ఇళ్ళ స్థ‌లాల‌పై ప్ర‌త్యామ్నాయ ప్ర‌ణాళిక‌

Date:

విశాఖ‌లో 1.43 ల‌క్ష‌ల మందికి ప‌ట్టాలిచ్చేందుకు సిద్ధం
నిర్మాణ సామ‌గ్రికి గోడౌన్లు
గృహనిర్మాణ శాఖపై వైయస్‌.జగన్‌ సమీక్ష
అమరావతి, ఏప్రిల్ 18:
ఆంధ్ర ప్ర‌దేశ్ గృహ నిర్మాణం శాఖ గ‌డిచిన ఆర్థిక సంవ‌త్స‌రంలో 3600 కోట్ల రూపాయ‌లు ఖ‌ర్చు చేసింద‌ని ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.13,105 కోట్లు ఖ‌ర్చు చేయ‌నుంది. ఈ ఏడాది 35 లక్షల మెట్రిక్‌ టన్నుల సిమెంటు, 3.46 లక్షల మెట్రిక్‌టన్నుల స్టీల్‌ను ఇళ్ల నిర్మాణానికి వినియోగించనున్నట్లు వెల్ల‌డించారు. గృహ నిర్మాణ శాఖ‌పై సీఎం జ‌గ‌న్ సోమ‌వారం స‌మీక్ష చేప‌ట్టారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ఏమ‌న్నారంటే..
కోర్టు వివాదాల్లో ఉన్న ఇళ్ల స్థలాలపై వెంటనే ప్రత్యామ్నాయ ప్రణాళిక సిద్దంచేయాలని అధికారులను ఆదేశించారు. కేసులు పరిష్కారం ఆలస్యమయ్యే సూచనలు ఉన్నచోట… ప్రత్యామ్నాయ స్థలాలను గుర్తించే కార్యక్రమం చేపట్టాలన్నారు. ఇందులో జాప్యం లేకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. కోర్టు వివాదాలు తీరడంతో విశాఖలో 1.43 లక్షల మందికి పట్టాలు ఇచ్చేందుకు సర్వం సిద్ధమైంద‌ని సీఎం వెల్ల‌డించారు. విశాఖలో పట్టాలు పంపిణీ పూర్తికాగానే, వాటికి సంబంధించిన ఇళ్ల నిర్మాణ పనులు జూన్‌నాటికి ప్రారంభం అవుతాయని అధికారులు చెప్పారు. దాదాపు 63 లే అవుట్లలో ఇళ్ల నిర్మాణానికి ప్ర‌భుత్వం సమాయత్తమవుతోంది. ఇక్కడ భూమిని చదును చేయడంతోపాటు, అప్రోచ్‌ రోడ్ల నిర్మాణం, లే అవుట్లలో నీళ్లు, విద్యుత్‌ సౌకర్యం ఏర్పాటుకు అన్నిరకాల చర్యలు తీసుకోవాలని సీఎం అధికారుల‌ను ఆదేశించారు.


నిర్మాణ సామ‌గ్రి నిల్వ‌కు గోడౌన్లు
5వేలకుపైగా ఇళ్ల నిర్మాణం జరుగుతున్నచోట నిర్మాణ సామగ్రిని ఉంచడానికి వీలుగా గోడౌన్ల నిర్మాణం చేపడుతున్నామని అధికారులు వెల్లడించారు. 66 గోడౌన్లలో 47 గోడౌన్ల నిర్మాణం ప్రారంభమయ్యిందని తెలిపారు. ఇళ్లకు ఇచ్చే కరెంటు సామగ్రి అత్యంత నాణ్యతతో ఉండాలని సీఎం ఆదేశించారు. బల్బులు, ఫ్యాన్లు, ట్యూబ్‌లైట్లు అన్నీకూడా నాణ్యతతో ఉండాలన్నారు. నాణ్యత లోపిస్తే తీవ్ర చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. నాణ్యతా ప్రమాణాలు ఉన్నవాటినే కొనుగోలు చేయాలని అధికారులకు స్పష్టం చేశారు.


