Tuesday, March 28, 2023
HomeArchieveచైనా వైపు అనుమాన దృక్కులు

చైనా వైపు అనుమాన దృక్కులు

3న తైవాన్‌…8న భార‌త్‌
హెలికాప్ట‌ర్లు కూలి సైన్యాధినేత‌ల మ‌ర‌ణం
చొర‌బాట్ల వ్యూహం విడిచి హ‌త్య‌ల వైపు డ్రాగాన్ అడుగులు
(సుబ్ర‌హ్మ‌ణ్యం విఎస్ కూచిమంచి)
రావ‌త్ హెలికాప్ట‌ర్ ప్ర‌మాదం ఇప్పుడు కొత్త అనుమానాల‌ను రేకెత్తిస్తోంది. అంద‌రి చూపులూ డ్రాగ‌న్ వైపు చూస్తున్నాయి. భార‌త్‌తో ఉన్న వైరం దీనికి కార‌ణం. క‌రోనా ఉద్ధృతి ఉన్న స‌మ‌యంలో సైతం డ్రాగ‌న్ కంట్రీ గాల్వ‌న్‌లో చొర‌బాట్ల‌కు ప్ర‌య‌త్నించింది. ఆప‌ద‌ను అదునుగా తీసుకుని భార‌త్‌ను ఇరుకున పెట్టేందుకు చూసింది. బిపిన్ రావ‌త్ వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించడంతో ఆ చొర‌బాటును భార‌త సైన్యం తిప్పికొట్టింది. స‌రిహ‌ద్దు వెంబ‌డి చైనా ఆట‌లు సాగ‌కుండా ఎప్ప‌టిక‌ప్పుడు వ్యూహాల‌ను స‌మీక్షించుకుంటూ రావ‌త్ క‌ట్ట‌డి చేస్తూ వ‌స్తున్నారు. చైనాకు అత్యంత స‌న్నిహిత‌మైన పాకిస్తాన్‌పై స‌ర్జిక‌ల్ స్ట్రైక్స్‌తో విరుచుకుప‌డిన సంద‌ర్భంలోనూ వ్యూహం ర‌చించింది రావ‌త్ ఆధ్వ‌ర్యంలోనే. అప్ప‌ట్లో ఆయ‌న ఆర్మీ చీఫ్‌గా ఉన్నారు.


దుర్మార్గాల‌కు పాల్ప‌డం చైనాకు కొత్తేమీ కాదు. అది చొర‌బాట్ల‌కే ప‌రిమిత‌మ‌వుతుంద‌ని ఇంత‌వ‌ర‌కూ అనుకున్నాం. రావ‌త్ ప్ర‌యాణిస్తున్న హెలికాప్ట‌ర్ కూలిపోవ‌డం వెనుక డ్రాగ‌న్ కోర‌లు ఉన్నాయేమోన‌నే అనుమానాలు పొడ‌సూపుతున్నాయి. ఇలా అనుకోవ‌డానికి కార‌ణ‌ముంది. ఈ నెల 3న హెలికాప్ట‌ర్ కూలి తైవాన్ ఆర్మీ చీఫ్ జ‌న‌ర‌ల్ షెన్ ఇ మింగ్ స‌హా ఎనిమిదిమంది దుర్మ‌ర‌ణం పాల‌య్యారు. రావ‌త్ హెలికాప్ట‌ర్ కూలి 13మంది మ‌ర‌ణించ‌డాన్ని ఈ కోణంలోనే అంద‌రూ చూస్తున్నారు.

తైవాన్‌తో ఉన్న బ‌ద్ద శ‌త్రుత్వం దృష్ట్యా చైనా ఆ ఆర్మీ చీఫ్‌ను అంత‌మొందించ‌డానికి అడుగులేసింది. తైవాన్‌కు అంత‌ర్జాతీయంగా ఉన్న మ‌ద్ద‌తు కార‌ణంగా ఆ దేశాన్ని నేరుగా ఏమీ చేయ‌లేక ఈ ర‌క‌మైన దారుణానికి చైనా తెగ‌బ‌డింద‌ని అంత‌ర్జాతీయంగా అనుమానాలు రేకెత్తుతున్నాయి. త‌న దారికి రాని దేశాల‌ను న‌యానోభ‌యానో వంగేలా చేయ‌డం చైనా వ్యూహంగా ఉంటోంది. భార‌త్ రూపంలో ఇప్పుడు చైనాకు పెను స‌వాలు ఎదుర‌వుతోంది. మేకిన్ ఇండియా ప‌థ‌కం అంత‌ర్జాతీయ విఫ‌ణిలో త‌న మ‌నుగ‌డ‌ను దెబ్బ‌తీస్తుందేమోన‌నే భ‌యం చైనాను వెంటాడుతోంది. అంత‌ర్జాతీయ విఫ‌ణిలో నిల‌బ‌డ‌డానికి కుయుక్తులే శ్రేయ‌స్క‌ర‌మ‌ని చైనా నిర్ణ‌యించుకున్న‌ట్లు ఉంద‌ని విదేశీ నిఘా సంస్థ‌లు భావిస్తున్నాయి.

అమెరికాకు భార‌త్ ద‌గ్గ‌ర‌వుతుండ‌డ‌మూ, ర‌ష్యాతో బంధం మ‌రింత బ‌ల‌ప‌డుతుండ‌డం చైనాకు కంట‌గింపుగా మారింది. ఈ నెల 7న ర‌ష్యా అధ్య‌క్షుడు పుతిన్ భార‌త్ విచ్చేశారు. ప్ర‌ధాని మోడీతో స‌మావేశ‌మ‌య్యారు. హెలికాప్ట‌ర్ల అమ్మ‌కానికి ఒప్పందం కుదుర్చుకున్నారు. మ‌రుస‌టి రోజే రావ‌త్ హెలికాప్ట‌ర్ ప్ర‌మాదంలో మ‌ర‌ణించారు.
వారం రోజుల వ్య‌వ‌ధిలో రెండు దేశాల ఆర్మీ అధిప‌తులు హెలికాప్ట‌ర్లు కూలి మ‌ర‌ణించ‌డం అంత‌ర్జాతీయంగా అనుమానాల‌కు దారితీస్తోంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

Shankar Chatterjee on CM commissions Ramco Cement unit
Kishore kumar on Jagan consoles Pulapatturu
శ్రీపాద శ్రీనివాస్ on నిప్పచ్చరం – ఉషశ్రీ