అమరావతికి కేంద్రం బాసట

Date:

జన రంజకంగా సీతమ్మ చిట్టా
వేతన జీవులకు ఊరట
ప్రత్యేక హోదాపై బీహారుకు నో
న్యూ ఢిల్లీ, జులై 23 :
మధ్యతరగతి ప్రజల ఆకాంక్షలు, వికసిత్‌ భారత్‌ లక్ష్యంగా ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌. కేంద్ర బడ్జెట్‌ ను ప్రవేశపెట్టారు. 9 ప్రాధాన్య అంశాల ఆధారంగా ఈ బడ్జెట్‌ను రూపొందించారు. 2047లో నాటికి భారత్‌ని అభివృద్ధి చెందిన దేశంగా నిలపాలని మోదీ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నేపధ్యంలో 2024-2025 బడ్జెట్‌లో ప్రభుత్వం ప్రధానంగా దృష్టి పెట్టనున్న మోదీ ప్రభుత్వం నిర్దేశించుకున్న తొమ్మిది ప్రాధాన్యతలు, నాలుగు రంగాలను నాలుగు మూల స్తంభాలుగా బడ్జెట్‌లో ప్రకటించారు
‘వికసిత్ భారత్’కు తొమ్మిది ప్రాధాన్యతలు
వ్యవసాయం, ఉపాధి కల్పన, నైపుణ్యాభివృద్ది, మెరుగైన మానవ వనరులు, సామాజిక న్యాయం, తయారీ, సేవా రంగం, పట్టణాభివృద్ధి, ఇంధన భద్రత, మౌలిక సదుపాయాలు, నూతన ఆవిష్కరణలు, పరిశోధన -అభివృద్ధి
నాలుగు మూల స్తంభాలు
మధ్యంతర బడ్జెట్‌లో పేర్కొన్నట్లు నాలుగు వేర్వేరు విభాగాలపై దృష్టి పెట్టి ఆ నాలుగు స్తంభాలను పటిష్ట పరిచే రీతీలో కేటాయింపులు చేశారు పేదలు, మహిళలు, యువత, రైతులను దృష్టిలో పెట్టుకొని విధి విధానాలను ప్రాధాన్యతా క్రమంలో కేటాయింపులను ఆయా రంగాలకు కేటాయించారు.
ఉపాధి, నైపుణ్య కార్యక్రమాలు
ఉపాధి, నైపుణ్య కార్యక్రమాల కోసం తాజా బడ్జెట్‌లో నిర్మలా సీతారామన్‌ ఐదు పథకాలను ప్రవేశ పెట్టారు. ఐదేళ్లలో 4.1 కోట్ల మంది యువతకు ఉపాధి, నైపుణ్యం, ఇతర అవకాశాలను అందించడానికి సవివరమైన ప్రణాళికలను రూపొందించారు. ఈ కార్యక్రమ నిర్వహణ వ్యయం రూ.2 లక్షల కోట్లు. ప్రస్తుత ఏడాది విద్య, ఉపాధి, నైపుణ్యం కోసం ప్రభుత్వం రూ.1.48 లక్షల కోట్లు కేటాయించాలని నిర్ణయించారు.
పీఎం గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పొడిగింపు
పీఎం గరీబ్ కళ్యాణ్ అన్న యోజనను ప్రభుత్వం మరో ఐదేళ్లపాటు పొడిగించింది. ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా 80 కోట్ల మందికి ప్రయోజనం చేకూరుస్తుంది. పేదలకు ఆహార భద్రతను అందిస్తుంది.
పట్టణ గృహ నిర్మాణానికి భారీ నిధులు
కొలేటరల్ లేదా థర్డ్ పార్టీ గ్యారెంటీ లేకుండా టర్మ్ లోన్‌లను సులభతరం చేసేందుకు ప్రభుత్వం, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల కోసం క్రెడిట్ గ్యారెంటీ పథకాన్ని తీసుకువచ్చింది. వచ్చే ఐదేళ్లలో పట్టణ గృహ నిర్మాణానికి రూ.2.2 లక్షల కోట్ల కేటాయించటం వల్ల సామాన్యుని సొంత ఇంటి కల నిజం కాబోతోంది.
సంకీర్ణ మిత్ర ధర్మం పాటిస్తూ :
