మ‌హాద‌ళాధిప‌తి రావ‌త్ దుర్మ‌ర‌ణం

Date:

హెలికాప్ట‌ర్ క్రాష్‌లో 13మంది మ‌ర‌ణం
మృతుల‌లో రావ‌త్ భార్య మ‌ధులిక‌
సిడిఎస్ రావ‌త్చప‌ర్ దుర్మ‌ర‌ణం
నీల‌గిరి కొండ‌ల్లో కూలిన హెలికాప్ట‌ర్
చెన్నై, డిసెంబ‌ర్ 8: హెలికాప్ట‌ర్ కూలిన ప్ర‌మాదంలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్ దుర్మ‌ర‌ణం పాల‌య్యారు. ఆయ‌న‌తో పాటు ప్ర‌యాణిస్తున్న భార్య మ‌ధులిక స‌హా మ‌రో 13మంది ఈ ప్ర‌మాదంలో మ‌ర‌ణించారు. నీల‌గిరి కొండ‌ల్లోని వెల్లింగ్ట‌న్‌లో ఉన్న ఆర్మీ కేంద్రంలో ఓ కార్య‌క్ర‌మంలో పాల్గొన‌డానికి వెడుతుండ‌గా ఈ ప్ర‌మాదం సంభ‌వించింది. ఎమ్ఐ-17 హెలికాప్ట‌ర్ ఈ ప్ర‌మాదానికి గుర‌యింది.

ప్ర‌మాద కార‌ణాల‌ను విశ్లేషిస్తున్నారు. ర‌క్ష‌ణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఈ విష‌యం గురించి ప్ర‌ధాని మోడీకి వివ‌రించారు. అనంత‌రం అత్య‌వ‌స‌రంగా క్యాబినెట్ భేటీ ఏర్పాటైంది. త‌దుప‌రి రాజ్‌నాథ్ సిడిఎస్ బిపిన్ రావ‌త్ ఇంటికి వెళ్ళారు. అంత‌కుముందు కింద‌టి ఫిబ్ర‌వ‌రిలో నాగాల్యాండ్‌లో హెలికాప్ట‌ర్ కూలిన ఘ‌ట‌న‌నుంచి రావ‌త్ క్షేమంగా య‌బ‌ట‌ప‌డ్డారు.

తొలుత ఆయ‌నను ఆస్ప‌త్రికి త‌ర‌లిస్తుండ‌గా త‌ల ఆడిస్తున్న వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి. ఆయ‌న క్షేమంగా ఉన్నార‌ని వార్త‌లు వెలువ‌డ్డాయి. ఆయ‌న మిన‌హా మిగిలిన 13మంది మ‌ర‌ణించార‌ని ఎయిర్ ఫోర్స్ ప్ర‌క‌టించింది. 80శాతం కాలిన గాయాల‌తో రావత్‌ను ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ఈయ‌న చాలా ముఖ్య‌మైన వ్యక్తి చాలా తొంద‌ర‌గా ఆస్ప‌త్రికి తీసుకెళ్ళాల‌ని త‌ర‌లిస్తున్న వారు అంటుండ‌డం వీడియోల‌లో వినిపించింది.


ప్ర‌మాదమా! కుట్రా!!
ప్ర‌మాదానికి కార‌ణం వాతావ‌ర‌ణం స‌రిగా లేక‌పోవ‌డ‌మా…సాంకేతిక లోప‌మా? అన్న‌ది తేలాల్సి ఉంది. పెద్ద శ‌బ్దం రావ‌డం చూసి, బ‌య‌ట‌కు వ‌చ్చాన‌నీ, హెలికాప్ట‌ర్ మంట‌ల్లో చిక్కుకుని కూలిపోతుండ‌గా, దాని నుంచి కొంత‌మంది కింద‌ప‌డిపోతూ క‌నిపించార‌నీ ప్ర‌మాదాన్ని చూసిన ప్ర‌త్య‌క్ష సాక్షి చెప్పారు. 11 మృత‌దేహాల‌ను ప్ర‌మాద స్థ‌లం నుంచి స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘ‌ట‌న విష‌యం తెలిసిన వెంట‌నే ఎయిర్ చీఫ్ మార్ష‌ల్ ఘ‌ట‌నా స్థలానికి బ‌య‌లుదేరారు.


రావ‌త్ కుటుంబానికి ప్ర‌ముఖుల ప‌రామ‌ర్శ‌
ప్ర‌మాదం జ‌రిగిన వెంట‌నే ఢిల్లీలోని రావ‌త్ ఇంటికి ఆర్మీ అధికారులు వ‌రుస‌గా వెళ్ళారు. ఆర్మీ చీఫ్ కూడా వెళ్ళారు., ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌ను ప‌రామ‌ర్శించారు. ప్ర‌మాదానికి సంబంధించి చ‌ర్చించేందుకు క్యాబినెట్ క‌మిటీ ఫ‌ర్ సెక్యూరిటీ స‌మావేశమైంది.
రావ‌త్ వ‌య‌సు 63 సంవ‌త్స‌రాలు. విశిష్ట సేవా స‌త‌కం, ఉత్త‌మ‌ యుద్ధ ప‌త‌కం ఆయ‌న‌ను వ‌రించాయి. 2019లో భార‌త త్రివిధ ద‌ళాల అధిప‌తిగా బాధ్య‌త‌లు స్వీక‌రించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

మీది ఉద్యోగం కాదు… భావోద్వేగం

ఎస్.ఐ.ల పాసింగ్ అవుట్ పెరేడ్లో సీఎం రేవంత్కాస్మటిక్ పోలీసింగ్ కాదు... కాంక్రీట్...

గాంధీ గారి కుర్చీ

(డా నాగసూరి వేణుగోపాల్, 9440732392)2024 సెప్టెంబర్ 9వ తేదీన నేను మద్రాసులో...

తెలంగాణను ట్రిలియన్ డాలర్ల స్థాయికి చేరుస్తాం

మా డిమాండ్ నెరవేరిస్తే కేంద్రానికి సహకరిస్తాంఫైనాన్స్ కమిషన్ సమావేశంలో రేవంత్ ప్రకటనహైదరాబాద్,...

పర్యావరణ హితంగా గ్రీన్ ఫార్మా సిటీ అభివృద్ధి

ముందుకు వస్తున్న ప్రముఖ కంపెనీలుమౌలిక సౌకర్యాల కల్పన వేగిరపరచాలిఫార్మా సిటీ ప్రణాళికలపై...