చింతల్ బస్తీలో ఉచిత వైద్య శిబిరం

Date:

ఆయుర్వేద మందుల పంపిణీ
హైదరాబాద్, జులై 09 :
చింతలబస్తీ, చంపాపేట్ లో ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరాన్ని నిర్వహించారు. గడ్డిఅన్నారంలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ మెడికల్ హెరిటేజ్ సంస్థ ఆధ్వర్యంలో ఆజాదికా అమృత మహోత్సవం 2.౦లో ఆరోగ్యం, శ్రేయస్సు వేడుకల్లో భాగంగా ఈ శిబిరాన్ని నిర్వహించారు.

బి.కృష్ణ మనోహర్, అరవింద్. ఎ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ మెడికల్ హెరిటేజ్ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ జి పి ప్రసాద్ వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆయుర్వేద వైద్యులు రీసెర్చ్ ఆఫీసర్ డాక్టర్ సంతోష్ మానే, డాక్టర్ శ్రీ వాణి(ఎస్.ఆర్.ఎఫ్), డాక్టర్ హేమ రాజు(ఎస్.ఆర్.ఎఫ్), డాక్టర్ విజయలక్ష్మి(ఎస్.ఆర్.ఎఫ్), డాక్టర్ కిరీటి (ఎస్.ఆర్.ఎఫ్),చింతలబస్తీ వాసులకు వైద్య సేవలు అందించారు.

ఆయుర్వేద బ్రోచర్లు కరపత్రాలను పంపిణీ చేసారు. ఈ కార్యక్రమంలో కే శ్రీనివాసరావు లైబ్రేరియన్ కూడా పాల్గొన్నారు. ఈ శిబిరంలో సుమారు 150 మంది రోగులకు ఆయుర్వేద మందులను ఉచితంగా అందజేశారు. కార్యక్రమానికి సహకరించిన కృష్ణ మనోహర్, అరవింద్, అచ్యుతరామయ్య, ఫణిధర్ రెడ్డి, గణేష్, కృష్ణ, శంకర్ కు చింతలబస్తీ కాలనీ వాసులకు డాక్టర్ జిపి ప్రసాద్ ధన్యవాదాలు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

మీది ఉద్యోగం కాదు… భావోద్వేగం

ఎస్.ఐ.ల పాసింగ్ అవుట్ పెరేడ్లో సీఎం రేవంత్కాస్మటిక్ పోలీసింగ్ కాదు... కాంక్రీట్...

గాంధీ గారి కుర్చీ

(డా నాగసూరి వేణుగోపాల్, 9440732392)2024 సెప్టెంబర్ 9వ తేదీన నేను మద్రాసులో...

తెలంగాణను ట్రిలియన్ డాలర్ల స్థాయికి చేరుస్తాం

మా డిమాండ్ నెరవేరిస్తే కేంద్రానికి సహకరిస్తాంఫైనాన్స్ కమిషన్ సమావేశంలో రేవంత్ ప్రకటనహైదరాబాద్,...

పర్యావరణ హితంగా గ్రీన్ ఫార్మా సిటీ అభివృద్ధి

ముందుకు వస్తున్న ప్రముఖ కంపెనీలుమౌలిక సౌకర్యాల కల్పన వేగిరపరచాలిఫార్మా సిటీ ప్రణాళికలపై...