ఐ.ఐ.హెచ్.టి.కి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు

Date:

ప్రారంభ కార్యక్రమంలో సీఎం రేవంత్ ప్రకటన
నేతన్నల రుణాలు మాఫీ చేస్తాం
గత ప్రభుత్వం వారికి బకాయిలను చెల్లించలేదు
హైదరాబాద్, సెప్టెంబర్ 09 :
ఎలక్షన్, సెలెక్షన్, కలెక్షన్ చేసిన వారిది త్యాగం కాదని సీఎం రేవంత్ చెప్పారు. తెలంగాణ కోసం పదవిని తృణప్రాయంగా వదిలేసిన కొండా లక్ష్మణ్ బాపూజీది అసలు సిసలైన త్యాగమని ఆయన గుర్తు చేశారు. త్యాగానికి మారుపేరు కొండా లక్ష్మణ్ బాపూజీ పేరును IIHT కి పెట్టాలని నిర్ణయించినట్టు సీఎం ప్రకటించారు. సంబంధిత జీవో విడుదల చేయాలని సీఎం రేవంత్ అధికారులను ఆదేశించారు.
హైదరాబాద్ లలిత కళాతోరణంలో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ (IIHT) ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి హాజరయ్యారు. మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఉన్నతాధికారులు, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా IIHT విద్యార్థులకు నెలకు రూ.2500 ప్రోత్సహకాన్ని సీఎం అందించారు.


ఐ.ఐ.హెచ్.టి.కి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు
తెలంగాణ విద్యార్థులు IIHTలో చేరాలంటే ఒడిశా, ఏపీకి వెళ్లాల్సి వచ్చేదని రేవంత్ చెప్పారు.
పదేళ్లుగా తెలంగాణలో ఇనిస్టిట్యూట్ ఏర్పాటుకు చర్యలు తీసుకోలేదని ఆయన విమర్శించారు. ఈ అంశం తమ దృష్టికి వచ్చిన వెంటనే ఇనిస్టిట్యూట్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశామని తెలిపారు. రాష్ట్రానికి ప్రత్యేకంగా ఇనిస్టిట్యూట్ ఉండి తీరాలని ప్రధాని, కేంద్ర మంత్రిని కోరినట్టు చెప్పారు. తమ విజ్ఞప్తికి కేంద్రం స్పందించిన కేంద్రం ఇనిస్టిట్యూట్ ఏర్పాటుకు ఆమోదం తెలిపిందని వెల్లడించారు. ఈ క్రమంలో ఈ సంవత్సరమే ఇనిస్టిట్యూట్ మొదలుపెట్టాలని అధికారులను ఆదేశించామన్నారు.


విద్యార్థులకు నైపుణ్య శిక్షణ ఇవ్వాలనే ఉద్దేశంతోనే రాష్ట్రంలో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేశామని వివరించారు.
వచ్చే ఏడాది నుంచి స్కిల్ యూనివర్సిటీలో ఐ.ఐ.హెచ్.టి. భవనం
వచ్చే ఏడాది నుంచి IIHT భవనం స్కిల్స్ యూనివర్సిటీలో ఉండేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. నేత కార్మికుల కళ్లలో ఆనందం చూడాలనే ధ్యేయంతో రూ.290కోట్ల బకాయిలు విడుదల చేసినట్టు చెప్పారు. గతంలో ఆర్భాటం, సినీ తారల తతళుకు బెళుకులు తప్ప.. నేతన్న ఆత్మగౌరవంతో బ్రతికే పరిస్థితి లేదన్నారు. గత ప్రభుత్వం బతుకమ్మ చీరల బకాయిలను చెల్లించకుండా ఆలస్యం చేసిందని మండిపడ్డారు. కానీ మేం బతుకమ్మ చీరల బకాయిలు చెల్లించి.. రాజకీయాలకు అతీతంగా సిరిసిల్ల కార్మికులను ఆదుకున్నట్టు సీఎం వెల్లడించారు.


