని కేసిఆర్ న్యూట్రిషన్ కిట్ లు ప్రారంభించాం.
• వైద్యారోగ్య రంగంలో హైదరాబాద్ కు పోతే ఉస్మానియా, గాంధీ హాస్పటల్స్, నీలోఫర్ తప్ప వేరే హాస్పటల్ లేకుండేవి.
• అద్భుతమైన 5 కార్పోరేట్ స్థాయి హాస్పటల్స్ త్వరలో రాబోతున్నాయి.
• ప్రభుత్వ రంగంలో నాడు 17 వేల బెడ్లు ఉంటే, నేడు 50 వేల బెడ్లను ఏర్పాటు చేసుకున్నాం.
• ప్రతి బెడ్డుకు కూడా ఆక్సిజన్ ఉండే విధంగా చర్యలు తీసుకున్నాం.
• ఇస్నాపూర్ లో 550 టన్నుల ఆక్సిజన్ ప్రొడక్షన్ యూనిట్లను ఏర్పాటు చేసుకునాం. అత్యవసర పరిస్థితి ఉంటే కేంద్రాన్ని కోరాల్సిన అవసరం లేదు.
• ఈ కార్యక్రమాలు ఇలాగే విజయవంతంగా కొనసాగాలంటే, మహిపాల్ రెడ్డిని మరోసారి దీవించినట్లైతే మీక్కావల్సిన పనులు గొప్పగా చేసుకుందాం.
• ఈ రాష్ట్రం ఇంత స్వల్ప సమయంలో గొప్పగా ఎదుగుతుందని ఎవరూ కూడా ఊహించలేదు.
• తెలంగాణ ఏర్పడ కూడదని అని మాట్లాడిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గతంలో ఆంధ్రలో ఎకరం అమ్మితే తెలంగాణలో ఐదారు ఎకరాలు కొనుక్కునే వాళ్లం, ఇప్పుడు తెలంగాణలో ఎకరం భూమి అమ్మితే ఆంధ్రలో 50 ఎకరాలు కొనుక్కుంటున్నారని చెప్పారు. అంటే విషయం తారుమారైంది.


• మంచి ప్రభుత్వం, మంచి నాయకత్వంతో తెలంగాణ భూములు ధరలు పెరిగాయి.
• తెలంగాణ ఏర్పడితే భూముల ధరలు తగ్గుతాయని రంగారెడ్డి జిల్లా వాళ్ళను సమైక్య శక్తులు అపోహలకు గురిచేసినయి.
• తెలంగాణ ప్రభుత్వానికి ప్రజలను బాగా చూసుకోవాలనే తపన, చిత్తశుద్ది, నిజాయితీ ఉంది కాబట్టీ దిగ్విజయవంతంగా ముందుకు పోతున్నాం.
• ఈ రోజు అమరుల సంస్మరణ కార్యక్రమానికి హాజరు కావాల్సి ఉన్నది. జీవితాలను అర్పించడం కంటే గొప్ప త్యాగం ఇంకోటి ఉండదు. తెలంగాణ బిడ్డలు ఉద్యమంలో తమ ప్రాణాలను ధారపోసి, త్యాగం చేశారు. దశాబ్ది ఉత్సవాల ముగింపు సందర్భంలో వాళ్ళందరినీ స్మరించుకోవడం మనందరి కర్తవ్యం.
• మీ అందరికీ మరొక్కసారి తెలంగాణ దశాబ్ది ఉత్సవాల శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను…జై తెలంగాణ – జై భారత్ అంటూ ప్రసంగాన్ని ముగించారు.
సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువుకు చేరుకున్న ముఖ్యమంత్రికి మంత్రులు, ప్రజాప్రతినిధులు స్వాగతం పలికారు. వేద మంత్రోచ్ఛారణల నడుమ సూపర్ స్పెషాలిటి హాస్పటల్ భూమి పూజ ప్రాంగణానికి చేరుకొని, ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. శాస్త్రోక్తంగా నిర్వహించిన భూమి పూజా కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు.


