షూటింగ్ స్టార్ జస్పాల్ రాణా కన్నుమూత

0
83

న్యూఢిల్లీ, జూన్ 12: భారత షూటింగ్ స్టార్ జస్పాల్ రాణా కన్నుమూశారు. ఆయన వయసు 49. ప్రస్తుతం ఆయన మను భాకర్ కు కోచ్ గా వ్యవహరిస్తున్నారు. ఇటీవలే ఆయనకు స్టెంట్ వేశారు. మ్యూనిచ్ ఐ.ఎస్.ఎస్.ఎఫ్. కప్ లో ఉండగా ఆయనకు ఛాతి నొప్పి వచ్చింది. తిరిగి వస్తుండగా విమానంలో కూడా ఆయనకు ఛాతి నొప్పి వచ్చింది. వెంటనే ఆయనను ఢిల్లీలో ఆస్పత్రిలో చేర్చారు. అక్కడ గురువారం రాత్రి ఆయన కన్నుమూశారు. నేషనల్ రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా చైర్మన్ కాలికేష్ నారాయణ సింగ్ దేవ్ ఈ విషయాన్ని చెప్పారు.
కామన్ వెల్త్ క్రీడలలో రాణా అత్యంత ప్రతిభ కనబరిచారు. 2006 దోహా ఆసియన్ గేమ్స్ లో ఆయన మూడు బంగారు పతకాలను గెలుచుకున్నారు. 1994 లో కూడా మిలన్ వరల్డ్ ఛాంపియన్ షిప్ జూనియర్ విభాగంలో ఆయన బంగారు పతాకం సాధించారు.
రేవంత్ రెడ్డి సంతాపం
జస్పాల్ మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు. ఆయన మృతి కారణంగా భారత్ ఒక ప్రతిభావంతుడైన క్రీడాకారిణి కోల్పోయిందన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here