ప్రభుత్వం ఏర్పాటులో తెలుగు దేశం, జేడియూ కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ప్రత్యేక హోదా ఇవ్వాలని బిహార్ డిమాండ్, అటు ఆంధ్రప్రదేశ్ కూడా ఆచితూచి వ్యవహరించిన నేపథ్యంలో సంకీర్ణ ధర్మాన్ని పాటించిన మోదీ ప్రభుత్వం రెండు రాష్ట్రాలకు బడ్జెట్లో ప్రాధాన్యం కల్పించింది. బిహార్ కు ప్రత్యేక హోదా సాధ్యం కాదని తేల్చిచెప్పిన కేంద్రం.. బడ్జెట్లో మాత్రం అధిక కేటాయింపులతో శాంతపరిచే ప్రయత్నం చేసినట్లు కనిపిస్తోంది. ఈ క్రమంలో తాజా బడ్జెట్లో రెండు రాష్ట్రాలల్లో అభివృద్ధి ప్రాజెక్టులకు కేటాయింపులను పరిశీలిస్తే…
అమరావతికి రూ.15వేల కోట్లు!
ఏపీ సర్వతోముఖావృద్ధికి ప్రాధాన్యం ఇస్తామని చెబుతోన్న కేంద్ర ప్రభుత్రం ఆ దిశగా అడుగులు వేసినట్లు కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం అమలుకు కట్టుబడి ఉన్నామని ఉద్ఘాటించింది. రాష్ట్రానికి రాజధాని అవసరాన్ని గుర్తించి.. అమరావతికి రూ.15వేల కోట్ల ప్రత్యేక సాయాన్ని ఈ ఆర్థిక సంవత్సరంలోనే అందిస్తామని తెలిపింది. అవసరాన్ని బట్టి వివిధ ఏజెన్సీల ద్వారా మరిన్ని నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చింది. పోలవరం ప్రాజెక్టును కూడా త్వరితగతిన పూర్తి చేసేందుకు కృషి చేస్తామని పేర్కొంది. రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాల్లో వెనకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ కింద నిధులు మంజూరు చేయనున్నట్లు బడ్జెట్లో ప్రకటించింది. రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి మరింత ఊతమిచ్చేందుకు గాను అవసరమైన నీటి, విద్యుత్, రైల్వే, రోడ్డు ప్రాజెక్టులకు నిధులు మంజూరు చేస్తామని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. వీటితోపాటు ఏపీ పునర్విభజన చట్టంలో పేర్కొన్న విధంగా రాయలసీమ, కోస్తాంధ్ర ప్రాంతాల్లోని వెనకబడిన ప్రాంతాలకు గ్రాంట్లు ఇస్తామని తెలిపింది. విశాఖ- చెన్నై కారిడార్లో కొప్పర్తికి ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు ప్రకటించింది.
ముహార్ రోడ్లకు రూ.26వేల కోట్లు
బిహార్లో రహదారుల అభివృద్ధి కోసం కేంద్రం భారీగా కేటాయింపులు జరిపింది. ఇందుకోసం మొత్తంగా రూ.26వేల కోట్ల ఆర్ధిక సాయం అందిస్తామని తెలిపింది. జాతీయ రహదారుల కోసమే రూ.20వేల కోట్లు కేటాయించనున్నట్లు ప్రకటించింది. పట్నా-పుర్నియాలను కలుపుతూ ఎక్స ప్రెస్స్ జాతీయ రహదారి అభివృద్ధి. బక్సర్-భాగల్పుర్, బోధగయా-రాజ్గిర్-వైశాలీ దర్భంగాలను అనుసంధానించటం. బక్సర్ జిల్లాలో గంగానదిపై రెండు లైన్ల వంతెన నిర్మాణం, భాగల్ పుర్ లోని పిపౌంతీలో రూ.21,400 కోట్ల అంచనాతో 2400 మెగావాట్ల విద్యుదుత్పత్తి కేంద్రం ఏర్పాటు, రాష్ట్రంలో పర్యటకాన్ని మరింత అభివృద్ధి చేయడం ఈ కార్యక్రమలో భాగంగా గయ, రాజిన్లలో టెంపుల్ కారిడార్ల అభివృద్ధితోపాటు వరదల నుంచి రాష్ట్రాలన్ని రక్షించేందుకు గాను రూ.11,500 కోట్లతో వరదల నియంత్రణ నిర్మాణాలు చేపట్టనుంది.


తూర్పు రాష్ట్రాల కోసం ‘పూర్వోదయ’
దేశంలో తూర్పు రాష్ట్రాల అభివృద్ధి కోసం కట్టుబడి ఉన్నామని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఝార్ఖండ్, పశ్చిమబెంగాల్, ఒడిశా రాష్ట్రాల అభివృద్ధికి కృషి లో భాగంగా మానవ వనరుల అభివృద్ధి, మౌలిక సదుపాయాలు, ఆర్థిక అవకాశాలు కల్పించడంపై దృష్టి పెట్ట నున్నది . మొత్తంగా పారిశ్రామిక కారిడార్న అభివృద్ధి చేసి , వికసిత్ భారత్ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఈ ప్రాంతాన్ని ప్రబలమైన ఆర్దిక కేంద్రంగా మార్చడమే తమ ప్రభుత్వ లక్ష్యం ఉద్దేశ్యమని నిర్మల సీతారామన్ చెప్పారు.
వేతన జీవికి స్వల్ప ఊరట
కొత్త పన్ను విధానంలో కొన్ని మార్పులు పన్ను శ్లాబుల్లో మార్పుతో పాటు, స్టాండర్డ్‌ డిక్షన్‌ విషయంలో ఊరట . ప్రస్తుతం స్టాండర్డ్‌ డిడక్షన్‌ రూ.50 వేలుగా ఉండగా.. ఆ మొత్తాన్ని రూ.75 వేలకు పెంచారు. స్టాండర్డ్‌ డిడక్షన్‌ మొత్తాన్ని 50 శాతం పెంచినట్లయ్యింది. దీనివల్ల రూ.17,500 వరకు పన్ను ఆదా చేసుకోవచ్చు పాత పన్ను విధానంలో మాత్రం ఎలాంటి మార్పులూ చేయలేదు.
కొత్త పన్ను శ్లాబులు 2024 ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి రానున్నాయి.
2025-26 మదింపు సంవత్సరంలో ఈ విధానంలో ఊరట పొందొచ్చు. బడ్జెట్‌లో ప్రతిపాదించిన మార్పుల ప్రకారం ఎప్పటిలానే కొత్త పన్ను విధానంలో రూ.3 లక్షల వరకు ఎలాంటి పన్నూ ఉండదు. గతంలో రూ.3-6 లక్షల శ్లాబులో 5 శాతంగా పన్ను ఉండేది. ఇప్పుడు ఆ పరిమితిని రూ.7 లక్షలకు పెంచారు. ఆ మేర శ్లాబుల్లో స్వల్ప మార్పు చేశారు. గతంలో రూ.6-9 లక్షల శ్లాబుకు 10 శాతం పన్ను ఉండేది. అది కూడా రూ.7-10 లక్షలకు మారింది. దీంతో రూ.10 లక్షల వార్షికాదాయం ఉన్న వారికి 10 శాతం పన్ను వర్తించనుంది. ఈ మార్పులు పాత పన్ను విధానం ఎంచుకునే వారికి వర్తించవు.పెన్షనర్లకు ఇదే తరహా ఊరట కల్పించారు. పెన్షనర్లకు రూ.15వేలుగా ఉన్న స్టాండర్డ్‌ డిడక్షన్‌ను రూ.25వేలకు పెంచారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో మూడింట రెండొంతుల మంది కొత్త పన్ను విధానాన్ని ఎంచుకున్నారు
కొత్త పన్ను విధానం
ఆదాయం పన్ను శాతం (%)
0-3 లక్షలు 0
03-06 లక్షలు 5
06-09- లక్షలు 10
09-12 లక్షలు 15
12- 15 లక్షలు 20
15 లక్షల పైన 30

దిగుమతి సుంకం భారీగా తగ్గింపు
పలు క్యాన్సర్‌ ఔషధాలు, మొబైల్ ఫోన్లపై దిగుమతి సుంకాన్ని భారీగా తగ్గించనున్నారు. దీని ప్రభావం వల్ల రిటైల్‌ మార్కెట్‌లో వీటి ధరలు గణనీయంగా తగ్గనున్నాయి. బంగారం, వెండి, లెదర్‌ వస్తువులు, సముద్రపు అహారం చౌకగా లభించనున్నాయి. పలు వస్తువులపై ఎక్సైజ్‌ సుంకాన్ని పెంచడంతో వాటి ధరలు పెరగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రిటైల్‌ మార్కెట్లో తగ్గే, పెరిగే అవకాశం ఉన్న కొన్ని వస్తువుల్ని పరిశీలిస్తే..
ధరలు తగ్గే వస్తువులివే..!
మొబైల్‌ ఫోన్లు, మొబైల్‌ ప్రింటెడ్‌ సర్క్యూట్‌ బోర్డులు, ఛార్జర్లపై దిగుమతి సుంకాన్ని తగ్గించడంతో వినియోగదారులకు స్మార్ట్‌ఫోన్ల ధరలు తగ్గే అవకాశం ఉంది. ఈ చర్యను మేడిన్‌ ఇండియా తయారీ రంగానికి ఊత్చ్చమిచ్చే శుభసూచకంగా పేర్కొనవచ్చు. గత ఆరేళ్లలో మొబైల్ ఫోన్ల దేశీయ ఉత్పత్తి, ఎగుమతుల్లో గణనీయమైన వృద్ధిని దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. క్యాన్సర్‌ ఔషధాలు మూడు క్యాన్సర్‌ ఔషధాలపై దిగుమతి సుంకాన్ని మినహాయించారు. దీంతో ఆ ధరలు తగ్గే అవకాశం ఉంది.బంగారం, వెండి: వీటిపై 6శాతం కస్టమ్స్‌ సుంకాన్ని తగ్గించారు. ఈ చర్యతో రిటైల్‌ డిమాండ్‌ పెరుగుతుందని, తద్వారా స్మగ్లింగ్‌ను అరికట్టడంలో దోహదపడుతుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.ప్లాటినమ్‌పైనా 6.5% కస్టమ్స్‌ సుంకాన్ని తగ్గిస్తూ బడ్జెట్‌లో ప్రతిపాదించారు. బంగారం, వెండి, ప్లాటినమ్‌పై బేసిక్‌ కస్టమ్స్ సుంకం తగ్గించాలంటూ ఎప్పటినుంచో జెమ్స్‌ అండ్‌ జ్యువెలరీ పరిశ్రమ డిమాండ్‌ చేస్తోంది. సీ ఫుడ్‌: రొయ్యలు, చేపల మేతపై బేసిక్‌ కస్టమ్స్ సుంకం 5%కి తగ్గించారు. తద్వారా వీటి ధరలు తగ్గే అవకాశం ఉంది. సౌర శక్తి , సౌర ఇంధన భాగాలు: సౌర విద్యుత్‌ సంబంధిత భాగాలపై సుంకాన్ని పొడిగించకూడదని కేంద్రం ప్రతిపాదించింది. ఇది సాంప్రదాయేతర ఇంధన వనరుల వియోగం పెంచి ఖర్చు తగ్గిస్తుంది , పర్యావరణాన్ని కాపాదుతుంది చౌకగా విద్యుత్ లభిస్తుంది మిగులు విద్యుత్ రాబడిని తెస్తుంది
తోలు లోలు ఉత్పత్తులు పాదరక్షల పై దిగుమతి సుంకం తగ్గించడంతో పాటు ఫెర్రోనికెల్, బ్లిస్టర్ కాపర్‌ వంటి మినరల్స్‌పై బేసిక్స్‌ కస్టమ్స్‌ సుంకాన్ని తగ్గిస్తూ ప్రతిపాదించారు.