ఈ ప్రతిపాదిత హాస్పిటల్ కు సంబంధించిన జీవో నంబర్ 82 ను ప్రభుత్వం గతంలోనే (16.07.2022 న) విడుదల చేసింది. ప్రస్తుతం నిర్మించనున్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ జీ+2 భవనాన్ని రూ.184.87 కోట్లతో 3.7 ఎకరాల్లో, 93 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించడం జరుగుతుంది. కార్డియాలజీ, న్యూరాలజీ, నెఫ్రాలజీ, న్యూరోసర్జరీ, పల్మనాలజీ, యూరాలజీ, ప్లాస్టిక్ సర్జరీ, ఆర్థోపెడిక్స్ తదితర ప్రత్యేక విభాగాలతో అత్యాధునిక వసతులను ప్రభుత్వం కల్పించనున్నది. ఈ హాస్పిటల్ లో సూపర్ స్పెషాలిటీ, ఓపీ, ఐపీ సేవలు, ట్రౌమా కేర్ సేవలు, ఐసీయూ సేవలు, డయాగ్నస్టిక్స్ సర్వీసుల సేవలను అందించనున్నారు. ప్రస్తుతమున్న హాస్పిటల్ ను 5.08 ఎకరాల్లో 2012 లో వంద పడకలతో స్థాపించడం జరిగింది. అయితే ఈ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ను పునర్వవస్థీకరించిన తర్వాత.. 100 పడకలతో నూతన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మరియు 100 పడకలతో పాత విభాగం పరిపుష్టి కానున్నది. మొత్తం 8.78 ఎకరాల విస్తీర్ణంలో ఉండే ఈ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లో నూతన బ్లాక్ 3.7 ఎకరాల్లో, పాత బ్లాక్ 5.08 ఎకరాల్లో నిర్మితమై ప్రజలకు అద్భుతమైన వైద్య సేవలను అందించనున్నది.


కార్యక్రమంలో… మంత్రులు కెటిఆర్, హరీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, మహమూద్ అలీ, మల్లారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, ఎంపీలు జోగినపల్లి సంతోష్ కుమార్, కొత్త ప్రభాకర్ రెడ్డి, రంజిత్ రెడ్డి, బి.బి. పాటిల్, రాములు, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, యెగ్గె మల్లేశం, శంభీపూర్ రాజ్, బొగ్గారపు దయానంద్, యాదవరెడ్డి,ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బాల్క సుమన్, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, జీవన్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, మాధవరం కృష్ణారావు, అరికెపూడి గాంధీ, కె.పి వివేకానంద్, మంచిరెడ్డి కిషన్ రెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డి, చంటి క్రాంతి కిరణ్, మహిళా కమిషన్ చైర్మన్ సునితా లక్ష్మారెడ్డి, తెలంగాణ వైద్యసేవలు, మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ కార్పోరేషన్ చైర్మన్ ఎర్రోల్ల శ్రీనివాస్, మేయర్ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటి మేయర్ మోతే శ్రీలత రెడ్డి, సీఎస్ శాంతి కుమారి, సిఎం కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి, ఎంఎయుడి స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్, జిహెచ్ఎంసి కమిషనర్ లోకేష్ కుమార్, హెచ్ఎండబ్ల్యుఎస్ఎస్ బి ఎండి దాన కిషోర్, వైద్యారోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ, డిఎండీ రమేశ్ రెడ్డి, టిఎస్ఎంఐడిసి ఎండీ చంద్రశేఖర్ రెడ్డి, సిఎం వోఎస్డీ గంగాధర్, సంగారెడ్డి జిల్లాపరిషత్ చైర్ పర్సన్ మంజుశ్రీ మహిపాల్ రెడ్డి, డిసిఎంఎస్ చైర్మన్ శివ కుమార్, బిఆర్ఎస్ నాయకులు దాసోజు శ్రావణ్, శంకరన్న దోంగ్డే, బిక్షపతి తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

స్వర యోగి త్యాగరాజు

నేడు గాన బ్రహ్మ జయంతి(మాడభూషి శ్రీధర్)త్యాగరాజు పుట్టిన రోజు భారతీయ సంగీత...

Most Important exponents of Vaishnava tradition

Today is the 1007th birth anniversary of Ramanujacharya Why returns...

Surprise move off Samajwadi Chief

Akhilesh Yadav wants to be prime Minister (Dr Pentapati Pullarao) Former...

Can BJP make a mark in Tamil Nadu?

(Dr Pentapati Pullarao)  There is much discussion whether BJP...