మ‌ళ్ళీ జాతీయ వేదిక‌పైకి తెలంగాణ సీఎం

Date:

ఢిల్లీకి చంద్ర‌శేఖ‌ర‌రావు
రాష్ట్రాల ప‌ర్య‌ట‌న‌కు ప్ర‌ణాళిక‌
పంజాబ్ రైతుల‌కు ఆర్థిక సాయం
కేజ్రీవాల్‌, భ‌గ‌వంత్ మాన్‌ల‌తో భేటీ
అనంత‌రం మ‌హారాష్ట్ర‌, క‌ర్ణాట‌క‌ల‌కూ
హైద‌రాబాద్‌, మే 20:
జాతీయ రాజ‌కీయాలు మ‌ళ్ళీ ఒక‌సారి వేడెక్కుతున్నాయి. తెలంగాణ రాష్ట్రానికి బీజేపీ జాతీయ నేత‌లు వ‌రుస క‌ట్టిత‌న క్ర‌మంలో రాష్ట్ర ముఖ్య‌మంత్రి కె.చంద్ర‌శేఖ‌ర‌రావు త‌న దృష్టిని మ‌రోసారి జాతీయ రాజ‌కీయాల‌పై సారించారు. జాతీయ స్థాయిలో వివిధ‌ రాజకీయ సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గారు దేశవ్యాప్తంగా పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా రాజకీయ, ఆర్థిక, మీడియా రంగాలకుచెందిన ప్రముఖులతో సమావేశం కానున్నారు. దేశంకోసం వీర మరణం పొందిన సైనిక కుటుంబాలను ఆదుకోనున్నారు. వ్యవసాయం రైతుల హక్కుల కోసం పోరాడి కేంద్రాన్ని నిగ్గదీసి సంచలనం సృష్టించిన జాతీయ రైతు ఉద్యమంలో అసువులు బాసిన రైతుల కుటుంబాలను కలిసి సిఎం పరామర్శించనున్నారు.
సిఎం కెసిఆర్ పర్యటన వివరాలు
శుక్రవారం సిఎం కెసిఆర్ ఢిల్లీ పర్యటన చేపట్టనున్నారు. ఢిల్లీలో వివిధ రాజకీయ పార్టీల నేతలతో సిఎం సమావేశం కానున్నారు. ప్రముఖ ఆర్థికవేత్తలతో సమావేశమౌతారు. ఈ సందర్భంగా దేశ ఆర్థిక పరిస్థితులపై చర్చించనున్నారు. అదే సందర్భంగా ప్రముఖ జాతీయ మీడియా సంస్థల జర్నలిస్టు ప్రముఖులతో సిఎం కెసిఆర్ సమావేశాలు నిర్వహిస్తారు.
మే 22 వ తేదీన మధ్యాహ్నం…. ముఖ్యమంత్రి కెసిఆర్ ఢిల్లీనుంచి చంఢీఘర్ పర్యటన చేపడతారు. గతంలో ప్రకటించిన విధంగా జాతీయ రైతు ఉద్యమంలో అసువులు బాసిన సుమారు 600 రైతు కుటుంబాలను సిఎం కెసిఆర్ పరామర్శిస్తారు. వారికి ఆర్థికంగా భరోసానందించేందుకు వొక్కో కుటుంబానికి రూ.3 లక్షల చొప్పున చెక్కుల పంపిణీ చేస్తారు. ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని… ఢిల్లీ సిఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సిఎం భగవంత్ మాన్ సింగ్ లతో కలిసి సిఎం కెసిఆర్ చేపడతారు. సంచలనం సృష్టించిన రైతు ఉద్యమంలో అసువులు బాసిన.. పంజాబ్, హర్యాన, ఉత్తర్ ప్రదేశ్, ఢిల్లీ రాష్ట్రాలకు చెందిన రైతుల కుటుంబాలకు చెక్కులను అందచేస్తారు.
26 మే ఉదయం… సిఎం కెసిఆర్ బెంగళూరు పర్యటన చేపట్టనున్నారు. ఈ పర్యటనలో భాగంగా మాజీ భారత ప్రధాని దేవగౌడ కర్నాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామితో సమావేశమౌతారు.
బెంగుళూరు నుంచి మే 27 తేదీన రాలేగావ్ సిద్ది పర్యటనను చేపట్టనున్నారు. అక్కడ ప్రముఖ సమాజిక ఉద్యమకారుడు అన్నా హజారేతో సిఎం కెసిఆర్ భేటీ అవుతారు. అటునుంచి సాయిబాబా దర్శనం కోసం సిఎం కెసిఆర్ షిరిడీ వెళతారు. అక్కడనుంచి పర్యటనలను ముగించుకుని తిరిగి హైద్రాబాద్ కు సిఎం కెసిఆర్ చేరుకుంటారు.
అటు తర్వాత మే 29 లేదా 30 న బెంగాల్, బీహార్ రాష్ట్రాల పర్యటనకు సిఎం కెసిఆర్ సంసిద్దం కానున్నారు. గాల్వాన్ లోయలో వీరమరణం పొందిన భారత సైనిక కుటుంబాలను సిఎం పరామర్శిస్తారు. గతంలో తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన విధంగా వారి కుటుంబాలను సిఎం కెసిఆర్ ఆదుకోనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

పుష్కర శ్లోకాలు… అన్వేషణ

వేద పండితుల నుంచి సన్నిధానం వరకూగౌతమి గ్రంధాలయం గొప్పదనం….ఈనాడు - నేను:...

రామోజీ వర్కింగ్ స్టైల్ అలా ఉంటుంది…

నాకు ఆయన నుంచి వచ్చిన తొలి ప్రశంస?నేను - ఈనాడు: 15(సుబ్రహ్మణ్యం...

రామోజీ కామెంట్స్ కోసం చకోర పక్షుల్లా….

టీం వర్క్ కు నిదర్శనం సైక్లోన్ వార్తల కవరేజ్ఈనాడు - నేను:...

కర్ఫ్యూలో పరిస్థితులు ఎలా ఉంటాయంటే….

విజయవాడ ఉలికిపాటుకు కారణం?ఈనాడు - నేను: 13(సుబ్రహ్మణ్యం వి.ఎస్. కూచిమంచి)పని పూర్తయింది....
slothttps://www.rajschool.com/slot onlinehttps://sai-ban.com/https://britoli.com/https://www.anabias.com/https://bcrbltd.com/https://s2aconsultingfze.com/https://rock-poker.com/https://koinhoki88.org/https://koinhoki88.net/https://rawsolla.com/https://koinhoki888.com/https://koinhoki88.com/https://infomedan.net/qqplazaslot gacorslot gacor koinhoki88slot gacor terbaru koinhoki88koinhoki88koinhoki88slot777https://usfinancehelp.com/https://collectingdiecasttoystoday.com/https://nyonyaguru.com/https://topindo-pulsa.com/https://gojekonline.com/https://dafrastar.com/https://www.reliantholdings.net/https://www.opalcitysview.com/https://lumarca.info/https://alt-qqaxioo.com/https://www.capuletlondon.com/https://www.tithaimart.com/https://www.trungvuongus.com/https://tropicalbioenergy.com/https://www.capitol-peak.com/https://pisswife.com/https://gamvipvn.com/https://www.elfutbolesnuestro.com/https://ampdsmart.com/https://schiffsilver.com/https://theicemall.com/https://shebenik.com/https://popvoxawards.com/https://www.adwebconsultancy.com/https://www.technotchsolutions.com/https://threekookaburras.com/https://marcjacobsonsale.com/https://www.forexrehberim.net/https://dreamlifefactory.com/https://www.videosocialcreative.com/https://www.oregonwetlands.net/https://www.americaneve.com/https://www.iamthelongtail.com/https://www.privatelivesbroadway.com/https://travelamateurs.com/https://sustaintheline.com/https://geekforcefive.com/https://galaksinews.com/https://sejutateknologi.com/https://harimausumateranews.com/https://diarysaham.com/https://lacakonline.com/https://undangansah.com/https://kottakkalayurvedapharmacy.com/https://kabforums.org/https://bhootmedia.com/https://erectie-goedkoop.com/https://heylink.me/Bandargaming-/https://qqcrownbos.com/https://bbqburgersmore.com/https://bjwentkers.com/https://mareksmarcoisland.com/https://safepaw.com/https://www.caretuner.com/https://myvetshop.co.za/https://rtxinc.com/https://voice-amplifier.co.uk/https://shamswood.com/