నవంబర్ 15 తెల్లవారుఝామున తుదిశ్వాస
350 సినిమాల్లో హీరో…80మంది హీరోయిన్లు, 1963లో ఏకంగా 19 సినిమాలు, ఒకే ఏడాది 16 సినిమాల రిలీజ్… తెలుగులో తొలి జేమ్స్‌బాండ్…తొలి కౌబాయ్, తొలి ఈస్ట్‌మన్ కలర్ చిత్రం, తొలి 70 ఎంఎం సినిమా, తొలి ఫుల్ స్కోప్ చిత్రం, 9 చిత్రాల్లో త్రిపాత్రాభినయం, తేనె మనసులు తొలిసినిమా… శ్రీశ్రీ చివరి సినిమా… 50 ఏళ్ళ సినీ కెరీర్… ఎన్నో అవార్డులు… 2009లో పద్మభూషణ్… ఎన్టీఆర్, ఎన్నార్ జాతీయ అవార్డులు….16 సినిమాలకు దర్శకత్వం,
సింహాసనం చిత్రంతో దర్శకునిగా అరంగేట్రం..2008లో ఆంధ్ర యూనివర్శిటీ డాక్టరేట్, రికార్డు స్థాయిలో 2500 అభిమాన సంఘాలు… స్టాంప్ విడుదల చేసిన ఆస్ట్రేలియా… ఇలా ఎన్నని చెప్పం… చెప్పగలం. ఆయనే సూపర్ స్టార్ కృష్ణ. 1942 మే 31న జన్మించిన కృష్ణ 2022 నవంబర్ 15న అస్తమించారు. గుంటూరు జిల్లా బుర్రిపాలెంలో జన్మించారు. ఆయనకు ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు. ఇటీవలే ఆయన భార్య కన్నుమూశారు.