రైతన్నలకు అండగా నిలుస్తున్న జగన్ ప్రభుత్వం
ఏటా మూడు విడతలుగా 13, 500 సాయం
అమరావతి, మే 15: రైతుల అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా చెప్పినదానికన్నా ముందుగా… మాట ఇచ్చిన దానికన్నా మిన్నగా రైతన్నలకు సాయం చేస్తున్న ప్రభుత్వం. ప్రతి ఏటా 3 విడతల్లో రూ.13,500లను రైతు భరోసా కింద సాయం అందిస్తోంది. నాలుగో ఏడాది మొదటి విడతగా మేలో ఇచ్చే రూ.7,500లకు గానూ రూ.5,500లను సోమవారం (16–05–2022) నాడు ఏలూరు జిల్లా గణపవరంలో బటన్ నొక్కి రైతుల ఖాతాల్లో వైయస్ జగన్ ప్రభుత్వం జమ చేయనుంది.
ఈ నెల 31న రైతుల ఖాతాల్లో జమ కానున్న కేంద్రం ఇవ్వనున్న పీఎం కిసాన్ నిధులు మరో 2వేలు.
దీంతో మొత్తంగా నెలాఖరు నాటికి 50.10 లక్షల మంది రైతుల ఖాతాల్లో ఒక్కొక్కరికి రూ.7,500 చొప్పున దాదాపు రూ.3,758 కోట్లు జమ కానున్నాయి.
దేశంలో ఎక్కడా లేని విధంగా సొంత భూమి సాగు చేసుకుంటున్న రైతులతో పాటు ఎస్.సి, ఎస్.టి, బిసి, మైనార్టీ, కౌలు రైతులు, ఆర్వోఎఫ్ఆర్(అటవీ), దేవాదాయ భూములు సాగుచేసుకుంటున్న రైతన్నలకు కూడా వైఎస్సార్ రైతు భరోసా కింద ఏటా రూ.13,500 సాయం అందిస్తున్న ఏకైక ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్.
ప్రతి ఏటా దాదాపు దాదాపు 50 లక్షల మంది రైతులకు సుమారు రూ.7 వేల కోట్లు రైతు భరోసా సాయంగా అందిస్తున్న ప్రభుత్వం.
ఇప్పుడు అందిస్తున్న సాయం రూ.3,758 కోట్లతో కలిసి ఈ మూడేళ్లలో రైతన్నలకు వైయస్.జగన్ ప్రభుత్వం అందించిన మొత్తంలో కేవలం వైయస్సార్ రైతు భరోసా సాయం మాత్రమే రూ.23,875 కోట్లు.
ఖరీప్ సాగుకు సన్నద్ధమవుతున్న అన్నదాతకు పెట్టుబడికి ఉపయోగపడాలనే మంచి ఉద్దేశ్యంతో వైయస్సార్ రైతు భరోసా క్రింద మొదటి విడత సాయంగా మే నెలలో అందిస్తున్న రూ.3,758 కోట్లతో పాటు జూన్ నెలలో వైయస్సార్ ఉచిత పంటల బీమా క్రింద గత ఖరీప్ 2021కి సంబంధించి, చెప్పిన విధంగా 2022 ఖరీప్ ప్రారంభ సమయానికే బీమా పరిహారం కూడా అందించనున్న ప్రభత్వం.
మేనిఫెస్టోలో ఏటా రూ.12,500 చొప్పున నాలుగేళ్లకు రూ.50 వేలు ఇస్తామని హామీ ఇవ్వగా…. వాస్తవానికి ఏటా వేయి రూపాయలు అదనంగా రూ.13,500 చొప్పున.. నాలుగేళ్లకు బదులుగా ఏకంగా ఐదేళ్లకు రూ.67,500 ఇస్తున్న ప్రభుత్వం. మొత్తంగా రైతన్నకు అదనంగా అందించిన మొత్తం రూ.17,500.
వైఎస్సార్ రైతు భరోసా క్రింద ప్రతి ఏటా మూడు విడతల్లో రూ.13,500 సాయాన్ని ఏపీ ప్రభుత్వం అందించనున్నది.
మొదటి విడతగా మే నెలలో జమ చేస్తున్న రూ.7,500తో పాటు రెండో విడతగా అక్టోబరులో రూ.4వేలు, మూడో విడతగా జనవరిలో రూ.2వేలు రైతన్నల ఖాతాలలో జమ కానున్నాయి.
రైతు లేనిదే రాజ్యం లేదు..
రైతు లేనిదే రాజ్యం లేదని బలంగా నమ్ముతూ.. గ్రామాలలో రైతు భరోసా కేంద్రాలను స్ధాపించి విత్తనం నుంచి పంట అమ్మకం వరకూ ప్రతి అడుగులోనూ రైతన్నలకు కొండంత అండగా రైతు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ…. వ్యవసాయ సంక్షేమ రంగాల్లో దేశానికే ఆదర్శంగా నిలిచిన ప్రభుత్వం.
గతంలో ఎన్నడూ లేని విధంగా వివిధ పథకాల ద్వారా ఈమూడేళ్లలో రైతన్నలకు ప్రభుత్వం చేకూర్చిన లబ్ధి దాదాపు రూ.1,10,099.21 కోట్లు.