ధరలు పెరిగే వస్తువులివే.. !
టెలికం పరికరాలు: మదర్‌బోర్డులపై 5శాతం దిగుమతి సుంకాన్ని పెంచాలని బడ్జెట్‌లో ప్రతిపాదించారు. దీంతో ఆయా వస్తువుల ధరలు పెరిగే అవకాశం ఉంది. అమ్మోనియం నైట్రేట్‌, నాన్‌ బయోడీగ్రేడబుల్‌ ప్లాస్టిక్‌పై కస్టమ్స్‌ సుంకాన్ని 10శాతానికి పెంచారు. దీంతో ఆయా వస్తువుల ధరలు పెరిగే అవకాశం ఉంది.
మహిళా ఉద్యోగులకు హాస్టళ్లు..
పరిశ్రమల సహకారంతో మహిళా ఉద్యోగులకు ప్రత్యేక హాస్టళ్లు, శిశు సంరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేస్తామని నిర్మలమ్మ ప్రకటించారు. తద్వారా ఉద్యోగాల్లో మహిళల భాగస్వామ్యం పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పరిశ్రమల భాగస్వామ్యంతో మహిళల కోసం ప్రత్యేక నైపుణ్య కార్యక్రమాలను చేపడతామని తెలిపారు.
నైపుణ్య శిక్షణా కార్యక్రమాలు.: .20 లక్షల మందికి శిక్షణ..రాష్ట్ర ప్రభుత్వాలు, పరిశ్రమల సహకారంతో నైపుణ్య శిక్షణ కోసం ప్రధానమంత్రి ప్యాకేజీ కింద నాలుగో పథకాన్ని ప్రకటించారు. ఐదేళ్ల వ్యవధిలో 20 లక్షల మంది యువతకు నైపుణ్య శిక్షణ ఇవ్వనునారు 1,000 ఐటీఐలను హబ్‌ అండ్ స్పోక్‌ మోడల్‌ కింద ఉన్నతీకరిస్తామని వెల్లడించారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా విద్యా విధానంలో మార్పులు . కొత్త కోర్సులను కూడా ప్రవేశపెట్టనున్నరు దీనివల్ల నైపున్Yఅంతో కూడిన మానవవనరులు ఆందుబాటులోకి వస్తాయి తద్వారా ఉపాధి అవకాశలు పెరుగుతాయి . పరిశ్రమలు , విదేశీ పెట్టుబడులు ఎక్కువగా ఆకర్షించటానికి ఈ పధకం ఉపయోగిస్తుంది.
నైపుణ్య శిక్షన కోసం ఋణాలు (స్కిల్‌ లోన్స్‌)
మోడల్‌ స్కిల్‌ లోన్‌ కింద రూ.7.5 లక్షల వరకు రుణాలకు ప్రభుత్వ ప్రయోజిత నిధి ద్వారా పూచీకత్తు ఇస్తారు దీని వల్ల ఏటా 25,000 మంది విద్యార్థులు లబ్ధి పొందుతారు
విద్యా రుణాలకు సాయం..
ప్రభుత్వ పథకాలు, విధానాల ద్వారా ఎలాంటి ప్రయోజనం పొందని యువత కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలను ప్రకటించింది. దేశీయ విద్యా సంస్థల్లో ఉన్నత విద్య కోసం తీసుకునే రూ.10 లక్షల వరకు రుణాలకు ఆర్థిక సాయం అందజేయనుంది. దీని కింద ఏటా లక్ష మంది విద్యార్థులకు రుణ మొత్తంపై మూడు శాతం వడ్డీ రాయితీ ఇచ్చే ఈ-వోచర్లు అందజేస్తామని ప్రకటించింది.

కేంద్ర బడ్జెట్‌లో అంశాలు
• ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన కింద గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో 3 కోట్ల అదనపు ఇళ్ల నిర్మాణం. అర్బన్‌ హౌసింగ్‌ కోసం ఐదేళ్లలో రూ.2.2 లక్షల కోట్లు కేటాయింపు.

• పారిశ్రామిక ప్రాంతాల్లో పనిచేసే కార్మికుల కోసం అద్దె గృహాల నిర్మాణం. పీపీపీ విధానంలో డార్మిటరీ తరహా ఇళ్ల నిర్మాణం.

• ముద్రా రుణాలు రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షలకు పెంపు. బడ్జెట్‌లో గ్రామీణ అభివృద్ధికి రూ.2.66 లక్షల కోట్లు కేటాయింపు

• ప్రకృతి వ్యవసాయంలోకి దేశవ్యాప్తంగా కోటి మంది రైతులను తీసుకొచ్చే ప్రణాళిక. 5 రాష్ట్రాల్లో కిసాన్‌ క్రెడిట్‌ కార్డులు. వ్యవసాయం, దాని అనుబంధ రంగాల అభివృద్ధికి రూ.1.5 లక్షల కోట్లు.

• ఎంపిక చేసిన నగరాల్లో స్ట్రీట్‌ ఫుడ్‌ హబ్‌ల ఏర్పాటు. రాష్ట్రాల మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు రూ.1.5 లక్షల కోట్లతో దీర్ఘకాల వడ్డీ రహిత రుణాలు.
• కొత్త ఉద్యోగులకు మూడు ప్రోత్సాహకాలు. సంఘటిత రంగంలోకి ప్రవేశించిన తొలిసారి ఉద్యోగులకు ఒక నెల వేతనం మూడు వాయిదాల్లో గరిష్ఠంగా రూ.15 వేలు చెల్లింపు. నెలకు గరిష్ఠంగా రూ. లక్ష లోపు వేతనం ఉన్నవారు అర్హులు. దీనివల్ల 210 లక్షల మంది యువతకు లబ్ధి చేకూరుతుంది.
• పీఎం స్వనిధి కింద వంద నగరాల్లో ప్రత్యేక వారాంతపు సంతలు ఏర్పాటు.
• క్యాపిటల్‌ గెయిన్స్‌ విధానం సరళీకరణ. దీర్ఘకాల లాభాలపై 12.5శాతం పన్ను. స్టార్టప్‌లకు ప్రోత్సాహకం.. ఏంజెల్‌ ట్యాక్స్‌ రద్దు.

ఈ చర్యలు దేశ ఆర్దిక ముఖ చిత్రాన్ని సమాలంగా మార్చి వేయనున్నాయి. మౌలిక వసతుల కల్పనపై మోదీ ప్రభుత్వ కృషికి ఇది ఓ ఉదాహరణ. ఆదాయ పన్ను శ్లాబుల్లో స్వల్ప మార్పులు వ్యక్తిగత ఆదాయ పన్ను విషయంలో వేతన జీవులకు కొంత ఊరట. పర్యావరణ శాస్త్ర సాంకేతిక రంగాల కేటాయింపులు దేశాభివృద్ధికి ఉత్పేరకాలు. మిత్ర ధర్మాన్ని పాటిస్తూ రానున్న కాలంలో దేశపురోభివృద్ధికి కావలసిన మౌలిక సదుపాయాలకు పెద్ద పీట వేస్తూ రైతన్నకు చేయాతనిస్తూ, మహిళా సాధికారత దిశగా అడుగువేస్తూ ఉపాధికి ఊతమిస్తూ పరిశ్రమలకు , కార్మికుల సంక్షేమాన్ని కాంక్షిస్తూ శాస్త సాంకేతిక విద్యా వైద్య పర్యావరణ రంగాలకు ప్రాధాన్యతనిస్తూ పర్యాటక రంగాన్ని పరుగులు పెట్టించేలా కేటాయింపులు చేస్తూ ఆభివృద్ధి సంక్షేమం సమతుల్యత పాటిస్తూ ప్రవేశ పెట్టిన 2024-25 (8 నెలల పూర్తి బడ్జెట్ ) జనరంజకమనే చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

గణేశుని పూజిస్తే మౌస్ క్లిక్ చేసినట్టే…

నిరాడంబరుడు… విఘ్నలను తొలగించే రాజు(డా. పురాణపండ వైజయంతి)మౌస్‌ని ఒక్కసారి క్లిక్‌ చేస్తే...

గణేశ మండపాలకు ఉచిత విద్యుత్తు: రేవంత్

ఖైరతాబాద్ వినాయకునికి సీఎం పూజలుహైదరాబాద్, సెప్టెంబర్ 07 : ఖైరతాబాద్ గణేశ...

పదేళ్లలో కానిది ఎనిమిది నెలల్లో సాకారం

సుసాధ్యం చేసిన జర్నలిస్టు బంధు రేవంత్‌రెడ్డిజె.ఎన్.జె. హోసింగ్ సొసైటీకి రేపు భూమి...

విఘ్నాధిపతి రూపం – విశ్వమానవాళి గుణగణాలకు ఓ సంకేతం

(వాడవల్లి శ్రీధర్)శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజంప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే"శుక్లాంబరధరం అంటే...