నీలగిరి కొండల్లో కూలిన హెలికాప్టర్
చాపర్‌లో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్, భార్య మధులిక
సిడిఎస్ నివాసానికి వెళ్ళిన రాజ్‌నాథ్
ప్రధాన మంత్రికి వివరణ
ప్రమాద స్థలికి హుటాహుటిన ఎయిర్ చీఫ్ మార్షల్
చెన్నై, డిసెంబర్ 8: చీప్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ప్రయాణిస్తున్న ఎమ్ఐ 17 విహెచ్ హెలికాప్టర్ తమిళనాడులోని వెల్లింగ్టన్ సమీపంలో ఉన్న కూనూర్‌లో కూలిపోయింది. ఇందులో రావత్‌తో పాటు భార్య మధులిక, పైలట్, మరో 11మంది ఉన్నారు. నీలగిరి కొండల్లోని వెల్లింగ్టన్‌లో ఉన్న ఆర్మీ కేంద్రంలో ఓ కార్యక్రమంలో పాల్గొనడానికి వెడుతుండగా ఈ ప్రమాదం సంభవించింది. హెలికాప్టర్ ప్రమాదం నుంచి జనరల్ బిపిన్ రావత్ క్షేమంగా బయటపడ్డారు. తీవ్ర గాయాలతో ఉన్న ఆయనను తక్షణం ఆర్మీ ఆస్పత్రికి తరలించారు. ఉదయం 9గంటలకు రావత్ ప్రత్యేక ఎయిర్ క్రాఫ్ట్‌లో ఢిల్లీ నుంచి బయలుదేరారు. సూలూరు నుంచి హెలికాప్టర్‌లో వెల్లింగ్టన్‌కు బయలుదేరారు. 12.20కి కూనూర్ వద్ద హెలికాప్టర్ కూలిపోయింది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఈ విషయం గురించి ప్రధాని మోడీకి వివరించారు. అనంతరం అత్యవసరంగా క్యాబినెట్ భేటీ ఏర్పాటైంది. తదుపరి రాజ్‌నాథ్ సిడిఎస్ బిపిన్ రావత్ ఇంటికి వెళ్ళారు. హెలికాప్టర్ కూలిన ఘటనపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ గురువారం ఉదయం పార్లమెంటులో ప్రకటన చేయనున్నారు. కిందటి ఫిబ్రవరిలో నాగాల్యాండ్‌లో హెలికాప్టర్ కూలిన ఘటననుంచి రావత్ క్షేమంగా బయటపడ్డారు.
ప్రమాదానికి కారణం వాతావరణం సరిగా లేకపోవడమా…సాంకేతిక లోపమా? అన్నది తేలాల్సి ఉంది. పెద్ద శబ్దం రావడం చూసి, బయటకు వచ్చాననీ, హెలికాప్టర్ మంటల్లో చిక్కుకుని కూలిపోతుండగా, దాని నుంచి కొంతమంది కిందపడిపోతూ కనిపించారనీ ప్రమాదాన్ని చూసిన ప్రత్యక్ష సాక్షి చెప్పారు. 11 మృతదేహాలను ప్రమాద స్థలం నుంచి స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన విషయం తెలిసిన వెంటనే ఎయిర్ చీఫ్ మార్షల్ ఘటనా స్థలానికి బయలుదేరారు. ప్రమాద ఘటన గురించి తెలుసుకున్న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ముంబై పర్యటనను రద్దు చేసుకుని న్యూఢిల్లీకి తిరిగి వస్తున్నారు. చాపర్ క్రాష్‌పై విచారణకు కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది.
హెలికాప్టర్‌లో జనరల్ బిపిన్ రావత్‌తో పాటు ఆయన భార్య మధులిక, బ్రిగేడియర్ ఎల్.ఎస్. లిడర్, లెఫ్టినెంట్ కల్నల్ హర్జిందర్ సింగ్, ఎన్.కె. గురుసేవక్ సింగ్, ఎన్.కె. జితేందర్ కుమార్, లెఫ్టినెంట్ ఎన్.కె. వివేక్ కుమార్, లెఫ్టినెంట్ ఎన్.కె. సాయితేజ, హవల్దార్ సత్పాల్ ఉన్నారు. మరోవంక, బిపిన్ రావత్ ఇంటికి ఆర్మీ అధికారులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. రావత్ కుటుంబ సభ్యులకు ధైర్యం చెబుతున్నారు. ఆర్మీ చీఫ్ మనోజ్ ముకుంద్ నవరానే జనరల్ రావత్ ఇంటికి వచ్చారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.
బిపిన్ రావత్ క్షేమం… చాపర్ క్రాష్‌పై రేపు ప్రకటన
Date: