బొబ్బిలి కోటలో ఆయుధ పూజ
(K.v.s. Subrahmanyam)
బొబ్బిలి పేరు చెప్పగానే గుర్తొచ్చేది బొబ్బిలి యుద్ధం. ఆ యుద్ధంలో తాండ్ర పాపారాయుడు చూపిన పరాక్రమం. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే, ఈరోజు ఆయుధ పూజ.

అందరూ తాము ఉపయోగించే వస్తువులు… అవి కార్లైనా సరే, లేదా యంత్ర సామగ్రి అయినా సరే. అన్నిటికీ పూజలు చేస్తారు. ఈ సంప్రదాయాన్ని బొబ్బిలి రాజవంశం తూచా తప్పకుండా పాటిస్తుంది.

ఆరోజున బొబ్బిలి వంశ వారసులైన ఆర్.వి.ఎస్.కె. రంగారావు (సుజయ్ నాయన), ఆర్.వి.ఆర్.కె. రంగారావు (రామ్ నాయన) బేబీ నాయన, ఆర్.వి.ఎస్.కె.కె. రంగారావు (బేబీ నాయన) ప్రతి ఏడాది తమ ఆయుధాగారంలో ఉన్న నాటి ఆయుధాలను వెలికి తీస్తారు. పూజలు చేస్తారు.

రాజవంశ సంప్రదాయ దుస్తులను ధరించి ఈ క్రతువును వారు నిర్వహిస్తారు. అందుకు సంబంధించిన చిత్రమాలికే ఇది. అన్నట్టు ఇందులో దీనికి సంబంధించిన వీడియోను కూడా చూడవచ్చు.




