స్వయం సహాయక సభ్యులకు ఏడాదికి రెండు చీరలు
రాష్ట్రంలో ఉన్న 63 లక్షల మంది స్వయం సహాయక సంఘాల సభ్యులకు ఏడాదికి రెండు చీరల చొప్పున పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు రేవంత్ చెప్పారు. మంచి డిజైన్, క్వాలిటీ తో ముందుకు రావాలని ఇప్పటికే అధికారులకు ఆదేశాలు ఇచ్చామని తెలిపారు. ఏడాదికి దాదాపు కోటి 30 లక్షల చీరలకు ఆర్డర్ ఇవ్వనున్నట్టు తెలంగాణ సీఎం చెప్పారు. సమాఖ్య సంఘాల ఎన్నికల నిర్వహణ విషయంలో కార్యాచరణ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.


రూ.30కోట్లున్న చేనేత రుణాలు మాఫీ చేసి చేనేత కార్మికుల రుణ విముక్తులను చేస్తామని ప్రకటించారు. రైతన్న ఎంత ముఖ్యమో మాకు నేతన్న కూడా అంతే ముఖ్యమని స్పష్టం చేశారు. నేతన్నల సమస్యల పరిష్కారానికి అన్నగా అండగా ఉంటానాని భరోసా ఇచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

పుష్కర శ్లోకాలు… అన్వేషణ

వేద పండితుల నుంచి సన్నిధానం వరకూగౌతమి గ్రంధాలయం గొప్పదనం….ఈనాడు - నేను:...

రామోజీ వర్కింగ్ స్టైల్ అలా ఉంటుంది…

నాకు ఆయన నుంచి వచ్చిన తొలి ప్రశంస?నేను - ఈనాడు: 15(సుబ్రహ్మణ్యం...

రామోజీ కామెంట్స్ కోసం చకోర పక్షుల్లా….

టీం వర్క్ కు నిదర్శనం సైక్లోన్ వార్తల కవరేజ్ఈనాడు - నేను:...

కర్ఫ్యూలో పరిస్థితులు ఎలా ఉంటాయంటే….

విజయవాడ ఉలికిపాటుకు కారణం?ఈనాడు - నేను: 13(సుబ్రహ్మణ్యం వి.ఎస్. కూచిమంచి)పని పూర్తయింది....
slothttps://www.rajschool.com/slot onlinehttps://sai-ban.com/https://britoli.com/https://www.anabias.com/https://bcrbltd.com/https://s2aconsultingfze.com/https://rock-poker.com/https://koinhoki88.org/https://koinhoki88.net/https://rawsolla.com/https://koinhoki888.com/https://koinhoki88.com/https://infomedan.net/qqplazaslot gacorslot gacor koinhoki88slot gacor terbaru koinhoki88koinhoki88koinhoki88slot777https://usfinancehelp.com/https://collectingdiecasttoystoday.com/https://nyonyaguru.com/https://topindo-pulsa.com/https://gojekonline.com/https://dafrastar.com/https://www.reliantholdings.net/https://www.opalcitysview.com/https://lumarca.info/https://alt-qqaxioo.com/https://www.capuletlondon.com/https://www.tithaimart.com/https://www.trungvuongus.com/https://tropicalbioenergy.com/https://www.capitol-peak.com/https://pisswife.com/https://gamvipvn.com/https://www.elfutbolesnuestro.com/https://ampdsmart.com/https://schiffsilver.com/https://theicemall.com/https://shebenik.com/https://popvoxawards.com/https://www.adwebconsultancy.com/https://www.technotchsolutions.com/https://threekookaburras.com/https://marcjacobsonsale.com/https://www.forexrehberim.net/https://dreamlifefactory.com/https://www.videosocialcreative.com/https://www.oregonwetlands.net/https://www.americaneve.com/https://www.iamthelongtail.com/https://www.privatelivesbroadway.com/https://travelamateurs.com/https://sustaintheline.com/https://geekforcefive.com/https://galaksinews.com/https://sejutateknologi.com/https://harimausumateranews.com/https://diarysaham.com/https://lacakonline.com/https://undangansah.com/https://kottakkalayurvedapharmacy.com/https://kabforums.org/https://bhootmedia.com/https://erectie-goedkoop.com/https://heylink.me/Bandargaming-/https://qqcrownbos.com/https://bbqburgersmore.com/https://bjwentkers.com/https://mareksmarcoisland.com/https://safepaw.com/https://www.caretuner.com/https://myvetshop.co.za/https://rtxinc.com/https://voice-amplifier.co.uk/https://shamswood.com/