ఆయుర్వేద మందుల పంపిణీ
హైదరాబాద్, జులై 09 : చింతలబస్తీ, చంపాపేట్ లో ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరాన్ని నిర్వహించారు. గడ్డిఅన్నారంలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ మెడికల్ హెరిటేజ్ సంస్థ ఆధ్వర్యంలో ఆజాదికా అమృత మహోత్సవం 2.౦లో ఆరోగ్యం, శ్రేయస్సు వేడుకల్లో భాగంగా ఈ శిబిరాన్ని నిర్వహించారు.
బి.కృష్ణ మనోహర్, అరవింద్. ఎ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ మెడికల్ హెరిటేజ్ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ జి పి ప్రసాద్ వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆయుర్వేద వైద్యులు రీసెర్చ్ ఆఫీసర్ డాక్టర్ సంతోష్ మానే, డాక్టర్ శ్రీ వాణి(ఎస్.ఆర్.ఎఫ్), డాక్టర్ హేమ రాజు(ఎస్.ఆర్.ఎఫ్), డాక్టర్ విజయలక్ష్మి(ఎస్.ఆర్.ఎఫ్), డాక్టర్ కిరీటి (ఎస్.ఆర్.ఎఫ్),చింతలబస్తీ వాసులకు వైద్య సేవలు అందించారు.
ఆయుర్వేద బ్రోచర్లు కరపత్రాలను పంపిణీ చేసారు. ఈ కార్యక్రమంలో కే శ్రీనివాసరావు లైబ్రేరియన్ కూడా పాల్గొన్నారు. ఈ శిబిరంలో సుమారు 150 మంది రోగులకు ఆయుర్వేద మందులను ఉచితంగా అందజేశారు. కార్యక్రమానికి సహకరించిన కృష్ణ మనోహర్, అరవింద్, అచ్యుతరామయ్య, ఫణిధర్ రెడ్డి, గణేష్, కృష్ణ, శంకర్ కు చింతలబస్తీ కాలనీ వాసులకు డాక్టర్ జిపి ప్రసాద్ ధన్యవాదాలు తెలిపారు.