గడ్డి అన్నారంలో ఆయుర్వేద దినోత్సవం

0
234

నేషనల్ ఇనిస్ట్యూట్ ఆఫ్ ఇండియన్ మెడికల్ హెరిటేజ్ గడ్డిఅన్నారం లో ఏర్పాటు చేసిన ఆయుర్వేద ప్రదర్శనను మార్నింగ్ స్టార్ హైస్కూల్ విద్యార్థులు సందర్శించారు.
ఆయుష్ మంత్రిత్వ శాఖ లోని కేంద్రీయ ఆయుర్వేద విజ్ఞాన పరిశోధన పరిషత్తు కు చెందిన నేషనల్ ఇనిస్ట్యూట్ ఆఫ్ ఇండియన్ మెడికల్ హెరిటేజ్ గడ్డిఅన్నారం -10 వ ఆయుర్వేద దినోత్సవం (23 సెప్టెంబర్, 2025) వేడుకలను పురస్కరించుకుని శనివారం గడ్డిఅన్నారంలోని మార్నింగ్ స్టార్ హై స్కూల్ కు చెందిన విద్యార్థులు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ మెడికల్ హెరిటేజ్ లో జరిగిన ఆయుర్వేద ప్రదర్శనను విచ్చేసారు. ఈ కార్యక్రమం ఇన్స్టిట్యూట్ అసిస్టెంట్ డైరెక్టర్-ఇన్-చార్జ్ డాక్టర్ జి.పి. ప్రసాద్, పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీమతి గీత నిపుణుల మార్గదర్శకత్వంలో నిర్వహించారు.


ఆయుర్వేద దినోత్సవం, ‘పోషణ్ మాహ్’, ‘ఆరోగ్యకరమైన మహిళలు, బలమైన కుటుంబం’ ప్రచారంలో భాగంగా నిర్వహిస్తున్నారు. ఆయుర్వేదం యొక్క ప్రజా సంక్షేమ అంశాల గురించి, ముఖ్యంగా ఆహారం, ఔషధ మొక్కల ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యం గురించి అవగాహన పెంచడం దీని ప్రధాన లక్ష్యం.


ఎగ్జిబిషన్‌తో పాటుగా విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇన్‌స్టిట్యూట్‌లోని లైబ్రరీ, మ్యూజియం, మెడిసినల్ గార్డెన్‌లను సందర్శించారు. డాక్టర్ జి.పి. ప్రసాద్ పిల్లల ఆరోగ్యానికి సరైన పోషకాహారం ప్రాముఖ్యతపై ఉపన్యసించారు.

అసిస్టెంట్ డైరెక్టర్ (ఆయుర్వేదం), డాక్టర్ సుబోస్, రోజువారీ దినచర్యలు, కాలానుగుణ దినచర్యలను అనుసరించడం వల్ల కలిగే ప్రయోజనాలను తెలియజేశారు. పరిశోధకురాలు (ఆయుర్వేదం), డాక్టర్ దీపిక, విద్యార్థులకు వ్యక్తిగత ఆరోగ్య చర్యల గురించి తెలియజేశారు.

ఔషధ మొక్కలను విద్యార్థులకు ఉచితంగా పంపిణీ చేశారు. డాక్టర్ నాగరాజు, సంస్థలో ఉన్న ఔషధ మొక్కల గురించి రోజువారి జీవితంలో ఉపయోగించే ఔషధ మొక్కలు గుర్తింపు మరియు వాటి ఔషధాలు ఉపయోగము గురించి విద్యార్థిని విద్యార్థులకు వివరించారు.

ఈ కార్యక్రమాన్ని పరిశోధన అధికారి (ఆయుర్వేదం) డాక్టర్ సంతోష్ మానే, లైబ్రేరియన్ శ్రీనివాసరావు సమన్వయం చేశారు. వర్ష కుమారి, డాక్టర్ సత్యబ్రత నందా, ప్రతాప్, శ్రీమతి అలివేలు, శ్రీమతి మంజుల, శ్రీమతి శ్రావణి, సంస్థ అధికారులు పాల్గొన్నారు. చివరిగా విద్యార్థిని విద్యార్థులకు పాఠశాల సిబ్బందికి డాక్టర్ సాకేత్ రామ్ కృతజ్ఞతలు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here