సైనిక వ్యూహాల‌లో రాటుదేలిన రావ‌త్‌

Date:

చొర‌బాట్ల క‌ట్డ‌డిలో పూర్తి సాధికార‌త‌
త‌దుప‌రి సిడిఎస్ ఎవ‌రు?
ప్ర‌స్తుత ఆర్మీ చీఫ్ ముకుంద్ మ‌నోజ్‌కే ఎక్కువ అవ‌కాశాలు
న్యూఢిల్లీ, డిసెంబ‌ర్ 9: తమిళనాడులోని  కూనూరులో బుధవారం జరిగిన హెలికాప్టర్‌ ప్రమాదంలో మరణించిన జనరల్‌ బిపిన్‌ రావత్‌కు సైన్యంతో ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఆయన భారత సైన్యం అత్యున్నత పదవిని నిర్వహించారు. పాఠశాల విద్య తర్వాత మరో ఆలోచన లేకుండా సైన్యంలో చేరి అంచెలంచెలుగా ఎదిగి తొలి చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ బాధ్యతలు చేపట్టారు. మయన్మార్‌లో భారత్‌ నిర్వహించిన తొలి సర్జికల్‌ స్ట్రైక్స్‌కు కూడా రావతే ఆద్యుడు. గతంలో ఒక హెలికాప్టర్‌ ప్రమాదం నుంచి వెంట్రుక వాసిలో బయటపడ్డారు. ఈ సారి మాత్రం విధి ఆయనకు సహకరించలేదు.


ఉత్తరాఖండ్‌లోని సైనిక కుటుంబంలో జన్మించి..
ఉత్తరాఖండ్‌లోని పౌరీలో రాజ్‌పుత్‌ కుటుంబంలో ఆయన 1958లో జన్మించారు. ఆయన తండ్రి లక్ష్మణ్‌ సింగ్‌ రావత్‌ భారత సైన్యంలో లెఫ్టినెంట్‌ జనరల్‌గా పదవీ విరమణ చేశారు. ఆయన వైస్‌ చీఫ్‌ ఆఫ్‌ ఆర్మీ స్టాఫ్‌గా పనిచేశారు. తండ్రి నుంచి స్ఫూర్తి పొందిన రావత్‌.. పాఠశాల విద్య తర్వాత నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీలో చేరారు. ఇండియన్‌ మిలిటరీ అకాడమీ డెహ్రాడూన్‌లో ఆయనకు స్వార్డ్‌ ఆఫ్‌ ఆనర్‌ లభించింది. డిఫెన్స్‌ సర్వీస్‌ స్టాఫ్‌ కాలేజీలో ఆయన గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. ఆ తర్వాత అమెరికాలోని కాన్సాస్‌లో యునైటెడ్‌ స్టేట్స్‌ ఆర్మీ కమాండ్‌ అండ్‌ జనరల్‌ స్టాఫ్‌ కాలేజీలో హైయ్యర్‌ కమాండ్‌ కోర్స్‌ను పూర్తి చేశారు. దేవీ అహల్యా విశ్వవిద్యాలయంలో ఎంఫిల్‌  పూర్తిచేశారు. మద్రాస్‌ యూనివర్శిటీలో కంప్యూటర్‌ డిప్లొమా చేశారు. 2011లో ఆయన చౌధరీ చరణ్‌ సింగ్‌ యూనివర్శిటీ నుంచి మిలిటరీ మీడియా అండ్‌ స్ట్రాటజిక్‌ స్టడీస్‌పై పీహెచ్‌డీ చేశారు.


