(రోచిష్మాన్, 9444012279)
ప్రముఖ మలయాళం సినిమా నటుడు మోహన్‌లాల్ దాదా సాహెబ్ ఫాల్కే పురస్కార గ్రహీత! మేలైన నటుడికి సరైన పురస్కారం మోహన్‌లాల్‌కు ఈ దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారం.
దేశ సినిమాలో వచ్చిన అత్యున్నమైన నటుల్లో ఒకరు మోహన్‌లాల్. Most prolific performer మోహన్‌లాల్.
మలయాళం సినిమాలో తొలిదశలో సత్యన్ గొప్ప నటుడు. అటు తరువాత మమ్మూట్టి తరువాత మోహన్‌లాల్. మలయాళం సినిమా స్వర్ణయుగంలో ప్రధాన భాగస్వామి మోహన్‌లాల్.
మోహన్‌లాల్ నటన spirited, and versatile.
ఒక నటుడికి నటనపై సరైన దృక్పథం ఉండాలి, ఆపై నటించగలగాలి. ఈ రెండు అంశాల్లో మేటి మోహన్‌లాల్.
Method acting, conceptulization, insight, depth, ability, screen presence, subtlety, పరిశ్రమ, ఇవన్నీ ఉన్న దేశంలోని గొప్ప నటుడు మోహన్‌లాల్.
కమల్ హాసన్, మణిరత్నం వంటి అంతర్జాతీయ దృక్పథం ఉన్న కళాకారులకు కూడా మోహన్‌లాల్ అభిమాన నటుడు.
సంస్కృతంలో అభినివేశం ఉన్న, జాతీయతా భావాలు ఉన్న అరుదైన నటుడు మోహన్‌లాల్. సినిమా నటులకు భారతీయతా భావాలు ఉండడం అరుదు కదా? మోహన్‌లాల్ అందుకు భిన్నం.
‘నటన లేదా అభినయం అన్నది విద్య లేదా చదువు ఆపై పరిశ్రమ’ అన్న జ్ఞానం ఉన్న నటుడు మోహన్‌లాల్. క్రమశిక్షణతో ఆ చదువులో ఉత్తీర్ణుడై పరిశ్రమించి గొప్ప కళాకారుడుయ్యారు మోహన్‌లాల్. నటన అన్నది తెలివికి, తెలివిడికి సంబంధించినది అన్న ‘స్పృహ’ ఉన్న మాగొప్ప నటుడు మోహన్‌లాల్.
మోహన్‌లాల్ చిరునవ్వు చాల బావుంటుంది. గొప్ప చిరునవ్వులా మోహన్‌లాల్ అభినయం మహోన్నతంగా ఉంటుంది.
మేలైన అభినయానికి సరైన అభివ్యక్తి మోహన్‌లాల్.
మోహన్‌లాల్‌కు దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారం రావడం ‘గొప్ప నటన’ అన్న దానికి పురస్కారం రావడం.
మోహన్‌లాల్‌కు అభినందనలు; అభివాదాలు.

(వ్యాస రచయిత ప్రముఖ విమర్శకుడు)

