పిల్లల ఇంగ్లీషు సంభాషణకు మురిసిన జగన్
సీఎంను కలిసిన బెండపూడి విద్యార్థులు
అమరావతి, మే 19: పిల్లలు అనర్గళంగా ఆంగ్లంలో ప్రసంగిస్తుంటే ఆయన మురిసిపోయారు. చెదరని చిరునవ్వుతో వారిని గమనించారు. ప్రశ్నలు అడిగారు.
సమాధానాలు రాబట్టారు. ఒక విద్యార్థి అయితే ఏకంగా తనకు సీఎం పీఏగా ఉండాలని ఉందన్నాడు. నేను ఐఏఎస్ అవుతాననీ అప్పటి వరకూ ఇదే కుర్చీలో ఉండండి సార్ అనడంతో ఆయన ముఖంలో ఆనందం రెట్టింపైంది.
ఈ సంఘటన జరిగింది ఏపీ సీఎం వైయస్ జగన్ క్యాంపు కార్యాలయంలో. కాకినాడ జిల్లా తొండంగి మండలం బెండపూడి జిల్లా పరిషత్ హైస్కూలు విద్యార్థులు ఈమధ్య తమ ఆంగ్ల ప్రావీణ్యంతో అందర్నీ ఆకట్టుకుంటున్నారు. ఈ వార్త సీఎం దాకా వెళ్ళడంతో విద్యార్థులను అమరావతికి రప్పించారు.
విద్యా శాఖపై జరిగిన సమావేశంలో వారితో మాట్లాడారు వైయస్.జగన్. సీఎం సమక్షంలో వారు అనర్గళంగా ఇంగ్లిషులో మాట్లాడారు.
ప్రభుత్వ స్కూళ్లలో నాడు-నేడు, ఇంగ్లిషు మీడియం బోధన వంటి గొప్ప కార్యక్రమాల ద్వారా మీరే మాకు స్ఫూర్తిగా నిల్చారంటూ విద్యార్ధులు ప్రశంసించారు.
వారి ప్రతిభను పరికించిన జగన్ హైస్కూల్ విద్యార్ధులను అభినందించారు.
ఈ సమీక్షా సమావేశానికి విద్యాశాఖమంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్ సమీర్ శర్మ, పాఠశాల విద్యాశాఖ స్పెషల్ సీఎస్ బుడితి రాజశేఖర్, స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ ఎస్ సురేష్ కుమార్, సర్వ శిక్షా అభయాన్ ఎస్పీడీ వెట్రి సెల్వి, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.
Jagan uplifting d lives of the poor and downtrodden. Education can bring a change in their lives.