గణేశ మండపాలకు ఉచిత విద్యుత్తు: రేవంత్

Date:

ఖైరతాబాద్ వినాయకునికి సీఎం పూజలు
హైదరాబాద్, సెప్టెంబర్ 07 :
ఖైరతాబాద్ గణేశ నవరాత్రి ఉత్సవాలను ఉత్సవ కమిటీ దేశంలోనే అత్యంత గొప్పగా నిర్వహిస్తోందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. శనివారం ఉదయం ఆయన ఖైరతాబాద్ మహాగణపతి తొలి పూజలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడారు. గణేశ మండపాలకు ప్రభుత్వం ఉచితంగా ఇస్తున్నట్లు ఆయన ప్రకటించారు. సీఎం ప్రసంగం ఆయన మాటల్లోనే..

70 ఏళ్లుగా నిష్ఠతో, భక్తి శ్రద్ధలతోఉత్సవాలను నిర్వహించడం అభినందనీయం.

ప్రభుత్వం గణేష్ ఉత్సవాలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఉత్సవ కమిటీల సమస్యలను తెలుసుకుంది.

హైదరాబాద్ నగరంలో 1లక్షా 40వేల విగ్రహాలను ఏర్పాటు చేసి పూజిస్తున్నారు.

గణేష్ మండపాలకు ప్రభుత్వం ఉచిత విద్యుత్ అందించాలని నిర్ణయించింది.

అకాల వర్షాలతో పలు జిల్లాల్లో వరద బీభత్సం సృష్టించింది.

అందరి పూజలు, దేవుడి ఆశీస్సులతో వరదల నుంచి బయటపడ్డాం.

ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీకి నా అభినందనలు.

స్వర్గీయ పీజేఆర్ ఉన్నప్పటి నుంచి ఇప్పటివరకు ఇక్కడ ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం అభినందనీయం..

ఆనాడు పీసీసీ అధ్యక్షుడిగా, ఇప్పుడు ముఖ్యమంత్రిగా స్వామివారి ఆశీస్సులు తీసుకున్నా.

ప్రతీ ఏటా ఉత్సవ కమిటీ ఎప్పుడు ఆహ్వానించినా వచ్చి స్వామివారి ఆశీస్సులు తీసుకుంటానని రేవంత్ తన ప్రసంగాన్ని ముగించారు. సీఎం వెంట ఎమ్మెల్ల్యే దానం నాగేందర్, టీపీసీసీ ఇంచార్జి దీపదాస్ మున్షి తదితరులు ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

China and Trump Tariff war: China has upper hand

(Dr Pentapati Pullarao) The tariff –trade war, started by President...

A Movement of Hearts, Heritage, and Harmony

Culture, Language, Indian, and Connections (CLIC) & International Sweet...

Donald Trump’s Tariff War

(Dr Pentapati Pullarao) Ever since Donald trump was sworn as...

సమయ పాలనతో సాగే రామాయణం

వాల్మీకి సంస్థ కార్యక్రమంలో డాక్టర్ వైజయంతిట్యాంక్ బండ్ పై వాల్మీకి విగ్రహానికి...