మూడేళ్ళ నాలుగు నెలల్లో 500 కిడ్నీ మార్పిళ్లు

0
128

కిడ్నీ మార్పిడిలో నిమ్స్ ఘనత
వైద్య బృందానికి సీఎం అభినందనలు
హైదరాబాద్, మే 22:
కిడ్నీ ట్రాన్స్ ప్లాంట్స్ లో అరుదైన మైలురాయిని అందుకున్న నిమ్స్ వైద్య బృందానికి ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు.

హైదరాబాద్‌లోని నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌ (NIMS) కిడ్నీ ట్రాన్స్ ప్లాంట్​లో దేశంలోనే అరుదైన రికార్డు నమోదు చేసింది.

నిమ్స్ యూరాలజీ విభాగం ఇప్పటివరకు 2,000 కిడ్నీ మార్పిడులు పూర్తి చేసింది. కిడ్నీ మార్పిడులలో దక్షిణ భారత దేశంలో నిమ్స్​ నెంబర్ వన్​గా నిలిచింది. దేశంలో కిడ్నీ ట్రాన్స్ ప్లాంట్​లో గుజరాత్​ లోని ఐకేడీఆర్‌సీ నెంబర్ వన్ స్థానంలో ఉంది. సెకండ్ ప్లేస్‌లో లూథియానా క్రిస్టియ‌న్ కాలేజీలో ఉండగా.. నిమ్స్ మూడో స్థానంలో ఉంది.

ఈ అరుదైన మైలురాయిని సాధించి కిడ్నీ బాధితులకు విశేష సేవలు అందించిన నిమ్స్ వైద్య బృందానికి ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. ఈ 2,000 మందిలో 1,900 మంది అంటే 95% మంది రాజీవ్ ఆరోగ్యశ్రీ, ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఉచితంగా కిడ్నీ మార్పిడి చేయించుకోవటం విశేషం. 2023 జనవరి నుంచి గడిచిన మూడేళ్ళ నాలుగు నెలల్లోనే.. 500 కిడ్నీ మార్పిడులు చేసి రికార్డు నెలకొల్పింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here