ప్రజాప్ర‌తినిధుల‌కు స‌త్కారం
పేదల ఇళ్ల నిర్మాణంలో చురుగ్గా పాలుపంచుకుంటున్న ప్రజాప్రతినిధులను సత్కరించాలని నిర్ణయించారు. వారు చురుగ్గా వ్యవహరిస్తున్నచోట నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయని అధికారులు వెల్లడించారు. ఇలాంటి స్థానిక ప్రజాప్రతినిధులను గౌరవించాలని నిర్ణయించారు. మండలానికి ఒక సర్పంచ్‌ని, మున్సిపాల్టీకి ఒక కౌన్సిలర్, జిల్లాకు ఒక ఎంపీపీ, జిల్లాకు ఒక జడ్పీటీసీ చొప్పున అవార్డులు ఇవ్వాలని నిర్ణయించారు. జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణం పూర్తయ్యే నాటికి తాగునీరు, డ్రైనేజీ, కరెంటు లాంటి కనీస మౌలిక సదుపాయాలు ఉండాలని ఆదేశించారు. దీని తర్వాత కాలనీలకు కావాల్సిన సామాజిక, మౌలిక సదుపాయాలు కల్పిస్తూ ముందుకుసాగాలని అభిల‌షించారు. కాలనీల్లో సమగ్ర ప్రణాళికను దృష్టిలో ఉంచుకుని ప్రాధాన్యతా క్రమంలో పనులు చేపట్టుకుంటూ ముందుకు సాగాలన్నారు. దీనికి సంబంధించిన విభాగాలన్నీ అత్యంత సమన్వయంతో ముందుకుసాగాలని కోరారు.
భవిష్యత్తులో కూడా ప్రభుత్వానికి ఇది బృహత్తర ప్రణాళిక అనీ, జగనన్న కాలనీల్లో అభివృద్ధి పనులను అత్యంత ప్రాధాన్యతగా తీసుకుంటామని తెలిపారు ముఖ్య‌మంత్రి.


జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకంపై సమీక్ష
10.2 లక్షలమంది ఇప్పటివరకూ పథకాన్ని వినియోగించుకున్నార‌నీ, 6.15 లక్షల మందికి రిజిస్ట్రేషన్‌ పూర్తయింద‌నీ, మిగిలినవారికీ వీలైనంత త్వరగా రిజిస్ట్రేషన్లు పూర్తిచేయాలని సీఎం జ‌గ‌న్ ఆదేశించారు. – ఈ ప్రక్రియ ముందుకు సాగుతున్న కొద్దీ మరింత మంది వ‌స్తారన్న అభిలాష‌ను ముఖ్యమంత్రి వ్య‌క్తంచేశారు. టిడ్కో ఇళ్ల నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. టిడ్కో ఇళ్లు అత్యంత పరిశుభ్రంగా ఉండేలా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇందుకు అవ‌స‌ర‌మైన మార్గదర్శకాలు తయారుచేయాలని కోరారు.


ఎంఐజీ ప్లాట్ల పథకంపైనా సీఎం సమీక్ష
పట్టణాలు, నగరాలు ఉన్న 116 నియోజకవర్గాల్లో ఎంఐజీ ప్లాట్ల పథకానికి ముందు ప్రాధాన్యత ఇవ్వాల‌ని సీఎం సూచించారు. మిగిలిన నియోజకవర్గాల్లో కూడా ఎంఐజీ ఇళ్ల పథకంకోసం కార్యాచరణ ప్రణాళిక సిద్ధంచేయాలన్నారు. ఇప్పటికే 41 నియోజకవర్గాల్లో 4127.5 ఎకరాల భూములను గుర్తించామని అధికారులు తెలిపారు. వివాదాలు, చిక్కులు లేనివిధంగా క్లియర్‌ టైటిల్‌తో సరసమైన ధరలకు ఈ ప్లాట్లు ఇస్తామన్నారు. మౌలిక సదుపాయాలకోసం లే అవుట్‌లో అన్నిరకాల ప్రమాణాలను పాటిస్తామని సీఎం చెప్పారు. లే అవుట్లకు మార్గదర్శకంగా ప్రభుత్వ ఎంఐజీ లేవుట్‌ ఉండాలన్న సీఎం.
ఈ సమీక్షా సమావేశంలో ఎనర్జీ, అటవీ, పర్యావరణ, భూగర్భ గనులశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, గృహనిర్మాణశాఖ మంత్రి జోగి రమేష్, సీఎస్‌ డాక్టర్‌ సమీర్‌ శర్మ, గృహనిర్మాణశాఖ స్పెషల్‌ సీఎస్‌ అజయ్‌ జైన్, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్‌ సీఎస్‌ వై శ్రీలక్ష్మి, ఎనర్జీ సెక్రటరీ బి శ్రీధర్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Can BJP make a mark in Tamil Nadu?

(Dr Pentapati Pullarao)  There is much discussion whether BJP...

2024 is not 2004 wait till 4th June

(Dr Pentapati Pullarao) 2024 is not 2004 There are many...

Typical ceremonies in Indian Tradition

My experience at the 'Dhoti (boy) and Half-saree (girl)...

ఉషశ్రీరామనవమి

(డా. పురాణపండ వైజయంతి) శ్రీరామనవమి అంటే…అందరికీ రాములవారి కల్యాణం.. శ్రీరామనవమిగానే తెలుసు.కాని మాకు...