11 గుర్ఖా రైఫిల్స్‌తో కెరీర్‌ మొదలుపెట్టి..
1978లో సెకండ్‌ లెఫ్టినెంట్‌గా గూర్ఖా రైఫిల్స్‌లో తన సైనిక కెరీర్‌ను ప్రారంభించారు రావత్‌. ఆయన తండ్రి లక్ష్మణ్‌ రావత్‌ కూడా అదే యూనిట్‌లో కెరీర్‌ ప్రారంభించడం విశేషం. రావత్‌కు ఉగ్రవాద, వేర్పాటువాద నిరోధక ఆపరేషన్లలో విపరీతమైన అనుభవం ఉంది. మేజర్‌గా ఆయన ఉరీ, జమ్ము అండ్‌ కశ్మీర్‌లో కంపెనీ కమాండ్‌గా వ్యవహరించారు. కల్నల్‌గా గూర్ఖా రైఫిల్స్‌లో పనిచేశారు. అనంతరం జమ్ము కశ్మీర్‌లోని సోపూర్‌లో రాష్ట్రీయ రైఫిల్స్‌ సెక్టార్‌ 5 బాధ్యతలు నిర్వహించారు. అనంతరం ఐరాస మెషిన్‌లో భాగంగా డెమోక్రటిక్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ కాంగోలో పనిచేశారు. ఇక్కడ ఆయనకు ఫోర్స్‌ కమాండర్‌ కమెండేషన్‌లు రెండు సార్లు లభించాయి. అనంతరం ఉరీలో జనరల్‌ ఆఫీసర్‌ కమాండింగ్‌ బాధ్యతలు నిర్వహించారు. ఆ తర్వాత లెఫ్టినెంట్‌ జనరల్‌ హోదాలో నాగాలాండ్‌లోని టైగర్‌ కోర్‌ (3వ కోర్‌)కు బాధ్యతలను చూసుకొన్నారు. రావత్‌ 2017 జనవరి 1వ తేదీన ఆర్మీ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించారు.
రావత్‌ బృందం సర్జికల్‌ స్ట్రైక్‌..!
1987లో రావత్‌ బృందం మెక్‌మోహన్‌ రేఖ వద్ద ‘సుబ్రాంగ్‌ చూ’ లోయలో చైనా సైన్యాన్ని బలంగా అడ్డుకొంది. 1962 యుద్ధం తర్వాత మెక్‌మోహన్‌ రేఖ వద్ద జరిగిన తొలి ఘర్షణ అది.
* 2015లో ఆయన ధింపూర్‌లో టైగర్‌ కోర్‌ బాధ్యతలు నిర్వహిస్తున్న సమయంలో మయన్మార్‌లో సర్జికల్‌ స్ట్రైక్స్‌ నిర్వహించారు. 18 మంది భారత జవాన్లను యూఎన్‌ఎల్‌ఎఫ్‌డబ్ల్యూ మిలిటెంట్లు హత్యచేసి మయన్మార్‌ పారిపోయారు. దీంతో భారత సైన్యం సరిహద్దులు దాటి మయన్మార్‌లోకి చొరబడి మరీ మిలిటెంట్లను మట్టుబెట్టింది. ఈ ఆపరేషన్‌కు 21 పారా కమాండోలను వాడారు.
ఒక సారి హెలికాప్టర్‌ ప్రమాదం తప్పించుకొని..
రావత్‌ 2015లో ఒక సారి హెలికాప్టర్‌ ప్రమాదం నుంచి వెంట్రుక వాసిలో తప్పించుకొన్నారు. ఆయన ప్రయాణిస్తున్న చీతా హెలికాప్టర్‌ గాల్లోకి ఎగిరిన కొద్ది సేపటికే కూలిపోయింది. ఈ ప్రమాదం నుంచి రావత్‌ కేవలం స్వల్పగాయాలతో తప్పించుకొన్నారు.
సైన్యంలో కీలక పతకాలు..
రావత్‌ను సైన్యంలో పలు కీలక అవార్డులు వరించాయి. ఆయనకు పరమ విశిష్ఠ సేవా పతకం, ఉత్తమ యుద్ధ సేవా పతకం, అతి విశిష్ఠ సేవాపతకం, యుద్ధ సేవా మెడల్‌, సేనా మెడల్‌, విశిష్ఠ సేవా పతకం  వంటివి ఆయనకు లభించిన అవార్డుల్లో కొన్ని మాత్రమే.


