ఫ్యూచర్ సిటీలో హై స్పీడ్ రైల్వే స్టేషన్

0
53

బులెట్ రైల్ సమీక్షలో సీఎం రేవంత్ సూచన
హైదరాబాద్, జూన్ 16:
ఫ్యూచర్ సిటీలో హైదరాబాద్- బెంగళూరు హై స్పీడ్ రైల్ స్టేషన్ ఏర్పాటు చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపాదించారు. సోమశిల, నల్లమల వద్ద కూడా స్టేషన్లు ఉండాలన్నారు. ఎంసీఆర్ హెచ్ ఆర్ డి బోధి పెవిలియన్ లో బుల్లెట్ రైలు ప్రాజెక్ట్ ,వరంగల్ ఎయిర్ పోర్టు అంశాలపై ఆయన మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు ఎంపీ వేం నరేందర్ రెడ్డి ,స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్,సీఎంఓ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాస రాజు, టి.జి.ఐ.ఐ.సి. కమిషనర్ శశాంక, రంగారెడ్డి కలెక్టర్ నారాయణ రెడ్డి , ఆర్ అండ్ బీ స్పెషల్ సెక్రటరీ ప్రావీణ్య హాజరయ్యారు.

హైదరాబాద్ పుణె రైల్వే మార్గం లో వికారాబాద్ అనంతగిరి దగ్గర స్టేషన్ ఏర్పాటు చేయాలని సీఎం చెప్పారు. అనంతగిరి నుంచి ఐటీ హబ్ కు రవాణా సౌకర్యం ఏర్పాటు చేయాలని సూచించారు. హైదరాబాద్ టు బెంగళూరు హై స్పీడ్ రైల్వే లైన్ భారత్ ఫ్యూచర్ సిటీ లో స్టేషన్ ఏర్పాటు చేయాలనీ, మన్ననూర్ దగ్గర నల్లమల స్టేషన్, సోమశిల సమీపం లో స్టేషన్ ప్లాన్ చేయాలని సూచించారు. టూరిజం ప్రాంతాలను దృష్టి లో ఉంచుకొని రైల్వే లైన్ ఉండాలని కోరారు. హైదరాబాద్ (శంషాబాద్)ను బుల్లెట్ ట్రైన్ హబ్ గా పిలవాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం వరంగల్ ఎయిర్ పోర్ట్ డిజైన్ లపైన సీఎం చర్చించారు. వరంగల్ ఎయిర్పోర్ట్ కాకతీయ సామ్రాజ్యం, వారసత్వ సంపద అడుగడుగునా ఉట్టి పడేలా ఉండాలని సీఎం చెప్పారు. ఎయిర్ పోర్టు ముందు భారీ ఐలాండ్ ఉండాలనీ, అందులో ఐలాండ్ లో రాణి రుద్రమ విగ్రహం , రుద్రదేవుడు విగ్రహాలతో పాటు భారీ నంది విగ్రహం ఏర్పాటు చేయాలనీ సీఎం రేవంత్ సూచించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here