లక్షమంది రైతులకు ఉచితంగా యూరియా

0
194

సీఎంకు రెండు కోట్లు అందించిన మిర్యాలగూడ ఎమ్మెల్యే
కుమారుడి వివాహ రిసెప్షన్ రద్దు చేసిన లక్ష్మారెడ్డి


హైదరాబాద్, సెప్టెంబర్ 18 :
మనసుండాలె కానీ, సాయం చేయడానికి ఎన్నో మార్గాలున్నాయి. అందులో ఇదొకటి. రైతు కోసం వారి కష్టాలను తీర్చడం కోసం ఒక ఎమ్మెల్యే ముందుకొచ్చారు. మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, కుటుంబ సభ్యులు గురువారం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. రైతులకు యూరియా అందజేసేందుకు ఆయన 2 కోట్ల రూపాయల చెక్కును సీఎంకు అందజేశారు. వీటిని తన నియోజకవర్గం లోని రైతుల కోసం ఖర్చు చేయాలని విజ్ఞప్తి చేశారు. లక్ష మంది రైతులకు ఒక్కో యూరియా బస్తా ఉచితంగా అందజేయాలని ఆయన కోరారు.

ఇటీవల ఎంఎల్ ఏ కుమారుడు సాయి ప్రసన్న వివాహం అయ్యింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని మిర్యాలగూడలో భారీ ఎత్తున రిసెప్షన్ ఏర్పాటు చేయాలని ఎంఎల్ ఏ లక్ష్మారెడ్డి భావించారు. యూరియా కోసం రైతులు పడుతున్న కష్టాలు ఆయనను కలిచివేశాయి. వెంటనే తన నిర్ణయాన్ని మార్చుకుని రిసెప్షన్ ను రద్దు చేశారు. ఆ డబ్బును రైతుల కోసం ఖర్చు చేయడానికి నిర్ణయించారు. ఆ మొత్తాన్ని ఆయన సీఎంకు అందించారు. విషయం తెలుసుకున్న ఎంఎల్ ఏ లక్ష్మారెడ్డి , కుటుంబ సభ్యులను సీఎం రేవంత్ అభినందించారు.

వివాహాలు రెసెప్షన్ల పేరిట కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతున్న వారు ఇలా ప్రజోపయోగ కార్యక్రమాలకు, ముఖ్యంగా రైతుల కోసం ఖర్చు పెట్టె దిశగా ఆలోచిస్తే బాగుంటుంది కదూ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here