రక్షణ బలగాల మార్గదర్శిగా..
లద్ధాఖ్‌ సంక్షోభ సమయంలో ఆయన త్రివిధ దళాలకు ప్రభుత్వానికి మధ్య వారధిలా పనిచేస్తున్నారు. మూడు దళాలు బీజింగ్‌ను సమష్టిగా ఎదుర్కోనే వ్యూహంలో ఆయన పాత్ర చాలా కీలకం. ఆయన ఫోర్‌స్టార్‌ జనరల్‌.
* భారత్‌ రక్షణ రంగంలో అతిపెద్ద సంస్కరణలకు ఆయన మార్గదర్శి. ప్రభుత్వం భారత్‌లో వేర్వేరు చోట్ల త్రివిధ దళాలకు ఉన్న 17 కమాండ్లను కలిపి ఇంటగ్రెటెడ్‌ థియేటర్‌ కమాండ్లుగా ఏర్పాటు చేసే గురుతర బాధ్యత ఆయనదే.
* ప్రస్తుత ఆర్మీ చీఫ్‌ ఎంఎం నరవణే కంటే ముందు ఆయనే ఆర్మీ బాధ్యతలు నిర్వహించారు.
అంకిత భావం అకుఠిత దీక్ష నిష్కళంకమైన వ్యక్తిత్వం నిజాయితీ నిబద్దత దార్శనికత గల యుద్దవీరుడు. శత్రుదుర్బేజ్యం గా రక్షణ వ్యవస్దను రూపుదిద్ది. త్రివిధ దళాలను సమన్వయ పరుస్తు విధాన నిర్ణయాల రూపకల్పన లో కొత్తఒరవడిని సృస్టించి సాంకేతికతకు పెద్ద పీటవేస్తూ తనదైన శైలి రక్షణ మంత్రిని ప్రధాన మంత్రిని సైతం విస్మయ పరచింది. హాఠాత్ పరిణామం గతం లో హెలీకాప్టర్ ప్రమాదం నుంచి తృటిలో తప్పించుక్నవైనం విస్మరించక ముందే ఈ ప్రమాదం ఉత్తమమైన సైనికాధికారిని బలితీసుకుంది 13 మంది ఈ ప్రమాద బారిన పడటం యావత్ భారతాన్ని విషాదంలోకి నెట్టేసింది. వారి అత్యుత్తమ సేవలను దేశం సదా స్మరిస్తుంది. వారి ఆత్మలకు శాంతి చేకూరాలి. సైనికా నీకు సెల్యూట్. ఓంశాంతి

 త‌దుప‌రి సిడిఎస్‌గా న‌ర‌వాణే?
రావ‌త్ మ‌ర‌ణంతో ఇప్పుడు యావ‌ద్దేశ దృష్టి త‌దుప‌రి సిడిఎస్ ఎవ‌ర‌నే అంశంపై ప‌డింది. సాధార‌ణంగా ఇలాంటి నియామ‌కాలు సీనియారిటీ ప్రాతిప‌దిక‌న జ‌రుగుతాయి. ఇలా చూసుకుంటే న‌ర‌వాణే అంద‌రి కంటే సీనియ‌ర్‌? ఆయ‌నే త‌దుప‌రి సిడిఎస్ అయ్యే అవ‌కాశాలు ఎక్కువ క‌నిపిస్తున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Time stopped in Bihar: Who will shut their show?

(Dr Pentapati Pullarao) No one can stop the Sun’s journey...

నన్ను పరిశోధన జర్నలిస్టుగా నిలిపిన సారథి దాసరి

(ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్)  దాసరి నారాయణ రావ్ (డిఎన్ ఆర్) లైఫ్ అఛీవ్...

స్వర యోగి త్యాగరాజు

నేడు గాన బ్రహ్మ జయంతి(మాడభూషి శ్రీధర్)త్యాగరాజు పుట్టిన రోజు భారతీయ సంగీత...

Most Important exponents of Vaishnava tradition

Today is the 1007th birth anniversary of Ramanujacharya Why returns...