పది మంది దుర్మరణం?
మృతుల సంఖ్య పెరిగే అవకాశం
జంగారెడ్డిగూడెం, డిసెంబర్ 15: పశ్చిమ గోదావరి జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఆర్టీసీ బస్సు వాగులో పడింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది దుర్మరణం పాలయ్యారు. ప్రమాద సమయంలో బస్సులో 47మంది ఉన్నారని తెలుస్తోంది. జంగారెడ్డి గూడెం మండలం జల్లేరు వద్ద ఈ ప్రమాదం సంభవించింది. మిగిలిన 12మందికీ గాయాలయ్యాయి. అశ్వారావు పేట నుంచి జంగారెడ్డి గూడెం వెడుతుందగా బస్సు ప్రమాదానికి గురయింది. ప్రమాద స్థలిలో సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. బస్సులో పరిమితికి మించి ప్రయాణికులు ఎక్కడంతో ప్రమాదం జరిగిందంటున్నారు. వాగు లోతు ఎక్కువగా ఉండడం మృతుల సంఖ్య పెరగడానికి కారణమంటున్నారు. డివైడర్‌కు ఢీకొని బస్సు వాగులోకి దూసుకెళ్ళిందని తెలుస్తోంది.
ఏపీలో వాగులో పడ్డ బస్సు
Date: