Tuesday, March 28, 2023
HomeArchieveరోడ్డు ప్ర‌మాదం చూసి ఆ మంత్రిగారు ఏం చేశారంటే!

రోడ్డు ప్ర‌మాదం చూసి ఆ మంత్రిగారు ఏం చేశారంటే!

త‌న వాహ‌నాన్నే అంబులెన్సుగా మార్చిన వైనం
అన‌కాప‌ల్లి, ఏప్రిల్ 17:
ఆంధ్ర ప్ర‌దేశ్ మంత్రిగారొక‌రు త‌న ఔదార్యాన్ని చాటుకున్నారు. ఓ రోడ్డు ప్ర‌మాదంలో గాయ‌ప‌డిన ఇద్ద‌రిని ఆస్ప‌త్రికి త‌ర‌లించ‌డానికి ఆయ‌న త‌న వాహ‌నాన్నే అంబులెన్సులా మార్చారు. తాను వేరే వాహ‌నంలో వెళ్ళాల్సిన చోటుకు వెళ్లారు.

అంతే కాకుండా ఆస్ప‌త్రికి ఫోన్ చేసి, క్ష‌త‌గాత్రుల‌కు మెరుగైన వైద్యం అందించాల‌ని వైద్యుల‌ను కోరారు. ఈ సంఘ‌ట‌నలో ఔదార్యం చూపిన మంత్రిగారు గుడివాడ అమ‌ర్నాథ్‌. ఇటీవ‌లే అంటే ఈ నెల 11న ఆయ‌న వైయ‌స్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి క్యాబినెట్‌లో ఐటీ శాఖ మంత్రిగా బాధ్య‌త‌లు స్వీక‌రించారు.

యువ‌కుడైన మంత్రి త‌నదంటూ ఒక మార్కు ఉండేలా ప‌నిచేస్తున్నారు. ఈ క్ర‌మంలో ఆదివారం ఓ కార్య‌క్ర‌మంలో పాల్గొనేందుకు అన‌కాప‌ల్లి వెడుతున్నారు. దారిలో ఓ యాక్సిడెంటు అయిన విష‌యాన్ని గ‌మ‌నించారు. వెంట‌నే కాన్వాయ్‌ను ఆపి, క్ష‌త‌గాత్రుల‌ను త‌న వాహ‌నంలో ఆస్ప‌త్రికి పంపారు. త‌న ఔదార్యాన్ని చాటుకున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

Shankar Chatterjee on CM commissions Ramco Cement unit
Kishore kumar on Jagan consoles Pulapatturu
శ్రీపాద శ్రీనివాస్ on నిప్పచ్చరం – ఉషశ్రీ